తులసి మొక్కను ఏ రోజు ఇంటిలో నాటకూడదో తెలుసా?

Samatha

25 January 2026

హిందూ సంప్రదాయాలలో తులసి మొక్కకు చాలా ప్రాధాన్యత ఉంటుంది. అందుకే ప్రతి ఒక్కరి ఇంటిలో తులసి మొక్క అనేది తప్పని సరిగా ఉంటుంది.

హిందూ సంప్రదాయం

ప్రతి రోజూ ఇంటిలోని మహిళ తులసి మొక్కకు పూజలు చేయడం వలన ఇంటిలో ప్రతి కూల శక్తి తగ్గిపోయి, సానుకూల శక్తి పెరుగుతుంది అని చెబుతుంటారు పండితులు.

పూజలు 

అయితే తులసి మొక్కపై కూడా వాస్తు ప్రభావం ఉంటుందని చెబుతున్నారు వాస్తు శాస్త్ర నిపుణులు. తులసి మొక్కను నాటే క్రమంలో తప్పకుండా వాస్తు నియమాలు పాటించాలంట.

వాస్తు ప్రభావం

కొంత మంది తిథి, రోజు చూడకుండా తులసి మొక్కను నాటుతారు. కానీ తులసి మొక్కను నాటాలి అంటే తప్పకుండా శుభ సమయం, శుభకరమైన రోజు మాత్రమే నాటాలంట.

సమయం,తిథి

తులసి లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు, విష్ణువు అనుగ్రహం కోసం కూడా తులసిని పూజిస్తారు. అందువలన దీనిని మంచి శుభదినం చూసి నాటడం వలన ఇంటిలో ఆనందం, శ్రేయస్సు నెలకొంటుందంట.

లక్ష్మీస్వరూపం

తులసి నాటడానికి అద్భుతమైన రోజు గురువారం, విష్ణువు, విష్ణువు ఈ వారం అంటే చాలా ఇష్టం. అందుకే ఈ రోజున తులసి మొక్కను నాటడం శుభప్రదం అంటారు.

మంచి రోజు

అంతేకాకుండా లక్ష్మీదేవికి అంకితం చేయబడిన శుక్రవారం కూడ తులసి మొక్కను ఇంటిలో నాటవచ్చునంట. దీని వలన ధనలాభం కలుగుంది. సంపదకు లోటు ఉండదు.

ధనలాభం

ఇక తులసి మొక్కను పౌర్ణమి, శుక్లపక్షంలో నాటడం మంచిది, అలాగే దీనిని ఎట్టి పరిస్థితుల్లో మంగళవారం, శని వారం ఇంటిలో నాటకూడదంట.

నాటకూడని రోజులు