Kavitha Arrest: ఢిల్లీ లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కవిత అరెస్ట్.. మినిట్ టూ మినిట్ మీ కోసం..
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. MLC కవితను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. మధ్యాహ్నం ఒంటి గంటకు కవిత నివాసానికి చేరుకున్న ఈడీ అధికారులు.. నాలుగు గంటలకుపైగా సోదాలు చేశారు. తనిఖీలు ముగియగానే సాయంత్రం 5.20కి అరెస్ట్ చేస్తున్నట్లు కవిత భర్తకు మెమో ఇచ్చారు.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. MLC కవితను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. మధ్యాహ్నం ఒంటి గంటకు కవిత నివాసానికి చేరుకున్న ఈడీ అధికారులు.. నాలుగు గంటలకుపైగా సోదాలు చేశారు. తనిఖీలు ముగియగానే సాయంత్రం 5.20కి అరెస్ట్ చేస్తున్నట్లు కవిత భర్తకు మెమో ఇచ్చారు.
మధ్యాహ్నం నుంచి కవిత నివాసం దగ్గర హైడ్రామా నడిచింది. ఆమె ఇంట్లో సోదాల కోసం 10 మంది ఈడీ, ఐటీ అధికారుల కవిత ఇంటికి చేరుకున్నారు. ఈడీ జాయింట్ డైరెక్టర్ నేతృత్వంలో సోదాలు నిర్వహించారు. ఈడీ సోదాలపై కవిత లాయర్ సోమా భరత్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ కేసులో సుప్రీంకోర్టు తీర్పు వచ్చే వరకు ఎలాంటి చర్యలు ఉండవన్న ఈడీ.. సోదాలు చేయడం సరికాదన్నారు. కోర్టులో కేసు ఉండగా సడెన్‌గా ఎందుకీ సోదాలని ఆయన ప్రశ్నించారు.
2022 జులైలో ఢిల్లీ లిక్కర్ స్కామ్ వెలుగులోకి వచ్చింది. దాదాపు 5 నెలల తర్వాత మొదటిసారిగా 2022 డిసెంబర్ 11న కవితను ఇంట్లోనే విచారించింది CBI. లిక్కర్ స్కామ్‌లో CRPC 160 కింద 7 గంటల పాటు ప్రశ్నించారు సీబీఐ అధికారులు. ఢిల్లీ లిక్కర్ స్కాంకు సంబంధించి సౌత్ గ్రూప్‌కు కవిత నేతృత్వం వహించారనేది ప్రధాన ఆరోపణ.
కవితను అరెస్ట్ చేయడంతో ఒక్కసారిగా కవిత ఇంటి దగ్గర హైటెన్షన్ నెలకొంది. కవిత నివాసానికి భారీగా చేరుకున్న బీఆర్‌ఎస్ శ్రేణులు ఈడీ దాడులకు వ్యతిరేకంగా ధర్నాకు దిగారు. కేంద్రం ప్రభుత్వంతో పాటు ఈడీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
కవితను అదుపులోకి తీసుకున్నారన్న సమాచారంతో ఆమె నివాసానికి చేరుకున్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కేటీఆర్, హరీష్‌తో పాటు పలువురు నేతలు. అయితే కేటీఆర్, హరీష్‌లను లోపలికి అనుమతించకపోవడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఈడీ అధికారులతో చర్చల తర్వాత లోపలికి వెళ్లారు.
కవిత నివాసంలోకి వెళ్లిన కేటీఆర్.. ఈడీ అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్రాన్సిట్ వారెంట్ లేకుండా ఎలా అరెస్ట్ చేస్తారంటూ అధికారులను ప్రశ్నించారు. లాయర్‌కు ఎందుకు అనుమతి ఇవ్వలేదని క్వశ్చన్ చేశారు. ఈడీ విచారణకు సహకరిస్తామని కవిత కుటుంబ సభ్యులు తెలిపారు. కార్యకర్తలు సంయమనం పాటించాలని కేటీఆర్, హరీష్‌రావు కోరారు. ఈడీ అరెస్ట్ చేసి తీసుకెళ్తుండగా బీఆర్‌ఎస్ శ్రేణులకు కవిత అభివాదం చేశారు. కార్యకర్తలు ధైర్యంగా ఉండాలని కవిత విజ్ఞప్తి చేశారు. రాజకీయ కక్ష సాధింపు చర్యలను న్యాయపరంగా ఎదుర్కొంటామన్నారు ఎమ్మెల్సీ కవిత.
ఇప్పటికే ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ జారీ చేసిన సమన్లను సుప్రీంకోర్టులో సవాల్ చేశారు MLC కవిత. ఈ పిటిషన్‌ను ఇవాళ విచారించిన సుప్రీంకోర్టు మార్చి 19వ తేదీకి వాయిదా వేసింది. సీఆర్పీసీ నిబంధనల ప్రకారం విచారణ జరపడం లేదని కవిత ఆరోపించారు. మహిళలను ఈడీ కార్యాలయానికి పిలిచి ప్రశ్నించడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. తనపై ఎలాంటి బలవంతపు చర్యలను ఈడీ తీసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్‌లో కవిత కోరారు.
తాజాగా హైదరాబాద్‌లోని తన ఇంట్లో నుంచి అదుపులోకి తీసుకున్న ఈడీ అధికారులు ఢిల్లీకి తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. కవితను ఢిల్లీకి తరలించేందుకు రాత్రి 8.45గంటలకు ఫ్లైట్ బుక్ చేశారు ఈడీ అధికారులు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..