KTR: తెలంగాణ‌లోజూనియ‌ర్ డాక్ట‌ర్ల స్టైఫండ్ పెంపుపై.. ట్విట్ట‌ర్ ద్వారా స్పందించిన మంత్రి కేటీఆర్‌..

Telangana House Surgeon: క‌రోనా విప‌త్క‌ర స‌మ‌యంలో హౌస్ స‌ర్జ‌న్, పీజీ వైద్యులు ఎన్నో ర‌కాల సేవ‌లు అందిస్తున్నారు. ఈ క్ర‌మంలోనే ప‌లు రాష్ట్రాల్లో కొవిడ్ విధుల‌కు హాజ‌ర‌వుతున్న వారికి ప్ర‌భుత్వాలు...

KTR: తెలంగాణ‌లోజూనియ‌ర్ డాక్ట‌ర్ల  స్టైఫండ్ పెంపుపై.. ట్విట్ట‌ర్ ద్వారా స్పందించిన మంత్రి కేటీఆర్‌..
Ktr Tweet
Narender Vaitla

|

May 18, 2021 | 3:22 PM

Telangana House Surgeon: క‌రోనా విప‌త్క‌ర స‌మ‌యంలో హౌస్ స‌ర్జ‌న్, పీజీ వైద్యులు ఎన్నో ర‌కాల సేవ‌లు అందిస్తున్నారు. ఈ క్ర‌మంలోనే ప‌లు రాష్ట్రాల్లో కొవిడ్ విధుల‌కు హాజ‌ర‌వుతున్న వారికి ప్ర‌భుత్వాలు ప్రోత్సాహాలు అందిస్తున్నాయి. తాజాగా ఇదే విష‌యాన్ని తెలంగాణ‌కు చెందిన స్నేహ సోమారెడ్డి అనే వైద్యురాలు ట్విట్ట‌ర్ వేదిక‌గా ప్ర‌భుత్వానికి తెలిపారు. ఈ విష‌య‌మై స్నేహ సోమారెడ్డి ట్వీట్ చేస్తూ.. సార్‌.. మీరు చాలా మందికి స‌హాయం చేస్తున్నారు. క‌రోనా విప‌త్క‌ర ప‌రిస్థితుల్లో ప‌నిచేస్తున్న రెసిడెంట్ డాక్టర్లు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గ‌డిచిన 4 నెల‌ల నుంచి మాకు జీతాలు కూడా అంద‌డం లేదు. క‌రోనా విధుల‌కు హాజ‌రైన వారికి ఇత‌ర రాష్ట్రాల్లో ప్రోత్స‌హ‌కాలు ఇస్తున్నారు. మాకు అలాంటివి కూడా అందడం లేదు. మా జీవితాల‌ను ఫ‌ణంగా పెట్టి మేము ఎలా ప‌నిచేయాలి సార్‌.. అంటూ ట్వీట్ చేశారు.

ఈ విష‌యాన్ని గ‌మ‌నించిన మంత్రి కేటీఆర్ వెంట‌నే స్పందించారు. సోమారెడ్డి చేసిన ట్వీట్‌కు స్పందిస్తూ.. మేము ఈ విష‌యాన్ని ఇప్ప‌టికే గౌర‌వ ముఖ్యమంత్రి ద‌గ్గ‌ర ప్ర‌స్తావించాము. 15 శాతం స్టైఫండ్ పెంచాల‌ని హెల్త్ సెక్ర‌ట‌రీకి సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. ఇవాళ జీవో విడుద‌ల అవుతుంద‌ని కేటీఆర్ రీట్వీట్ చేశారు. దీంతో స్టైఫండ్ పెంచుతూ నిర్ణ‌యం తీసుకున్నారు.

కేటీఆర్ స్పంద‌న‌..

Also Read: Cyberabad Police: మీరు జాగ్రత్తలు పాటించండి.. అందరినీ జాగ్రత్తగా ఉండేలా చేయండి..ఆకట్టుకుంటున్న సైబరాబాద్ పోలీసుల వీడియో!

Telangana High Court: సీటీ స్కాన్‌, రక్త‌ప‌రీక్ష‌ల‌పై స‌ర్కారుకు హైకోర్టు ఆదేశం.. ప్ర‌భుత్వం ధ‌ర‌ల‌ను నిర్ణ‌యించాల‌ని..

Harishrao Review: ఉన్నతాధికారులతో మంత్రి హ‌రీష్ రావు భేటీ.. రాష్ట్రంలో కరోనా పరిస్థితలపై స‌మీక్ష

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu