Minister KTR: నల్ల బంగారానికే కాదు.. తెల్ల బంగారానికి కూడా తెలంగాణ ఖ్యాతి.. మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు..

Minister KTR Warangal Visit: నల్లబంగారానికే కాదు తెల్ల బంగారానికి కూడా తెలంగాణ ఖ్యాతిగాంచిందని పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ అన్నారు. తెలంగాణలో పండే పత్తి అత్యంత నాణ్యమైనదని తెలిపారు. ఫామ్‌ టూ ఫ్యాషన్‌ అన్నట్టుగా కాకతీయ మెగా టెక్స్‌టైల్‌ పార్క్‌ నిలిచిపోతుందని ప్రకటించారు.

Minister KTR: నల్ల బంగారానికే కాదు.. తెల్ల బంగారానికి కూడా తెలంగాణ ఖ్యాతి.. మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు..
Minister Ktr

Updated on: Jun 17, 2023 | 7:35 PM

Minister KTR Warangal Visit: దక్షిణా కొరియాకు చెందినఅగ్రశ్రేణి వస్త్ర సంస్థ యంగ్‌ వన్‌ వరంగల్‌ కాకతీయ మెగా టెక్స్‌టైల్‌ పార్కులో నెలకొల్పుతున్న ఎవర్‌టాప్‌ టెక్స్‌టైల్‌ అండ్‌ అపరెల్‌ కాంప్లెక్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ శంకుస్థాపన జరిగింది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో పరిశ్రమల శాఖ మంత్రి KTR, భారత్‌లో దక్షిణ కొరియా రాయబారి చాంగ్‌ జే-బాక్‌ హాజరయ్యారు. ఈ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొనేందుకు యంగ్‌వన్‌ కంపెనీ ఛైర్మన్‌ కూడా వరంగల్‌ వచ్చారు. కాకతీయ మెగా టెక్స్‌టైల్‌ పార్కులో కొరియన్‌ సంస్థ యంగ్‌ వన్‌ 11 పరిశ్రమలు నెలకొల్పనుంది. మొదటి దశలో నాలుగు ఫ్యాక్టరీలు ఏర్పాటు కానున్నాయి. ఈ కంపెనీ ద్వారా 21 వేల మందికి ఉపాధి లభించనుంది.

ఈ సందర్భంగా మాట్లాడిన గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు కాకతీయ టెక్స్‌టైల్‌ పార్క్‌ కోసం భూములిచ్చిన రైతులకు అభినందనలు తెలిపారు. కాకతీయ టెక్స్‌టైల్‌ పార్కులో 261 ఎకరాల్లో దాదాపు 900 కోట్ల రూపాయలతో ఫ్యాక్టరీలు ఏర్పాటు చేయబోతోంది యంగ్‌ వన్‌ సంస్థ. 1974లో ఈ సంస్థను నెలకొల్పారు. ఔట్‌డోర్‌, అథ్లెటిక్‌, దుస్తులు, టెక్స్‌టైల్స్‌, ఫుట్‌వేర్‌ తయారీలో అంతర్జాతీయంగా ప్రముఖ సంస్థ ఇది.

ఇవి కూడా చదవండి


మరిన్ని తెలంగాణ వార్తల కోసం..