AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మరోసారి దుమారం రేపుతోన్న మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలు.. ఈసారి ఏకంగా రాష్ట్రపతిపైనే..!

మంత్రి కొండా సురేఖ తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం.. ఆ వ్యాఖ్యలకు వివరణ ఇచ్చుకోవడం రొటీన్‌గా మారిపోయింది. గతంలో ఫోన్‌ ట్యాపింగ్ కేసులోనూ బీఆర్ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌పై కొండా సురేఖ కాంట్రవర్సీ కామెంట్స్‌ చేశారు. కొండా సురేఖ చేసిన ఆరోపణలు నిరాధారమని కేటీఆర్‌ కోర్టులో పరువు నష్టం దావా వేశారు. ఈ కేసులో మంత్రి కొండా సురేఖపై కేసు నమోదు చేయాలని కోర్టు పోలీసులను ఆదేశించింది.

మరోసారి దుమారం రేపుతోన్న మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలు.. ఈసారి ఏకంగా రాష్ట్రపతిపైనే..!
Minister Konda Surekha
Balaraju Goud
|

Updated on: Aug 07, 2025 | 8:08 AM

Share

తెలంగాణ మంత్రి కొండా సురేఖ వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిపోయారు. ఇప్పటివరకు జిల్లా, రాష్ట్ర స్థాయిలో వివాదాలను రాజేసిన కొండా సురేఖ ఇప్పుడు దేశంపై పడ్డారు. ఏకంగా దేశ ప్రథమ పౌరురాలు, రాష్ట్రపతి ద్రౌపది ముర్ముపై సంచలన వ్యాఖ్యలు చేశారు. బీసీరిజర్వేషన్ల పెంపుకు ఆమోదం తెలపాలని కోరుతూ తెలంగాణ కాంగ్రెస్ ఢిల్లీలో నిర్వహించిన ధర్నాలో ప్రధాని మోదీ, బీజేపీని టార్గెట్ చేశారు కొండా సురేఖ. నూతన పార్లమెంట్ భవన ప్రారంభోత్సవానికి అత్యున్నత పదవిలో ఉన్న రాష్ట్రపతిని బీజేపీ ప్రభుత్వం ఆహ్వానించలేదని… ఆమె వితంతువు కాబట్టే మోదీ పిలవలేదని కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయోధ్య రామమందిర ప్రారంభోత్సవానికి కూడా రాష్ట్రపతి ద్రౌపది ముర్మును పిలవలేదని… ఆమె గిరిజన మహిళ కాబట్టే ఇక్కడికి కూడా మోదీ సర్కార్ రానివ్వలేదన్నారు కొండా సురేఖ.

రాష్ట్రపతిని ఉద్దేశించి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రపతికి కొండా సురేఖ క్షమాపణలు చెప్పాలని బీజేపీ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్‌ డిమాండ్ చేశారు. కొండ సురేఖకు రాజకీయ పరిజ్ఞానం లేక ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నారని అన్నారు తెలంగాణ బీజేపీ చీఫ్‌ రాంచందర్‌ రావు.

మంత్రి కొండా సురేఖ తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం.. ఆ వ్యాఖ్యలకు వివరణ ఇచ్చుకోవడం రొటీన్‌గా మారిపోయింది. గతంలో ఫోన్‌ ట్యాపింగ్ కేసులోనూ బీఆర్ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌పై కొండా సురేఖ కాంట్రవర్సీ కామెంట్స్‌ చేశారు. కొండా సురేఖ చేసిన ఆరోపణలు నిరాధారమని కేటీఆర్‌ కోర్టులో పరువు నష్టం దావా వేశారు. ఈ కేసులో మంత్రి కొండా సురేఖపై కేసు నమోదు చేయాలని కోర్టు పోలీసులను ఆదేశించింది. అంతే కాదు పైసలిస్తేనే మంత్రుల వద్ద ఫైల్స్ క్లియరవుతాయి అంటూ కొన్ని నెలల క్రితం కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ అయ్యాయి. మంత్రి కొండా సురేఖ చేస్తున్న కామెంట్స్‌ పార్టీకి, ప్రభుత్వానికి తలనొప్పిగా మారుతున్న నేపథ్యంలో ఈ కాంట్రవర్సీలకు కాంగ్రెస్‌ ఎలా చెక్‌ పెడుతుందో చూడాలి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..