Nagarjuna: ఊరుకునేది లేదు.. కొండా సురేఖకు లీగల్ నోటీసులు పంపనున్ననాగార్జున

సినిమా ఇండస్ట్రీ గురించి, సమంత , అక్కినేని ఫ్యామిలీ గురించి కొండా సురేఖ చేసిన ఆరోపణలను సినీ ప్రముఖులు ఖండిస్తున్నారు. ఇప్పటికే ఎన్టీఆర్, చిరంజీవి, నాగార్జున, అల్లు అర్జున్, వెంకటేష్ తో సహా చాలా మంది కొండా సురేఖ కామెంట్స్ పై స్పందించారు.

Nagarjuna: ఊరుకునేది లేదు.. కొండా సురేఖకు లీగల్ నోటీసులు పంపనున్ననాగార్జున
Nagarjuna, Konda Surekha
Follow us
Rajeev Rayala

|

Updated on: Oct 03, 2024 | 12:13 PM

కొండా సురేఖ చేసిన కామెంట్స్ ఇప్పుడు టాలీవుడ్ ను షేక్ చేస్తున్నాయి. కొండా సురేఖ కామెంట్స్ పై ప్రతిఒక్కరు రియాక్ట్ అవుతున్నారు. సినిమా ఇండస్ట్రీ గురించి, సమంత , అక్కినేని ఫ్యామిలీ గురించి కొండా సురేఖ చేసిన ఆరోపణలను సినీ ప్రముఖులు ఖండిస్తున్నారు. ఇప్పటికే ఎన్టీఆర్, చిరంజీవి, నాగార్జున, అల్లు అర్జున్, వెంకటేష్ తో సహా చాలా మంది కొండా సురేఖ కామెంట్స్ పై స్పందించారు. తాజాగా కింగ్ నాగార్జున మరోసారి కొండా సురేఖ వ్యాఖ్యల పై స్పందించారు. కొండా సురేఖకు లీగల్ నోటీసులు పంపుతామని ఆయన అన్నారు.

మంత్రి కొండా సురేఖకు లీగల్ నోటీసులు పంపనున్నారు అక్కినేని నాగార్జున. ప్రస్తుతం వైజాగ్‌లో ఉన్నానని, హైదరాబాద్ రాగానే చట్టపరంగా నోటీసులు పంపిస్తామని నాగ్ తెలిపారు. కొండా సురేఖ విషయం పై ఎట్టి పరిస్థితుల్లో దీనిపై ఊరుకునేది లేదు.. చట్టపరంగా పోరాడతానని నాగార్జున తెలిపారు. అంతకు ముందు నాగార్జున సోషల్ మీడియాలో స్పందిస్తూ..

“గౌరవనీయ మంత్రివర్యులు శ్రీమతి కొండా సురేఖ గారి వ్యాఖ్యలని తీవ్రంగా ఖండిస్తున్నాను. రాజకీయాలకు దూరంగా ఉండే సినీ ప్రముఖుల జీవితాలని, మీ ప్రత్యర్ధులని విమర్శించేందుకు వాడుకోకండి. దయచేసి సాటి మనుషుల వ్యక్తిగత విషయాలని గౌరవించండి. బాధ్యత గలిగిన పదవి లో ఉన్న మహిళగా మీరు చేసిన వ్యాఖ్యలు, మా కుటుంబం పట్ల మీరు చేసిన ఆరోపణలు పూర్తిగా అసంబద్ధం, అబద్ధం. తక్షణమే మీ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవలిసిందిగా కోరుతున్నాను” అని అన్నారు అలాగే చిరంజీవి, వెంకటేష్ కూడా కొండా సురేఖ కామెంట్స్ పై ఫైర్ అయ్యారు. సినిమా వాళ్ళను ఇలా రాజకీయ లబ్ది కోసం వాడనుకోవడం కరెక్ట్ కాదు అని అన్నారు. సీనియర్ హీరోలతో పాటు యంగ్ హీరోలో వరుణ్ తేజ్, శ్రీ విష్ణు, సుదీర్ బాబు, విశ్వక్ సేన్ కూడా కొండా సురేఖ వ్యాఖ్యలను ఖండించారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి