Aadhar Card: ఇకపై పోస్ట్ ఆఫీసుల్లో ఆధార్‌తో మొబైల్ ఫోన్ అనుసంధానం… రేషన్ సరకులకు తప్పనిసరి కావడంతో..
Mobile Number Linking To Aadhar: రేషన్ దుకాణాల్లో బయోమెట్రిక్ విధానాన్ని తొలగించిన విషయం తెలిసిందే. ఈ స్థానంలో ఐరిష్ లేదా ఆధార్ కార్డుతో అనుసంధానమైన మొబైల్‌కు...
Mobile Number Linking To Aadhar: రేషన్ దుకాణాల్లో బయోమెట్రిక్ విధానాన్ని తొలగించిన విషయం తెలిసిందే. ఈ స్థానంలో ఐరిష్ లేదా ఆధార్ కార్డుతో అనుసంధానమైన మొబైల్‌కు వచ్చే ఓటీపీ చెప్పడం ద్వారా సరుకులు ఇచ్చే విధానాన్ని తీసుకొచ్చారు. ఈ క్రమంలోనే మొదట్లో ఆధార్ తీసుకున్న చాలా మంది తమ మొబైల్ ఫోన్ నెంబర్లను ఆధార్‌తో అనుసంధానించుకోలేదు. దీంతో ఓటీపీ విధానం కచ్చితం చేయడంతో చాలా మంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యకు చెక్ పెట్డడానికే పౌర సరఫరాల శాఖ ఓ కీలక ప్రకటన చేసింది. ఆధార్‌తో మొబైల్ ఫోన్ అనుసంధానం కోసం తపాలాకార్యాలయాలను (పోస్ట్ ఆఫీసులను) వినియోగించుకోవాలని తెలిపింది. పోస్టల్ హైదరాబాద్ రీజియన్ పరిధిలో అందుబాటులో ఉన్న 124 ఆధార్ కేంద్రాల్లో.. మొబైల్ నెంబర్ లింక్ చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. వీటితో పాటు 15 మొబైల్ కేంద్రాలు కూడా ఈ సేవల్ని అందిస్తాయని పేర్కొన్నారు.