AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TG TET Results 2026: అభ్యర్థులకు బిగ్‌ అలర్ట్.. మరికొన్ని గంటల్లో టెట్ ఫలితాలు.. రిజల్ట్స్ ఇలా చెక్ చేసుకోండి!

తెలంగాణ వ్యాప్తంగా ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్‌ రాసిన అభ్యర్థులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సమయం వచ్చేసింది. జూన్ నెలలో నిర్వహించిన టెట్ పరీక్షల ఫలితాలను ఎట్టకేలకు జూలై 13, 2026 సోమవారం మధ్యాహ్నం 2:30 గంటలకు అధికారికంగా విడుదల చేయనున్నారు. పూర్తి వివరాలు ఇక్కడ ఉన్నాయి..

TG TET Results 2026: అభ్యర్థులకు బిగ్‌ అలర్ట్.. మరికొన్ని గంటల్లో టెట్ ఫలితాలు.. రిజల్ట్స్  ఇలా చెక్ చేసుకోండి!
Tg Tet 2026 Results
Vidyasagar Gunti
| Edited By: |

Updated on: Jul 12, 2026 | 6:46 PM

Share

తెలంగాణలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష TG TET -2026 రాసిన లక్షలాది మంది అభ్యర్థులు ఎంతగానో ఎదురుచూస్తున్న క్షణాలు రానే వచ్చాయి. జూన్ నెలలో నిర్వహించిన టెట్ పరీక్షల ఫలితాలను ఎట్టకేటకు జూలై 13, 2026 సోమవారం మధ్యాహ్నం 2:30 గంటలకు అధికారికంగా విడుదల చేయనున్నారు. హైదరాబాద్‌లోని స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ కార్యాలయంలో ఈ ఫలితాల విడుదల కార్యక్రమం జరగనుంది.

తెలంగాణ వ్యాప్తంగా ఈ ఏడాది జూన్ 16 నుంచి జూన్ 22 వరకు అత్యంత పారదర్శకంగా కఠిన నిబంధనల నడుమ టెట్ పరీక్షలు జరిగాయి. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 1.15 లక్షల మంది అభ్యర్థులు ఈ పరీక్షలకు హాజరయ్యారు. ఉపాధ్యాయ ఉద్యోగ సాధనలో అత్యంత కీలకమైన ఈ టెట్ పరీక్ష కోసం అభ్యర్థులు ఎంతో కాలంగా ప్రిపేర్ అయ్యారు. పరీక్షలు ముగిసిన నాటి నుంచి ఫలితాల కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్న అభ్యర్థుల నిరీక్షణకు విద్యాశాఖ రేపటితో తెరదించనుంది. రికార్డు స్థాయిలో పరీక్షలు ముగిసిన కొద్ది రోజుల్లోనే విద్యాశాఖ అన్ని ప్రక్రియలను పూర్తి చేసి పారదర్శకంగా ఫలితాలను సిద్ధం చేయడం విశేషం.

ఫలితాలు విడుదలైన వెంటనే అభ్యర్థులు తమ హాల్ టికెట్ నంబర్ సహాయంతో అధికారిక వెబ్‌సైట్‌లో రిజల్ట్స్‌ను చూసుకోవచ్చు. పేపర్-1, పేపర్-2 పరీక్షలకు హాజరైన అభ్యర్థుల మార్కుల వివరాలు, వారు సాధించిన అర్హత శాతం వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనున్నారు. రాబోయే రోజుల్లో రాష్ట్రంలో భారీగా ఉపాధ్యాయ నియామకాలు చేపట్టే అవకాశం ఉండటంతో, ఈ టెట్ స్కోర్ అభ్యర్థుల భవిష్యత్తుకు ఎంతో కీలకం కానుంది. అభ్యర్థులు ఫలితాలకు సంబంధించిన తాజా అప్‌డేట్ల కోసం విద్యాశాఖ అధికారిక వెబ్‌సైట్‌ను క్రమం తప్పకుండా పరిశీలించాలని అధికారులు సూచించారు.

ఇవి కూడా చదవండి

రిజల్ట్స్ చెక్ చేసుకునే విధానం:

  1. మొదట తెలంగాణ టెట్ అధికారిక వెబ్‌సైట్ tgtet.aptonline.in ఓపెన్ చేయండి.

  2. హోంపేజీలో కనిపిస్తున్న TG TET 2026 Results అనే లింక్‌పై క్లిక్ చేయండి.

  3. మీ హాల్ టికెట్ నంబర్, పుట్టిన తేదీ  ఎంటర్ చేయండి

  4. తర్వాత సబ్‌మిట్ కొట్టి Get Result బటన్‌పై క్లిక్ చేయండి.

  5. మీ మార్కులు, అర్హత సాధించిన వివరాలతో కూడిన రిజల్ట్ స్క్రీన్‌పై కనిపిస్తుంది.

మరిన్ని కెరీర్ అండ్ ఉద్యోగ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us