Singareni Mines: సింగరేణి బొగ్గు గనిలో విషాదం.. ఎస్‌ఆర్పీ-3 గనిలో పైకప్పు కూలి నలుగురు కార్మికులు దుర్మరణం
సింగరేణి బొగ్గు గనిలో విషాదం చోటుచేసుకుంది. మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్‌లోని ఎస్‌ఆర్పీ 3 గనిలో ఘోర ప్రమాదం జరిగింది. గని పైకప్పు కూలడంతో నలుగురు కార్మికులు దుర్మరణం పాలయ్యారు.
Singareni Mines roof collapse: సింగరేణి బొగ్గు గనిలో విషాదం చోటుచేసుకుంది. మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్‌లోని ఎస్‌ఆర్పీ 3 గనిలో ఘోర ప్రమాదం జరిగింది. గని పైకప్పు కూలడంతో నలుగురు కార్మికులు దుర్మరణం పాలయ్యారు. బొగ్గు శిథిలాల కింద చిక్కుకున్న మృతదేహాలను వెలికి తీసేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. భారీ శిథిలాలు కావడంతో రెస్క్యూ ఆపరేషన్ ఇబ్బందిగా మారిందని అధికారులు తెలిపారు. మరో రెండు గంటల సమయం పట్టే అవకాశముందని తోటి కార్మికులు చెబుతున్నారు. కాగా, ఈ ప్రమాదంపై సింగరేణి కార్మికుల కుటుంబాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
మొదటి షిఫ్ట్‌లో కార్మికులు విధులు నిర్వర్తిస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగిందని సింగరేణి అధికారులు తెలిపారు. మైన్‌లో బొగ్గు వెలికి తీస్తుండగా 21 డీప్ 24 లెవెల్ వద్ద రూఫ్ కూలడంతో ప్రమాదం జరిగినట్లుగా చెప్తున్నారు. మృతి చెందిన కార్మికులు కృష్ణారెడ్డి, సత్యనారాయణ, లక్ష్మయ్య, చంద్రశేఖర్‌లుగా గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించి సమాచారం అందుకున్న అధికారులు వెంటనే రంగంలోకి దిగి సహాయక చర్యలు ముమ్మరం చేశారు.
Read Also… Union Cabinet: కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం.. ఎంపీ-లాడ్స్ నిధుల పునరుద్ధరణకు ఆమోదం