AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అతనంటే పాములకు ఎంతిష్టమో తెలుసా..?

పాములు.. చూస్తేనే భయంతో పరుగులు తీస్తాం. అలాంటిది పాములను పట్టుకోవడం అంటే ఇంకేముంది ఒంట్లో వణుకు పడుతుంది. కానీ, చిన్న సర్పమైనా అతిపెద్ద గిరినాగు అయినా వాటిని అవలీలగా పట్టేస్తాడు పాముల ఆంజనేయులు. అంతేకాదు..నాగులకే నాట్యం నేర్పిస్తాడు. జోగులాంబ గద్వాల జిల్లా ఉండవెల్లి మండలంలోని కంచుపాడ్‌ గ్రామానికి చెందిన పాముల ఆంజనేయులు అంటే స్థానికంగా తెలియనివారుండరు. ఆయనకు పాములే నేస్తాలు. ఎక్కడ పాము ఉందని తెలిస్తే..తక్షణం అక్కడ వాలిపోతాడు. ఎంత దూరమైనా, ఎంత రాత్రైనా విషయం తెలిసిన […]

అతనంటే పాములకు ఎంతిష్టమో తెలుసా..?
Pardhasaradhi Peri
| Edited By: |

Updated on: Nov 16, 2019 | 5:39 PM

Share

పాములు.. చూస్తేనే భయంతో పరుగులు తీస్తాం. అలాంటిది పాములను పట్టుకోవడం అంటే ఇంకేముంది ఒంట్లో వణుకు పడుతుంది. కానీ, చిన్న సర్పమైనా అతిపెద్ద గిరినాగు అయినా వాటిని అవలీలగా పట్టేస్తాడు పాముల ఆంజనేయులు. అంతేకాదు..నాగులకే నాట్యం నేర్పిస్తాడు. జోగులాంబ గద్వాల జిల్లా ఉండవెల్లి మండలంలోని కంచుపాడ్‌ గ్రామానికి చెందిన పాముల ఆంజనేయులు అంటే స్థానికంగా తెలియనివారుండరు. ఆయనకు పాములే నేస్తాలు. ఎక్కడ పాము ఉందని తెలిస్తే..తక్షణం అక్కడ వాలిపోతాడు. ఎంత దూరమైనా, ఎంత రాత్రైనా విషయం తెలిసిన వెంటనే పరుగున వెళ్తాడు. పాములు కూడా అతను ఎక్కడ ఉంటే అక్కడే ఉండిపోతాయి. ఎంతటి విష సర్పమైన అవలీలగా అతని చేతిలోకి వచ్చేస్తుంది. అలా పాములను ప్రేమగా చూసుకుంటాడు. వాటికి ముద్దు పేర్లు పెట్టి పిలుచుకుంటాడు. పాములను చంపకూడదని సందేశమిస్తాడు. ఎక్కడ పాము కనిపించినా తనకు సమాచారం ఇవ్వాలని కోరుతున్నాడు. ఆంజనేయులు తన 9వ యేట నల్లమల అడవిలోకి వెళ్లి..అక్కడ కొందరు కోయదొరల వద్ద గరుడ విద్యను నేర్చుకున్నట్లుగా చెబుతున్నాడు. ఏడేళ్లపాటు గరుడ విద్యలో అభ్యసం చేసిన ఫలితంగానే ఎంతటి విషసర్పమైన తన వశమవుతుందని, తనను కాటువేయమని అంటున్నాడు. అలా ఏ పామైనా తన మాట వినాల్సిందే, తన వెంట ఎప్పుడు కనీసం రెండుమూడు పాములైనా ఉంటాయి. ఆ నీలకంఠుడి మెడలో ఉన్నట్లుగా ఆంజనేయులు కూడా నాగులను మెడలో వేసుకు తిరుగుతాడు. పాములు పట్టడంతో పాటుగా, పాముకరిచినా, తేలు కుట్టిన వారికి వైద్యం చేస్తుంటాడు. బాధితులు కొన్ని సూచనలు కూడా చేస్తుంటాడు స్నేక్‌ఫ్రెండ్‌ ఆంజనేయులు.

ఎవరైనా పామును చూస్తే సగం భయంతో చెమటలు పడతాయి. ఇదే మాదిరిగా పాము కాటుకు గురై వారిలో కొందరు విషం ఎక్కక ముందే భయంతో కన్నుమూస్తారు. పాము కుట్టినప్పుడు ఎటువంటి భయాందోళనలకు లోను కాకుండా తక్షణం ఆసుపత్రికి వెళితే ప్రాణాలు రక్షించుకోవచ్చునని ఆంజనేయులు చెపుతున్నాడు. సాధారణంగా పాములు మనుషులను కాటు వేయవు. తమకు హానీ జరుగుతుందని భావించినప్పుడే అవి కూడా భయంతో కాటు వేస్తాయి. పొలాలలో గట్ల మీద ఉండే పాములను మనుషులు తొక్కినప్పుడు కాటు వేస్తుంటాయి. అన్ని పాములు విషసర్పాలు కావని, కొన్ని విషం లేనివి కూడా ఉంటాయని ఆయన చెప్పుకొచ్చారు. ఒక రకంగా పాములు పొలాలలో ఎలుకలను వధించి రైతులకు మేలు చేస్తుంటాయని అంటున్నాడు. ప్రభుత్వం తనకు సహకరిస్తే పాములను కాపాడుతూనే ప్రజలకు మరింత సేవ చేస్తానని చెబుతున్నాడు. తనకు కావాల్సిన పరికరాలను, మరికొన్ని సదుపాయాలను కల్పించాలని కోరుతున్నాడు. విషసర్పాలను పట్టుకోవటం, వాటికి హాని కలగకుండా చూసే వాళ్లు చాలా తక్కువ. అటు పాములకు, ఇటు ప్రజలకు మేలు చేసే ఆంజనేయులు లాంటివారికి తగిని ప్రోత్సహం అందించాల్సిన అవసరం ఉందంటున్నారు పలువురు మేధవులు.

Follow Us
రోజంతా యాక్టివ్‌గా ఉండాలంటే ఉదయం ఈ 5 తప్పులు అస్సలు చేయొద్దు!
రోజంతా యాక్టివ్‌గా ఉండాలంటే ఉదయం ఈ 5 తప్పులు అస్సలు చేయొద్దు!
పుట్టుకతోనే దైవ అనుగ్రహం పొందిన రాశులు ఇవే.. మీ రాశి కూడా ఈ జాబిత
పుట్టుకతోనే దైవ అనుగ్రహం పొందిన రాశులు ఇవే.. మీ రాశి కూడా ఈ జాబిత
ఇంట్లో నేలపై పాకుతూ బల్లి కనిపిస్తే శుభమా? అశుభమా? శాస్త్రం..
ఇంట్లో నేలపై పాకుతూ బల్లి కనిపిస్తే శుభమా? అశుభమా? శాస్త్రం..
కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా?
కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా?
శని త్రయోదశి–మాసశివరాత్రి అరుదైన యోగం.. ఈ ఒక్క పూజ చేస్తే శని దోష
శని త్రయోదశి–మాసశివరాత్రి అరుదైన యోగం.. ఈ ఒక్క పూజ చేస్తే శని దోష
రాత్రిపూట గోళ్లు కత్తిరించుకోవద్దని ఎందుకు చెబుతారు? మూఢనమ్మకం..
రాత్రిపూట గోళ్లు కత్తిరించుకోవద్దని ఎందుకు చెబుతారు? మూఢనమ్మకం..
బుధుడి తిరోగమనం.. వీరి జీవితంలో ఊహించని మార్పులు
బుధుడి తిరోగమనం.. వీరి జీవితంలో ఊహించని మార్పులు
ఘుమఘుమలాడే పక్కా పల్లెటూరి స్టైల్ చేపల పులుసు
ఘుమఘుమలాడే పక్కా పల్లెటూరి స్టైల్ చేపల పులుసు
మరణించిన వారి ఆభరణాలు ఎందుకు భద్రపరుస్తారు? గరుడ పురాణం చెప్పిన..
మరణించిన వారి ఆభరణాలు ఎందుకు భద్రపరుస్తారు? గరుడ పురాణం చెప్పిన..
తెలంగాణ వాసులకు బిగ్‌ అలర్ట్.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
తెలంగాణ వాసులకు బిగ్‌ అలర్ట్.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు