AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఫ్లైట్ నడిపి అదరహో అనిపించిన మంత్రి కేటీఆర్….

భారతదేశంలో పౌర విమానయాన రంగానికి ఉజ్వల భవిష్యత్‌ ఉందన్నారు మంత్రి కేటీఆర్‌. భాగస్వామ్యంతో కూడిన పెట్టుబడులు ఈ రంగాన్ని మంచి స్థితిలో ఉంచుతాయని చెప్పారు. ఎఫ్‌ఎస్‌టీసీ పైలట్‌ శిక్షణా...

ఫ్లైట్ నడిపి అదరహో అనిపించిన మంత్రి కేటీఆర్....
Jyothi Gadda
|

Updated on: Mar 13, 2020 | 12:30 PM

Share

భారతదేశంలో పౌర విమానయాన రంగానికి ఉజ్వల భవిష్యత్‌ ఉందన్నారు మంత్రి కేటీఆర్‌. భాగస్వామ్యంతో కూడిన పెట్టుబడులు ఈ రంగాన్ని మంచి స్థితిలో ఉంచుతాయని చెప్పారు. ఎఫ్‌ఎస్‌టీసీ పైలట్‌ శిక్షణా కేంద్రాన్ని శంషాబాద్ లో మంత్రి కేటీఆర్‌ గురువారం ప్రారంభించారు. ఈ సందర్బంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ…ఎఫ్‌ఎస్‌టీసీ తన శిక్షణా సంస్థను హైదరాబాద్‌లో ఏర్పాటు చేయడం హర్షనీయమని ప్రశంసించారు.

ఫ్లైట్‌ సిములేషన్‌ టెక్నిక్‌ సెంటర్‌ దేశంలోని విమానయాన శిక్షణా సంస్థల్లో ప్రధానమైంది. డీజీసీఏ, ఈఏఎస్‌ఏ చేత గుర్తింపు పొందిన సంస్థ ఎఫ్‌ఎస్‌టీసీ ఇప్పటికే ఎంతో మంది పైలెట్లకు శిక్షణ ఇచ్చింది. కాగా అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన ఎఫ్‌ఎస్‌టీసీ శిక్షణా కేంద్రాలు దేశంలో గురుగ్రామ్‌, హైదరాబాద్‌లో మాత్రమే ఉన్నాయి. దీని ద్వారా ఈ ప్రాంతవాసులకు శిక్షణా సౌకర్యాలు, పరిశ్రమ అభివృద్ధి, యువతకు అవకాశాలు పెరుగుతాయని కేటీఆర్ చెప్పారు. శిక్షణా కేంద్రాన్ని ఏర్పాటు చేసిన ఎఫ్‌ఎస్‌టీసీ నిర్వాహకులకు మంత్రి శుభాకాంక్షలు తెలిపారు.

Follow Us
తెలంగాణ ప్రవేశ పరీక్షల తేదీలు 2026 విడుదల.. పూర్తి షెడ్యూల్ ఇదే
తెలంగాణ ప్రవేశ పరీక్షల తేదీలు 2026 విడుదల.. పూర్తి షెడ్యూల్ ఇదే
చర్చలు సఫలం.. శనివారం నుంచి యధావిధిగా ఆర్టీసీ బస్సులు
చర్చలు సఫలం.. శనివారం నుంచి యధావిధిగా ఆర్టీసీ బస్సులు
విజయం సాధించిన ఆర్సీబీ
విజయం సాధించిన ఆర్సీబీ
చీమకు ఎన్ని పళ్ళు ఉంటాయో మీకు తెలుసా? 99 శాతం మందికి తెలియని నిజా
చీమకు ఎన్ని పళ్ళు ఉంటాయో మీకు తెలుసా? 99 శాతం మందికి తెలియని నిజా
మీ బంధం దృఢంగా ఉండాలంటే.. పెళ్లికి ముందే ఈ 4 విషయాలపై క్లారిటీ త
మీ బంధం దృఢంగా ఉండాలంటే.. పెళ్లికి ముందే ఈ 4 విషయాలపై క్లారిటీ త
బూట్లు ఉతికే ఓపిక లేదా? ఈ 5 చిట్కాలు పాటించండి.. నీరు లేకుండానే మ
బూట్లు ఉతికే ఓపిక లేదా? ఈ 5 చిట్కాలు పాటించండి.. నీరు లేకుండానే మ
కొబ్బరి పాల చికెన్ చేశారంటే.. తిన్నవాళ్ళు మైమరచిపోవాల్సిందే
కొబ్బరి పాల చికెన్ చేశారంటే.. తిన్నవాళ్ళు మైమరచిపోవాల్సిందే
కొత్తిమీరతో వెరైటీగా ఉప్మా.. ఇలా చేశారో నోరూరాల్సిందే
కొత్తిమీరతో వెరైటీగా ఉప్మా.. ఇలా చేశారో నోరూరాల్సిందే
అధిక రక్తపోటుకు కారణాలు ఏంటి..? అతిగా ఆలోచిస్తే బీపీ పెరుగుతుందా?
అధిక రక్తపోటుకు కారణాలు ఏంటి..? అతిగా ఆలోచిస్తే బీపీ పెరుగుతుందా?
స్పృహ తప్పిన వ్యక్తికి నీళ్లు తాగిస్తున్నారా.. అయితే డేంజరే
స్పృహ తప్పిన వ్యక్తికి నీళ్లు తాగిస్తున్నారా.. అయితే డేంజరే