పచ్చి అబద్ధాలు.. అమలుకు నోచుకోని హామీలు.. సీడబ్ల్యూసీ సమావేశంపై మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఫైర్..
Telangana Election 2023: తుక్కుగూడ కాంగ్రెస్ పార్టీ సభపై విరుచుకుపడ్డారు రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. సిడబ్ల్యూసి మీటింగ్ పెట్టుకొని తెలంగాణ ప్రజలను మభ్య పెట్టే హామీలను ప్రకటించారని ధ్వజమెత్తారు. చందమామను తెచ్చి ఒళ్ళో పెడతాం అనే షరా మామూలు మోసపు హామీలు చదివి వినిపించారని, తుక్కు గూడ సభలో చెవులకు వినసొంపుగా తుక్కు తుక్కు హామీలు ఇచ్చారని ఎద్దేవా చేసారు.

పచ్చి అబద్ధాలకు, అమలుకు నోచుకోని హామీలకు వేదికైందని తుక్కుగూడ కాంగ్రెస్ పార్టీ సభపై విరుచుకుపడ్డారు రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. సిడబ్ల్యూసి మీటింగ్ పెట్టుకొని తెలంగాణ ప్రజలను మభ్య పెట్టే హామీలను ప్రకటించారని ధ్వజమెత్తారు. చందమామను తెచ్చి ఒళ్ళో పెడతాం అనే షరా మామూలు మోసపు హామీలు చదివి వినిపించారని, తుక్కు గూడ సభలో చెవులకు వినసొంపుగా తుక్కు తుక్కు హామీలు ఇచ్చారని ఎద్దేవా చేసారు. అవి హమీల్లా లేవు,కేసిఆర్ సర్కార్ పథకాలతో పోటీపడే అర్రాసు పాట లెక్క ఉన్నయని దుయ్యబట్టారు.
మొన్న కర్ణాటకలో అధికారం కోసం ఇవే మోసపు హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ అక్కడి ప్రజలకు కనీసం రేషన్ ఇవ్వడం లేదన్నారు. కర్ణాటకలో అడ్డగోలుగా కరెంట్ చార్జీలు పెంచారని,100 రోజుల్లోనే 50% కమిషన్ సర్కార్ గా ముద్ర వేసుకుందన్నారు. కాంగ్రెస్ ఇప్పుడు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో రూ .500 లకే గ్యాస్ సిలిండర్, 4వేల పెన్షన్ ఎందుకు ఇవ్వట్లేదని ప్రశ్నించారు.
తన మనుగడకే గ్యారెంటీ లేని కాంగ్రెస్ పార్టీ గ్యారెంటీల పేరిట హామీలు ప్రకటించడం హాస్యాస్పదం అన్నారు. కాంగ్రెస్ అంటేనే అవినీతికి బ్రాండ్ అంబాసిడర్ అని కేసిఆర్ చేతుల్లో పదిలంగా, సుభిక్షంగా ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని ప్రజలే కాంగ్రెస్ చేతుల్లోకి పోనివ్వరన్నారు. పేదలను,రైతులను హింసించి క్షోభ పెట్టిన కాంగ్రెస్ పార్టీని తెలంగాణ ప్రజలు ఎన్నటికీ నమ్మరన్నారు.
కేసిఆర్ “అబ్ కి బార్ కిసాన్ సర్కార్” నినాదంతో కాంగ్రెస్, బీజేపీ లకు ముచ్చెమటలు పడుతున్నాయని, కేసిఆర్ ను ఎదుర్కొనే సత్తా,ధైర్యం కాంగ్రెస్,బీజేపీ లకు లేనే లేదని స్పష్టం చేశారు. పొరపాటున కాంగ్రెస్ వస్తె పైరవీలు,కమిషన్లతో దళారుల పాలనే మళ్ళీ పునరావృతం అవుతుందని అన్నారు. కేసిఆర్ చావు నోట్లో తలపెట్టి సాధించిన తెలంగాణను గుంట నక్కల పాలు కానివ్వడని, తన ప్రాణం అడ్డు వేసి అయినా సరే తెలంగాణకు ఏమీ కాకుండా కాపాడుకుంటడని తేల్చి చెప్పారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
