Minister KTR: చాలా కాలం తర్వాత ప్రశాంతంగా నిద్ర పట్టింది.. మంత్రి కేటీఆర్ సంచలన ట్వీట్..
తెలంగాణ ఎన్నికలు ముగిశాయి. డిసెంబర్ 3న ఫలితాలు వెలువడనున్నాయి. దీంతో అటు అభ్యర్థుల్లో.. ఇటు ఆయా పార్టీల క్యాడర్‌లో ఉత్కంఠ నెలకొంది. విజయంపై ఎవరికి వారే ధీమా వ్యక్తంచేస్తున్నారు.. అంతేకాకుండా పోలింగ్ సరళి, ఎగ్జిట్ పోల్స్ పై అంచనాలు వేసుకుంటున్నారు. ఎక్కడ పరిస్థితులు అనుకూలంగా మారాయి.. ఎక్కడ ప్రతికూలంగా మారాయంటూ బేరీజు వేసుకుంటున్నారు.

తెలంగాణ ఎన్నికలు ముగిశాయి. డిసెంబర్ 3న ఫలితాలు వెలువడనున్నాయి. దీంతో అటు అభ్యర్థుల్లో.. ఇటు ఆయా పార్టీల క్యాడర్‌లో ఉత్కంఠ నెలకొంది. విజయంపై ఎవరికి వారే ధీమా వ్యక్తంచేస్తున్నారు.. అంతేకాకుండా పోలింగ్ సరళి, ఎగ్జిట్ పోల్స్ పై అంచనాలు వేసుకుంటున్నారు. ఎక్కడ పరిస్థితులు అనుకూలంగా మారాయి.. ఎక్కడ ప్రతికూలంగా మారాయంటూ బేరీజు వేసుకుంటున్నారు. ఇంకా ఎగ్జిట్ పోల్స్ పల్స్ ను చూస్తూ.. అనుచరులతో విశ్లేషణ జరుపుతున్నారు. తెలంగాణ ఎన్నికల పోలింగ్ ముగిసిన తర్వాత అన్ని నియోజకవర్గాల్లో దాదాపు ఇదే పరిస్థితి కనిపిస్తోంది.. ఈ తరుణంలో భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్.. మంత్రి కేటీఆర్ కీలక ట్వీట్ చేశారు. చాలాకాలం తర్వాత నిన్న రాత్రి మంచి నిద్రపోయానంటూ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. ఎగ్జిట్‌పోల్స్ ఫలితాల్లో అతిశయోక్తులున్నాయి.. కౌంటింగ్‌లో తమకు మంచి ఫలితాలు వస్తాయంటూ కేటీఆర్ వివరించారు. తెలంగాణ కేసీఆర్ తోనే ఉందంటూ మరోసారి.. కేటీఆర్ ఎక్స్‌లో కీలక మెస్సెజ్ ను షేర్ చేశారు. ‘‘చాలా కాలం తర్వాత ప్రశాంతంగా నిద్ర పట్టింది.. ఎగ్జిట్ పోల్స్ ను పట్టించుకోలేదు.. ఎక్సాక్ట్ పోల్స్ మాకు శుభవార్తనిస్తాయి’’.. అంటూ కేటీఆర్ పేర్కొన్నారు.
After a long time had a peaceful sleep 😴
Exit polls can take a hike
Exact polls will give us good news. 👍#TelanganaWithKCR
— KTR (@KTRBRS) December 1, 2023
అయితే, ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య నెక్ టు నెక్ ఫైట్ ఉన్నాయంటూ పేర్కొన్న తరుణంలో మంత్రి కేటీఆర్ స్పందించారు.. బీఆర్ఎస్ శ్రేణులు అధైర్య పడాల్సిన అవసరం లేదని, హ్యాట్రిక్ విజయం సాధించబోతున్నామంటూ పోలింగ్ ముగిసిన తర్వాత వెల్లడించారు. గతంలో కూడా ఎగ్జిట్ పోల్స్ తప్పు అని ప్రూవ్ చేశాం.. మళ్ళీ చేస్తాం. డిసెంబర్ 3 నాడు 70+ సీట్లతో బీఆర్ఎస్ తిరిగి అధికారంలోకి రాబోతుందంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ స్పష్టంచేశారు.
గతంలో కూడా ఎగ్జిట్ పోల్స్ తప్పు అని ప్రూవ్ చేశాం.. మళ్ళీ చేస్తాం. డిసెంబర్ 3 నాడు 70+ సీట్లతో బీఆర్ఎస్ తిరిగి అధికారంలోకి రాబోతుంది.
– బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి @KTRBRS.#KCROnceAgain pic.twitter.com/zEEqm68SUh
— BRS Party (@BRSparty) November 30, 2023
తెలంగాణ పోలింగ్ కవరేజ్ కోసం..
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




