Telangana: మిగతా నాలుగు గ్యారెంటీల అమలుకు సిద్దమైన ప్రభుత్వం.. దరఖాస్తుల స్వీకరణ ఎప్పుడంటే..
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ ఆరు గ్యారెంటీ హామీలను ప్రకటించింది. వీటిలో ఇప్పటికే మహాలక్ష్మీ, ఆరోగ్య శ్రీ అనే రెండింటిని కాంగ్రెస్ అమలు చేస్తోంది. మహాలక్ష్మి పథకంలో భాగంగా ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం.. ఆరోగ్య శ్రీ పరిమితి పది లక్షలకు పెంపు అమలు చేస్తోంది. మిగిలిన నాలుగింటిపై కాంగ్రెస్ దృష్టిపెట్టింది.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ ఆరు గ్యారెంటీ హామీలను ప్రకటించింది. వీటిలో ఇప్పటికే మహాలక్ష్మీ, ఆరోగ్య శ్రీ అనే రెండింటిని కాంగ్రెస్ అమలు చేస్తోంది. మహాలక్ష్మి పథకంలో భాగంగా ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం.. ఆరోగ్య శ్రీ పరిమితి పది లక్షలకు పెంపు అమలు చేస్తోంది. మిగిలిన నాలుగింటిపై కాంగ్రెస్ దృష్టిపెట్టింది. ఇందులో భాగంగా ఆరు గ్యారెంటీలని పూర్తిగా అమలు చేసేందుకు లబ్ధిదారుల నుంచి దరఖాస్తులు స్వీకరించబోతున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చెప్పారు.
ఇందుకోసం ఈ నెల 28 నుంచి జనవరి 6 వరకు గ్రామసభల్లో నిర్వహించే ‘ప్రజా పాలన’ కార్యక్రమాల్లో దరఖాస్తుల్ని స్వీకరించబోతున్నట్లు పొంగులేటి ఆదివారం మీడియాకు వెల్లడించారు. ”ప్రభుత్వ పథకాలు పొందే అర్హత ఉన్న వారు గ్రామ సభల్లో అధికారులకు దరఖాస్తులు అందజేయాలి. ప్రజలు దరఖాస్తులు ఇచ్చిన అనంతరం అధికారులు వారికి ఒక రశీదు అందజేస్తారు. ప్రజల వద్దకే అధికారులు స్వయంగా అక్కడికి వెళ్లి దరఖాస్తులు స్వీకరిస్తారు.
ఈ ప్రక్రియ పూర్తైన అనంతరం ప్రజలు ఏ పథకానికి అర్హులో అధికారులే నిర్ణయిస్తారు” అని పొంగులేటి తెలిపారు. లబ్ధిదారుల ఎంపిక పేరుతో ప్రభుత్వ పథకాల్లో కోత పెట్టబోమని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. గ్రామసభలకు వచ్చే ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. గతంలో 33 శాతం మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే వారు. ప్రస్తుతం 58శాతానికి పైగా మహిళలు బస్సుల్లో ప్రయాణిస్తున్నారు. తాండాల్లోకి కూడా అధికారులే తమ ఇంటి వద్దకు వచ్చి వివరాలు అడిగి తెలుసుకుంటారన్నారు. ధరణి పోర్టల్ ద్వారా కబ్జా చేసిన భూములను స్వాధీనం చేసుకుని, పేదలకు పంచుతామన్నారు. ‘ప్రజా పాలన’ సభలు డిసెంబర్ 28వ తేదీ నుండి 2024 జనవరి 6వ తేదీ వరకు (సెలవు రోజులు మినహాయించి మొత్తం 8 పనిదినాలు) ప్రతి రోజూ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, తిరిగి మధ్యాహ్నం 2 గంటల నుంచి సా.5 గంటల వరకు జరుగుతాయని తెలిపారు.
ఈ క్రమంలోనే రాష్ట్ర సచివాలయం వేదికగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్ని జిల్లాల కలెక్టర్లు, పోలీసు ఉన్నతాధికారులతో సమావేశం ఏర్పాటు చేశారు. ప్రజలకు సంక్షేమ ఫలాలను అందించే దిశగా తీసుకోవల్సిన చర్యలపై దిశానిర్థేశం చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి సహా అన్ని శాఖల మంత్రులు, ముఖ్య కార్యదర్శులు పాల్గొన్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..