Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆ నియోజకవర్గంలో వానర వనాలుగా మారిన ఊర్లు.. జనాభా కంటే కోతులే ఎక్కువట.. ఎక్కడో చూద్దాం పదండి

వామ్మో ఇది ఊరా..? లేక వానర లోకమా? గుంపులు గుంపులుగా కనిపిస్తున్న ఈ వానరసైన్యాన్ని చూసిన ప్రతి ఒక్కరికీ ఇదే డౌట్‌ వస్తుంది. ఊర్లో మనుషుల జనాభా కంటే ఇక్కడ కనిపిస్తున్న...

ఆ నియోజకవర్గంలో వానర వనాలుగా మారిన ఊర్లు..  జనాభా కంటే కోతులే ఎక్కువట.. ఎక్కడో చూద్దాం పదండి
Monkeys-Hulchal
Follow us
Ram Naramaneni

|

Updated on: Jan 30, 2021 | 10:20 PM

వామ్మో ఇది ఊరా..? లేక వానర లోకమా? గుంపులు గుంపులుగా కనిపిస్తున్న ఈ వానరసైన్యాన్ని చూసిన ప్రతి ఒక్కరికీ ఇదే డౌట్‌ వస్తుంది. ఊర్లో మనుషుల జనాభా కంటే ఇక్కడ కనిపిస్తున్న కోతుల సంఖ్యనే ఎక్కువగా ఉందనిపిస్తోంది. ఆ నియోజకవర్గంలోని చాలా ఊర్లలో ఇదే పరిస్థితి.  పొద్దున లేచింది మొదలు వానర చేష్టలతో ఇక్కడి స్థానికులు పడుతున్న కష్టాలు వర్ణనాతీతంగా మారాయి.

సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజక వర్గంలో ఏ గ్రామంలో చూసినా ఏ పల్లె చూసినా ఇదే పరిస్థితి.. ఉదయం లేవగానే వానర సైన్యం కుప్పలు తెప్పలుగా ఇళ్లపై, రోడ్లపై కనిపిస్తాయి. బాటసారులు టూ వీలర్స్ పై ప్రయాణం చేసే వారిపై దాడి చేసేందుకు ప్రయత్నం చేస్తాయి. అలా దాడి చేసిన సందర్భాలూ ఉన్నాయి. ఇకపోతే కోతులు తినడానికి ఆహారం సమకూర్చుకునేందుకు ఇండ్లలో చొరబడి ఎవి దొరికితే…వాటిని ఎత్తుకెళ్లి తింటాయి. వాటిని చెదరగొట్టే ప్రయత్నం చేస్తే మనుషులపై దాడులు చెస్తున్నాయి.

అడవులు అంతరించి పోవడంతో అడవుల్లో ఉండాల్సిన కోతులకు ఎలాంటి ఆహారం దొరక్క ఇలా గ్రామాలపై పడి దాడులు చేస్తున్నాయని అంటున్నారు. రోడ్లపై గుంపులు గుంపులుగా తిరుగుతూ ప్రయాణికులను భయబ్రాంతులకు గురి చేస్తున్నాయని చెబుతున్నారు. కోతులను అడవికి తరలించాలించేందుకు అటవీ శాఖ అధికారులు స్పందించి అడవుల్లో వాటికి కావాల్సిన ఆహారం, నీటి కొలనులు ఏర్పాటు చేయాలని చెబుతున్నారు. విచ్చలవిడిగా పెరిగిపోతున్న వానర సంతతితో గ్రామాల్లో.. మనుషుల కన్నా కోతులే ఎక్కువై పోతున్నాయని, మనుషులపై దాడి చేసే ప్రమాదాలు ఉన్నాయని ప్రజలు వాపోతున్నారు.

Also Read:

ఇంట్లో సమస్యలున్నాయి అన్నాడు.. ఊరి పొలిమేరలో పూజలన్నాడు.. అందినకాడికి దోచుకుని పరారయ్యాడు

ఆలయం గాలి గోపురానికి రంధ్రం చేసి పురాతన నాణేల చోరి.. పోలీసులు విచారణలో తేలింది ఏంటంటే..?