Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Harish Rao – KTR: మంత్రి కేటీఆర్ గురించి ఎంత చెప్పినా తక్కువే.. మంత్రి హరీశ్ రావు కీలక వ్యాఖ్యలు..

Siddipet IT tower: మెట్రో నగరాలకు ధీటుగా 63 కోట్లతో సిద్దిపేటలో నిర్మించిన ఐటీ టవర్‌ను గురువారం మంత్రులు హరీశ్‌రావు, కేటీఆర్‌ ప్రారంభించారు. తొలివిడతలో 1500 మందికి ఉద్యోగాలు కల్పించనున్నారు.

Harish Rao - KTR: మంత్రి కేటీఆర్ గురించి ఎంత చెప్పినా తక్కువే.. మంత్రి హరీశ్ రావు కీలక వ్యాఖ్యలు..
Harish Rao Ktr
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Jun 15, 2023 | 4:36 PM

Siddipet IT tower: మెట్రో నగరాలకు ధీటుగా 63 కోట్లతో సిద్దిపేటలో నిర్మించిన ఐటీ టవర్‌ను గురువారం మంత్రులు హరీశ్‌రావు, కేటీఆర్‌ ప్రారంభించారు. తొలివిడతలో 1500 మందికి ఉద్యోగాలు కల్పించనున్నారు. స్థానిక యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఐటీ టవర్‌ను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ.. సిద్దిపేటలో ఐటీ టవర్‌ వస్తుందని కలలో కూడా ఊహించలేదన్నారు. మంత్రి కేటీఆర్‌ చొరవ తోనే ఇది సాధ్యమయ్యిందని ప్రశంసించారు. తెలంగాణ ఏర్పాడ్డాకే సిద్దిపేట అన్ని రంగాల్లో అభివృద్ది చెందిందన్నారు హరీశ్‌రావు. సిద్దిపేట జిల్లా అయ్యిందని, గోదావరి జలాలు కూడా వచ్చాయని తెలిపారు. సిద్దిపేట జిల్లా అయ్యి ఐటీ టవర్ వచ్చిందంటే తెలంగాణ తెచ్చిన కేసీఆరే కారణమంటూ పేర్కొన్నారు. సిద్దిపేటలో చదివిన బిడ్డలు సిద్దిపేటలోనే ఐటీ ఉద్యోగం చేస్తున్నారన్నారు. రాబోయే రోజుల్లో మంత్రి కేటీఆర్ సహకారంతో మరికొన్ని పరిశ్రమలు తెస్తామన్నారు. ఈ సందర్భంగా హరీశ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మంత్రి కేటీఆర్ గురించి ఎంత చెప్పినా తక్కువే.. కేటీఆర్ లాంటి ఐటీ మినిస్టర్ ఇతర రాష్ట్రాల్లో కావాలని యువత కోరుకుంటుంది.. తెలంగాణ మీద చాలా అనుమానాలు క్రేయేట్ చేశారు.. ఎవరైతే కేసీఆర్ ని తిట్టారో ఆ నోళ్లే ఇప్పుడు కేసీఆర్ ని మెచ్చుకుంటున్నాయన్నారు. ప్రధాని సొంత రాష్ట్రం గుజరాత్ లో పరిశ్రమలకు పవర్ హాలీడే ఇస్తున్నారంటూ విమర్శించారు. గతంలో ఎందరో పాలించారు.. విజన్ 2020 అన్నారు..హైటెక్ అన్నారు,, కానీ వాళ్ళ వల్ల కానిది సీఎం కేసీఆర్ చేసి చూపించారన్నారు. దేశం మొత్తం తెలంగాణ వైపు చూస్తోందని.. తెలంగాణ ఆచరిస్తుంది దేశం అనుసరిస్తుందని హరీశ్ పేర్కొన్నారు. మరో సారి సీఎం కేసీఆర్ ని గెలిపించి హ్యాట్రిక్ గెలుపు అందివ్వాలంటూ పిలుపునిచ్చారు.

ఐటీ టవర్ ప్రారంభోత్సవ సభలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. అభివృద్ది విషయంలో తెలంగాణకు సిద్దిపేట దిక్సూచి అని అన్నారు. తెలంగాణ లోని ప్రతి నియోజకవర్గం సిద్దిపేటలా అభివృద్ది చెందినప్పుడే బంగారు తెలంగాణ స్వప్నం సాకారమవుతుందన్నారు కేటీఆర్‌. సిద్దిపేటను అన్నిరంగాల్లో అభివృద్ది చేసిన ఘనత హరీశ్‌రావుదే అన్నారు. ఓ వైపు పంచాయతీ అవార్డులు..మరోవైపు పట్టణ ప్రగతి అవార్డులు జాతీయ స్థాయిలో మనకు వస్తున్నాయని.. ఉద్యమ నాయకుణ్ణి అందించిన జిల్లా సిద్ధిపేట గడ్డ అని కేటీఆర్ పేర్కొన్నారు. నేను సిరిసిల్లకి వెళ్ళేటప్పుడు సిద్దిపేటకి వచ్చినప్పుడు మా బావకి ఫోన్ చేసి మళ్ళీ కొత్తది ఎం కట్టినవ్ అని చెబుతా.. అలా సిద్దిపేటని అభివృద్ధి చేస్తున్నారంటూ హరీశ్ రావును కొనియాడారు. స్వచ్ఛబడి సిద్దిపేట స్పూర్తితో ప్రతి జిల్లాలో స్వచ్ఛబడి ఏర్పాటు చేస్తామన్నారు. ప్రతి నియోజకవర్గం సిద్దిపేట లాగా అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు. ఈ సారి హరీష్ రావుని లక్ష 50 వేల మెజార్టీ తో గెలిపించాలంటూ కోరారు. ఐటీ హబ్ ని ఇంకా విస్తరిస్తమని.. టాస్క్ తో యువతకి శిక్షణ ఇచ్చి ఉద్యోగాలు ఇప్పిస్తామన్నారు. తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి దూసుకుపోతుందని.. 2014లో తెలంగాణ ఏర్పడినప్పుడు ఐటీ ఎగుమతులు 56 వేల కోట్లు.. ఈ 9 ఎల్లల్లో ఐటీ ఎగుమతులు రెండు లక్షల 41 వేల కోట్లు పెరిగినట్లు వివరించారు. ప్రపంచంలో ఏ ప్రభుత్వమైనా అందరికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చే అవకాశం ఉండదు.. మన తెలంగాణ లో 6.5 లక్షల ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు.. తెలంగాణలో యువత ఎక్కువగా ఉంది.. వారికి ప్రయివేట్ ఉద్యోగం సృష్టించడం కోసం ఎన్నో పరిశ్రమలు ఏర్పాటు చేస్తున్నామని కేటీఆర్ వివరించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..