ఔదార్యం చాటుకున్న రాష్ట్ర మంత్రి పొన్నం.. దుబాయ్‌లో ఆపదలో ఉన్న కార్మికుడికి ఆసరా
ఆయన పేరు చొప్పరి లింగయ్య సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ వాసి. బతుకుదెరువు కోసం అప్పుల బాధ భరించలేక దుబాయ్ వెళ్ళాడు. గత వారం తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ గల్ఫ్ కార్మికుడు చొప్పరి లింగయ్య ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్‌కు సెల్ఫీ వీడియో ద్వారా విజ్ఞప్తి చేశాడు. దీంతో స్పందించిన మంత్రి పొన్నం ప్రభాకర్ స్వయంగా ఫ్లైట్ టికెట్ కొని పంపించారు.

ఆయన పేరు చొప్పరి లింగయ్య సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ వాసి. బతుకుదెరువు కోసం అప్పుల బాధ భరించలేక దుబాయ్ వెళ్ళాడు. గత వారం తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ గల్ఫ్ కార్మికుడు చొప్పరి లింగయ్య ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్‌కు సెల్ఫీ వీడియో ద్వారా విజ్ఞప్తి చేశాడు. దీంతో స్పందించిన మంత్రి పొన్నం ప్రభాకర్ స్వయంగా ఫ్లైట్ టికెట్ కొని పంపించారు. స్వదేశానికి లింగయ్యను రప్పించారు.
అప్పుల బాధ భరించలేక చొప్పరి లింగయ్య గల్ఫ్ దేశానికి వలస వెళ్లాడు. అక్కడ పారగాన్ కంపెనీలో ఉద్యోగమనే వెళ్ళిన చొప్పరి లింగయ్యకు మొదట్లో బాగానే ఉన్నా, తరువాత ఆరోగ్యం క్షీణించి నడవలేని పరిస్థితుల్లో అనారోగ్యం పాలయ్యాడు. భారతదేశానికి తిరిగి రావాలన్న పాస్‌పోర్ట్ కంపెనీ వాళ్ల దగ్గర ఉండిపోవటంతో.. గతి లేని పరిస్థితిలో తన ధీనగాథను సెల్ఫీ వీడియోలో వివరిస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్ వేడుకున్నారు.
లింగయ్యది సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ అవ్వటంతో మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించి వెంటనే సంబంధిత అధికారులతో మాట్లాడి లింగయ్యను ఇక్కడికి తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేశారు. గల్ఫ్ ఎన్నారై సంఘాలతో ఎంబసీతో సంప్రదింపులు చేసిన ఎన్ఆర్ఐ సంఘాలు లింగయ్య పని చేస్తున్న కంపెనీకి వెళ్లి కంపెనీ యాజమాన్యంతో మాట్లాడి డాక్యుమెంటేషన్ ప్రాసెస్ పూర్తి చేసి భారత్‌కు పంపేందుకు ఏర్పాటు చేశారు. చొప్పరి లింగయ్య కు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ఎన్నారై అడ్వైజరీ కమిటీ మొత్తం వ్యవహారం సమన్వయం చేశారు. అనారోగ్యంతో ఇబ్బందులు పడుతున్న తనకి బాగోగులు చూసుకోవడానికి పంపించి,ఫ్లైట్ టికెట్ డబ్బులు చెల్లించి స్వగ్రామానికి తీసుకొచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు చొప్పరి లింగయ్య, ఆయన కుటుంబ సభ్యులు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




