Minister KTR: రేవంత్‌, బండి సంజయ్‌లపై రూ.100 కోట్ల పరువు నష్టం దావా.. లీగల్‌ నోటీసులు పంపించిన మంత్రి కేటీఆర్‌

టీఎస్‌పీఎస్సీ పేపర్ల లీకేజీ విషయంలో తనపై నిరాధార ఆరోపణలు చేశారని మంత్రి కేటీఆర్‌ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి, బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌లకు లీగల్‌ నోటీసులు పంపించారు. రాజకీయ దురుద్దేశంతోనే తనపై ఆ ఆరోపణలు చేశారంటూ పరువు నష్టం దావా వేశారు.

Minister KTR: రేవంత్‌, బండి సంజయ్‌లపై రూ.100 కోట్ల పరువు నష్టం దావా.. లీగల్‌ నోటీసులు పంపించిన మంత్రి కేటీఆర్‌
KTR,Revanth,Bandi Sanjay
Follow us

|

Updated on: Mar 28, 2023 | 8:11 PM

TSPSC పేపర్‌ లీక్‌ వ్యవహారంలో.. తనపై నిరాధారమైన, అసత్య ఆరోపణలు చేశారంటూ KTR ఫైరయ్యారు. పదేపదే అనవసరంగా తన పేరు లాగుతున్నారని న్యాయవాది ద్వారా లీగల్ నోటీసులను పంపించారు. సుదీర్ఘ కాలం పాటు ప్రజా జీవితంలో ఉన్న తన పరువుకు భంగం కలిగించాలన్న దురుద్దేశంతోనే బండి సంజయ్, రేవంత్ రెడ్డి అబద్ధాలు మాట్లాడుతుని KTR అన్నారు. ప్రజాప్రతినిధిగా ఉన్నంత మాత్రాన ఎదుటి వాళ్లపై అసత్య ప్రేలాపనాలు కరెక్ట్‌ కాదన్నారు. IPC సెక్షన్‌ 499, 500 నిబంధనల ప్రకారం పరువు నష్టం దావా నోటీసులు పంపించారు. లీకులతో KTR పీఏకి సంబంధం ఉందని ఆరోపించారు.  వారం రోజులలోగా ఇద్దరూ తమ వ్యాఖ్యలను వెనక్కు తీసుకొని క్షమాపణ చెప్పాలన్నారు KTR. లేదంటే 100 కోట్ల రూపాయల పరువు నష్టం దావాను ఎదుర్కోవాల్సి వస్తుందని నోటీసులో పేర్కొన్నారు. తనపై ఏయే సందర్భాల్లో ఎవరు ఏ ఆరోపణలు చేశారనే దానికి సంబంధించిన సాక్షాలను కూడా నోటీసుల్లో ప్రస్తావించారు.

‘రేవంత్‌, బండి సంజయ్‌ పదే పదే అబద్ధాలాడుతున్నారు. టీఎస్‌పీఎస్సీ పేపర్ల లీకేజీ విషయంలో నాపై నిరాధార ఆరోపణలు చేశారు. రాజకీయ దురుద్దేశంతోనే ఈ వ్యాఖ్యలు చేశారు. వాళ్లు అనవసరంగా నా పేరును ఇందులోకి లాగుతున్నారు.  వారంలోపు ఈ వ్యాఖ్యలు వెనక్కు తీసుకోవాలి. లేకుంటే రూ. 100 కోట్ల పరువు నష్టం దావా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి’ అని నోటీసుల్లో స్పష్టం చేశారు కేటీఆర్.

ఇవి కూడా చదవండి
Ktr Notice

Ktr Notice

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం.. క్లిక్ చేయండి..