AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఎక్కడ పుట్టిందో ఎవరికీ తెలియదు.. కర్పూరం గురించి ఆశ్చర్యపోయే విషయాలు..

తెలుగు లోగిళ్లలో కర్పూరం ఒక ముఖ్య భాగం. ఇది లేనిదే పూజ పూర్తవదు. దీనిని ఒక్క పూజలోనే కాదు ఆహార పదార్థాల్లో కూడా వినియోగిస్తుంటారు. అయితే కర్పూరంలో రెండు రకాలుంటాయి. కొందరు తెలియక దీనినే నోట్లోకి తీసుకుంటారు. తలకు కూడా రుద్దుకుంటారు. కానీ, ఇది చాలా ప్రమాదకరం. అసలు కర్పూరం ఎలా తయారవుతుంది. దీంట్లో రెండు రకాలు ఎలా పుట్టుకొచ్చాయి వంటి విషయాలు మిమ్మల్ని ఆశ్చర్యానికి గురిచేస్తాయి..

ఎక్కడ పుట్టిందో ఎవరికీ తెలియదు.. కర్పూరం గురించి ఆశ్చర్యపోయే విషయాలు..
Camphor Secrets Of Making
Bhavani
| Edited By: |

Updated on: Mar 06, 2025 | 9:57 PM

Share

దేవుడిని నిత్య పూజలో సమర్పించే వస్తువులలో కర్పూరం ఒకటి. దీప ధూప నైవేద్యాల్లో ఈ కర్పూరం లేనిదే పూజ పూర్తికాదు. అంతటి ప్రాముఖ్యం ఉన్న ఈ కర్పూరం ఎలా తయారవుతుందో చాలా మందికి తెలియదు. ఒక్క పూజా మందిరంలోనే కాదు.. కర్పూరాన్ని శ్వాసకోస సంబంధిత వ్యాధులు తగ్గించడానికి కూడా ఉపయోగిస్తుంటారు. దగ్గు, జలుబుతో పాటు ఎన్నో రకాల అనారోగ్యాలకు దీనిని మందుగా వాడుతుంటారు. మరి ఇన్ని విశేషాలున్న కర్పూరం గురించి ఈ ఆసక్తికర విషయాలు మీరూ తెలుసుకోండి.

ఎక్కడ పుట్టిందో తెలియదు..

నిజానికి మనకు మార్కెట్లో దొరికే కర్పూరం పూర్తిగా సహజమైందేమీ కాదు. ఇందులో కొన్ని ఫ్యాక్టరీల్లో తయారు చేస్తుంటారు. మరికొన్ని రకాలు చెట్టునుంచి సహజసిద్ధంగా తయారైనవి. సినమోముమ్ కాంపోరా అనే చెట్టు నుంచి కర్పూరం తయారవుతుంది. ఈ కర్పూరం చెట్టు దాదాపు 50 నుంచి 60 అడుగుల వరకు పెరుగుతుంది. దీని ఆకులు గుండ్రంగా 4 అంగుళాల వరకు పెరుగుతాయి. దీని బెరడు నుంచే కర్పూరం తయారవుతుంది. అయితే ఇది ఏ దేశానికి చెందినదనే విషయంపై ఇప్పటికే సందిగ్ధత కొనసాగుతోంది. దీనిని కొందరు మొదట చైనాలో కనుగొన్నారంటారు. మరికొందరు మాత్రం జపాన్ చెట్లంటారు.

ఎందుకంత విలువైనవి..

కర్పూరం చెట్లు ఎంతో ఖరీదైనవిగా భావిస్తారు. ఎర్రచందనంతో పోటీ పడగల విలువ వీటికుంది. ఇందులో అరుదైన రసాయనాలుండటమే ఇందుకు కారణం. అందుకే దీనిని నల్ల బంగారం అని కూడా అంటారు. పూజలో ఉపయోగించే కర్పూరం మాత్రమే కాకుండా ఎసెన్షియల్ ఆయిల్స్‌తో పాటు వివిధ రకాల మందులు, పెర్ఫ్యూమ్‌లు, సబ్బులు కూడా తయారు చేస్తారు.

మండే గుణం ఎలా వచ్చింది..

కర్పూరం అస్థిర పదార్థం కావడంతో వేడిచేసినప్పుడు ఆవిరిగా మారుతుంది. గాలిలో వేగంగా వ్యాపించడంతో పాటు ఆక్సిజన్​తో కలిసిన వెంటనే మండుతుంది. కర్పూరంలో కార్బన్, హైడ్రోజన్ అధిక మొత్తంలో ఉన్నందున మండే ఉష్ణోగ్రత చాలా తక్కువగా ఉండడం వల్లే కొంచెం వేడి తగలగానే మండుతుంది.

హారతి కర్పూరం అంటే

హారతి కర్పూరం అనేది ప్రత్యేకంగా తయారు చేస్తారు. దీనిలో రసాయనాలను వినియోగిస్తారు. ముఖ్యంగా టర్పంటైన్ ను కలిపి రసాయనిక పద్ధతిలో ఈ హారతి కర్పూరాలు తయారు చేస్తారు. ఇది తినడానికి గానీ, మందుల్లో వాడడానికి కానీ వినియోగించకూడదు. వాటిని తింటే చాలా ప్రమాదకరం. జుట్టుకు రాసే నూనెలో కూడా కొంతమంది కర్పూరాన్ని కలుపుకుంటారు. పచ్చ కర్పూరాన్ని ఆ నూనెలో కలపవచ్చు, హారతి కర్పూరాలను కలపకూడదు.

తినే కర్పూరం అంటే..

తినే కర్పూరం ఒక విలక్షణమైన సువాసనను కలిగి ఉంటుంది. దీనిలో ఔషధ గుణాలు, సుగంధ ప్రయోజనాలు అధికంగా ఉంటాయి. ప్రపంచంలోని అనేక వంటకాల్లో దీన్ని వాడుతూ ఉంటారు. ముఖ్యంగా ఆసియాలోని దేశాల్లో దీని వాడకం ఎక్కువగా ఉంటుంది. ఇది పదార్థాలను పాడవకుండా ఎక్కువ కాలం పాటు నిల్వ కూడా ఉంచుతుంది. అందుకే దీన్ని కొన్ని రకాల స్వీట్లలో వాడతారు. ఆహారంలో కర్పూరాన్ని భాగం చేయడం వల్ల వంటకాలకు ప్రత్యేకమైన రుచి, సువాసన వస్తాయి.

Follow Us