ఎమ్మార్వో వణుకు ! కిటికీ అవతలే రైతు !

అబ్దుల్లాపూర్‌మెట్‌ తహసీల్దార్‌ విజయారెడ్డి సజీవ దహనంతో రెవెన్యూ డిపార్టుమెంట్ ఉద్యోగులు వణికిపోతున్నారు. అనుమానాస్పదంగా ఎవరు కనిపించినా హడలెత్తిపోతున్నారు. మొన్న ఏపీలో ఓ ఎమ్మార్వో అధికారిని తన కార్యాలయంలో అడ్డంగా తాడుకట్టి సంరక్షణ ఏర్పాటు చేసుకున్న విషయం తెలిసిందే. ఇటు రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఓ రైతు పెట్రోల్‌ బాటిల్‌తో ఎమ్మార్వో కార్యాలయానికి రావటంతో అధికారులు చేసిన హంగామా అంతాఇంతా కాదు..తీరా రైతు చెప్పిన కారణం విన్నాకా అందరూ ఊపిరిపీల్చుకున్నారు. దరఖాస్తులు ఇచ్చేందుకు వచ్చే వారు ఎలా ప్రవర్తిస్తారో […]

ఎమ్మార్వో వణుకు ! కిటికీ అవతలే రైతు !

అబ్దుల్లాపూర్‌మెట్‌ తహసీల్దార్‌ విజయారెడ్డి సజీవ దహనంతో రెవెన్యూ డిపార్టుమెంట్ ఉద్యోగులు వణికిపోతున్నారు. అనుమానాస్పదంగా ఎవరు కనిపించినా హడలెత్తిపోతున్నారు. మొన్న ఏపీలో ఓ ఎమ్మార్వో అధికారిని తన కార్యాలయంలో అడ్డంగా తాడుకట్టి సంరక్షణ ఏర్పాటు చేసుకున్న విషయం తెలిసిందే. ఇటు రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఓ రైతు పెట్రోల్‌ బాటిల్‌తో ఎమ్మార్వో కార్యాలయానికి రావటంతో అధికారులు చేసిన హంగామా అంతాఇంతా కాదు..తీరా రైతు చెప్పిన కారణం విన్నాకా అందరూ ఊపిరిపీల్చుకున్నారు. దరఖాస్తులు ఇచ్చేందుకు వచ్చే వారు ఎలా ప్రవర్తిస్తారో తెలియక బిక్కుబిక్కుమంటున్నారు.. కొన్ని ప్రాంతాల్లో ఎమ్మార్వో ఆఫీసుల్లో పోలీసు భద్రత కూడా ఏర్పాటు చేశారు. ఇంకా కొందరు ఎమ్మార్వోలు అయితే తమ ఛాంబర్‌లోకి అధికారులు తప్పు వెరేవారిని ఎవరిని రానివ్వడంలేదు. తాజాగా జగిత్యాల జిల్లాలోనూ ఓ ఎమ్మార్వో కిటికీ నుంచే దరఖాస్తులు తీసుకుంటూ కనిపించాడు.

జిల్లాలోని ఇబ్రహీంపట్నం తహసీల్దార్‌ కార్యాలయంలో దరఖాస్తులు ఇచ్చేందుకు అర్జీదారులు ఇచ్చే పత్రాలను కిటికిలోంచే అధికారులు తీసుకుంటున్నారు. తమ కార్యాలయానికి వచ్చిన వారిని  ఎవరిని లోపలికి అనుమతించడం లేదు. ఒకవేళ తప్పని సరి పరిస్థితుల్లో బాధితులను లోపలికి పిలిస్తే గేటు వద్ద వారిని వీఆర్‌ఏలు తనిఖీ చేసిన తర్వాతే అనుమతిస్తున్నారు. ఈ పరిణామంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు సరిగా పనిచేస్తే దాడి ఘటనలు ఎందుకు జరుగుతాయని మండిపడుతున్నారు.