Crime News: ప్రేమించిన అమ్మాయి తనతో మాట్లాడొద్దన్నందుకు ఘాతుకం.. యువతిపై దాడి.. 18 కత్తిపోట్లు!

ఎల్బీనగర్‌ పీఎస్‌ పరిధిలో మరో ప్రేమోన్మాది ఘాతుకానికి పాల్పడ్డాడు. నిన్న పెద్దపల్లి జిల్లాలో జరిగిన ఘటన మరువక ముందే మరో దారుణం హైదరాబాద్ మహానగరంలో వెలుగు చూసింది.

Crime News: ప్రేమించిన అమ్మాయి తనతో మాట్లాడొద్దన్నందుకు ఘాతుకం.. యువతిపై దాడి.. 18 కత్తిపోట్లు!
Young Man Attack On Young Woman
Follow us
Balaraju Goud

|

Updated on: Nov 10, 2021 | 7:22 PM

Young Man attack on Young Woman: ఎల్బీనగర్‌ పీఎస్‌ పరిధిలో మరో ప్రేమోన్మాది ఘాతుకానికి పాల్పడ్డాడు. నిన్న పెద్దపల్లి జిల్లాలో జరిగిన ఘటన మరువక ముందే మరో దారుణం హైదరాబాద్ మహానగరంలో వెలుగు చూసింది. యువతిపై బస్వరాజు అనే యువకుడు కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు. ఇద్దరూ ప్రేమించుకున్నారు. పెద్దలు ఒప్పుకోలేదు. ఆ అమ్మాయికి ఎంగేజ్‌మెంట్‌ కూడా చేశారు. ఇక, తనతో మాట్లాడొద్దని అమ్మాయి చెప్పడంతో.. అతడిలోని ఉన్మాది బయటకొచ్చింది. అమ్మాయిపై విచక్షణారహితంగా 18 కత్తి పోట్లు పొడిచాడు. చావుబతుకుల మధ్య ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఈ దారుణ ఘటన ఎల్‌బీ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.

వికారాబాద్ జిల్లా దౌలతాబాద్‌కు చెందిన యువతిపై బస్వరాజ్ అనే యువకుడు కత్తితో దాడి చేశాడు. అతి కిరాతకంగా 18 సార్లు పొడిచి హతమార్చేందుకు ప్రయత్నించాడు. హస్తినపురంలోని యువతి పిన్ని ఇంట్లోకి ప్రవేశించి విచక్షణారహితంగా దాడి చేశాడు దుర్మార్గుడు. ఈ ఘటనకు సంబంధించి స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో.. ఘటనాస్థలానికి చేరుకుని, తీవ్రంగా గాయపడ్డ యువతిని సమీపంలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌కి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. కాగా, ఈ దారుణానికి ఒడిగట్టిన నిందితుడిని అదుపులోకి తీసున్నారు పోలీసులు.

ఇదిలావుంటే, వికారాబాద్ జిల్లా దౌలతాబాద్ గ్రామానికి చెందిన బస్వరాజు.. అదే ప్రాంతానికి చెందిన యువతితో పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. ఇద్దరు గత కొన్నాళ్లుగా గాఢంగా ప్రేమించుకుంటున్నారు. అయితే, ఈ విషయం అమ్మాయి కుటుంబసభ్యులకు తెలియడంతో.. ఆమెకు నచ్చజెప్పి మరొకరితో నిశ్చితార్ధం కూడా జరిపించారు. ఇదే విషయం తెలుసుకున్న బస్వరాజ్.. అమ్మాయి కోసం వెతకాడు. చివరికి హైదరాబాద్ శివారు హస్తినపురంలోని తన పిన్ని వాళ్ల ఇంట్లో ఉన్నట్లు తెలుసుకుని.. మాట్లాడుకుందాం రమ్మంటూ పిలిచి దారుణానికి ఒడిగట్టాడు బస్వరాజు. యువతిపై విచక్షణారహితంగా దాడి చేసి.. వెంట తెచ్చుకున్న కత్తితో 18 సార్లు పొడిచాడు. దీంతో తీవ్రంగా గాయపడ్డ యువతి రక్తపుమడుగులో కుప్పకూలిపోయింది. ఇది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని నిందితుడిని అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేపడుతున్నామని ఎల్‌బీ నగర్ పోలీసులు తెలిపారు.

Read Also… TS Politics: కేసీఆర్‌ రాజ్యాంగ ఉల్లంఘనలకు పాల్పడ్డారు.. త్వరలో ఆయన మోసాలకు చరమగీతం పాడతాం.. ఎమ్మెల్యే ఈటెల విమర్శలు..

ఉద్యోగం కోసం వెతుకుతున్నారా..? మేనేజర్‌ పోస్ట్‌ ఖాళీ.. దరఖాస్తులు
ఉద్యోగం కోసం వెతుకుతున్నారా..? మేనేజర్‌ పోస్ట్‌ ఖాళీ.. దరఖాస్తులు
మీ కారు టైర్లు త్వరగా అగిరిపోతున్నాయా? అసలు కారణాలు ఇవే..!
మీ కారు టైర్లు త్వరగా అగిరిపోతున్నాయా? అసలు కారణాలు ఇవే..!
హలో దీదీ..మీరు సూపరహే..!ఇల్లూడ్చే చీపురుతో ఇలాంటి స్టంట్ చెయొచ్చా
హలో దీదీ..మీరు సూపరహే..!ఇల్లూడ్చే చీపురుతో ఇలాంటి స్టంట్ చెయొచ్చా
ఇది పండు కాదు.. అమృతఫలం.. రోజుకొకటి తింటే.. మీరు సేఫ్ అంతే.!
ఇది పండు కాదు.. అమృతఫలం.. రోజుకొకటి తింటే.. మీరు సేఫ్ అంతే.!
మీ వాహనంపై చలాన్‌ విధించారో.. లేదో తెలుసుకోవడం ఎలా?
మీ వాహనంపై చలాన్‌ విధించారో.. లేదో తెలుసుకోవడం ఎలా?
అరెరే ఎంతపనైపాయే.. గూగుల్ తల్లి కొంప కొల్లేరు చేసిందిగా.. పాపం.!
అరెరే ఎంతపనైపాయే.. గూగుల్ తల్లి కొంప కొల్లేరు చేసిందిగా.. పాపం.!
ఒకే ఓవర్‌లో 4,4,4,4,4,4.. వామ్మో ఇలా ఉన్నావ్ ఏంది సామీ..!
ఒకే ఓవర్‌లో 4,4,4,4,4,4.. వామ్మో ఇలా ఉన్నావ్ ఏంది సామీ..!
రూ.2 కోట్ల యాడ్ రిజెక్ట్ చేసింది.. ఆమె పేరు చెబితే పూనకాలే..
రూ.2 కోట్ల యాడ్ రిజెక్ట్ చేసింది.. ఆమె పేరు చెబితే పూనకాలే..
హిట్‌మ్యాన్, ట్రావిస్ హెడ్ కాదు.. 23 సిక్సర్లతో ఆ క్రికెటర్ తోపు
హిట్‌మ్యాన్, ట్రావిస్ హెడ్ కాదు.. 23 సిక్సర్లతో ఆ క్రికెటర్ తోపు
ఫాదర్ అఫ్ ట్రావిస్ హెడ్ అంటూ ఫుల్లు ట్రోలింగ్..
ఫాదర్ అఫ్ ట్రావిస్ హెడ్ అంటూ ఫుల్లు ట్రోలింగ్..