MLA Prem Sagar Rao: మందు తాగితే టికెట్ కట్..ఎమ్మెల్యే కార్యకర్తలతో ప్రతిజ్ఞ
మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేంసాగర్ రావు ఆదేశాలను ఆ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకుులు, కీలక నేతలు కార్యకర్తలు తూచ తప్పకుండా పాటిస్తామంటూ ప్రతిజ్ఞ చేశారు. సమాజం బాగుండాలంటే ముందు మనం బాగుండాలి.. మన కుటుంబం బాగుండాలని ఎమ్మెల్యే ఇచ్చిన మద్యపాన నిషేదానికి అంతా ఒక్కటై ముందుకు అడుగేశారు.
MLA Prem Sagar Rao: మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేంసాగర్ రావు ఆదేశాలను ఆ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకుులు, కీలక నేతలు కార్యకర్తలు తూచ తప్పకుండా పాటిస్తామంటూ ప్రతిజ్ఞ చేశారు. సమాజం బాగుండాలంటే ముందు మనం బాగుండాలి.. మన కుటుంబం బాగుండాలని ఎమ్మెల్యే ఇచ్చిన మద్యపాన నిషేదానికి అంతా ఒక్కటై ముందుకు అడుగేశారు. చేయి చేయి కలిపిన హస్తం నేతలు.. ఇన్నాళ్లు సరదాకో అత్యవసరానికో చేసిన మద్యపానాన్ని పెద్దాయనకు ఇచ్చిన మాట ప్రకారం వదిలేస్తున్నామని.. ఏడాది పాటి మందు జోలికి వెళ్లమని ప్రతిజ్ఞ చేశారు.
మంచిర్యాల జిల్లా దండెపల్లి మండల కేంద్రంలో ఈ ఘటన చోటు చేసుకుంది. మహాత్మా గాంధీ జయంతి వేడుకల్లో పాల్గొన్న మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేంసాగర్ రావు.. తన నియోజక వర్గంలో యువత పెద్ద ఎత్తున మత్తుకు బానిసవుతున్నారని గుర్తించి.. క్రైమ్ రేటు పెరగడానికి.. సమాజం పాడవటానికి మందే కారణమని.. మద్యం మత్తులో క్షణికావేశంలో ఆత్మహత్యలు చేసుకుంటూ నిండు జీవితాన్ని బలి తీసుకుంటున్నారని.. మత్తు మజాలో వాహనాలు నడుపుతూ రోడ్డు ప్రమాదాలకు కారణమవుతున్నారని.. ఇవన్నీ తగ్గాలంటే మద్యం మానేయాలని పిలుపునిచ్చారు. సభ వేదిక సాక్షిగా నియోజకవర్గ కాంగ్రెస్ కార్యకర్తలతో ప్రతిజ్ఞ చేయించారు. నేటి నుంచి ఏడాది పాటు మందు ముట్టమని మద్యం జోలికి వెళ్ళమని వ్యసనాలు మానేస్తామని మాటిస్తున్నామంటూ ప్రతిజ్ఞ చేయించారు ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు ఏకంగా 3000 మందికి పైగా కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు యువత ఈ ప్రతిజ్ఞ చేయడం హాట్ టాపిక్‌గా మారింది.
ప్రతిజ్ఞ తోనే ఆగిపోలేదు ఎమ్మెల్యే.. తన క్యాడర్ ఇచ్చిన మాట తప్పితే స్థానిక సంస్థల ఎన్నికల్లో టికెట్ కట్ చేస్తానని.. భవిష్యత్‌లో ఉన్నత పదవుల ఆశలు వదులుకోవాల్సిందేనని స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. కఠినంగా ఉంటే సమాజంలో మార్పు వస్తుందని.. అందుకు మంచిర్యాల నియోజకవర్గం నుండే బాటలు పడాలని కోరారు. యువత చెడు మార్గాన్ని వదలాలని.. వ్యసనాల జోలికి వెళ్లకుండా చూసే బాధ్యత తనదేనని మాటిచ్చారు. చూడాలి మరీ పెద్దాయనకు ఇచ్చిన మాట ప్రకారం మంచిర్యాల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు మందుకు ఎంత వరకు దూరమవుతారో లేదో అని..