TS Politics: కేసీఆర్‌ మోసాలకు త్వరలోనే చరమగీతం పాడతాం.. ఎమ్మెల్యే ఈటెల విమర్శలు..

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ రాజ్యాంగ ఉల్లంఘనలకు పాల్పడ్డారని, త్వరలోనే ఆయన మోసాలకు చరమగీతం పాడతామని హుజురాబాద్‌..

TS Politics: కేసీఆర్‌ మోసాలకు  త్వరలోనే చరమగీతం పాడతాం.. ఎమ్మెల్యే ఈటెల విమర్శలు..
Basha Shek

|

Nov 10, 2021 | 7:19 PM

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ రాజ్యాంగ ఉల్లంఘనలకు పాల్పడ్డారని, త్వరలోనే ఆయన మోసాలకు చరమగీతం పాడతామని హుజురాబాద్‌ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్‌ తెలిపారు. దుబ్బాక బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు ఎమ్మెల్యేగా గెలుపొంది ఏడాది పూర్తైన సందర్భంగా సిద్ధిపేట జిల్లాలో మొదటి వార్షికోత్సవ సభ ఏర్పాటుచేశాకు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఈటెల తెలంగాణ ముఖ్యమంత్రిపై విరుచుకుపడ్డారు. అంబేడ్కర్‌ ఇచ్చిన హక్కులను కేసీఆర్‌ కాలరాజేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

600 కోట్లు ఖర్చు చేశారు.. ‘ఈ ఏడాది మేలో కేసీఆర్‌ నన్ను బయటకు పంపించారు. అప్పుడే బానిసత్వం నుంచి విముక్తి పొందినట్లయింది. బానిసత్వం, బానిస మనస్తత్వం ..ఈ రెండు లేని వారు దేనికైనా సిద్ధంగా ఉంటారు. ఈటెల రాజేందర్ గతంలో ఎలా కేసీఆర్‌కు తమ్ముడయ్యాడో.. ఇప్పుడెట్లా దయ్యం అయ్యాడో ఆయనే చెప్పాలి.   ఒక్క హుజురాబాద్‌ ఉప ఎన్నిక కోసమే టీఆర్ఎస్ రూ. 600 కోట్లు ఖర్చు చేసింది. దేశానికి చైతన్యం అందించిన గడ్డ తెలంగాణ. త్వరలోనే కేసీఆర్ మోసాలకు చరమ గీతం పాడుతారు. రఘునందన్ గెలువడనుకుని టీఆర్‌ఎస్‌ నేతలు అనుకున్నారు. కానీ ఆయన కర్రు కాల్చి వాతపెట్టాడు. ఇప్పుడు తెలంగాణలో ముగ్గురు బీజేపీ ఎమ్మెల్యేలు మాత్రమే ఉండవచ్చు. కానీ రానురానూ ఈ సంఖ్య పెరుగుతుంది. మేం నాలుగు కోట్ల తెలంగాణకు ప్రజానీకానికి కాపలా ఉంటాం’ అని ఈటెల చెప్పుకొచ్చారు.

Also Read:

Voter ID Card:18 ఏళ్లు నిండినవారికి గుడ్‌న్యూస్.. ఓటు నమోదు చేసుకునేందుకు ఈసీ అవకాశం.. తప్పుల సవరణకు సైతం..

Ginger Farming: హెక్టారు అల్లం పంటతో సుమారు రూ. 15 లక్షలు లాభం.. పూర్తి వివరాలు మీకోసం..

Virat Kohli: విరాట్ కోహ్లీ కూతురిని రేప్ చేస్తానని బెదిరించిన హైదరాబాదీ అరెస్ట్‌

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu