Komati Reddy Venkat Reddy: న్యూఇయర్ వేళ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి కీలక సూచన..

న్యూఇయర్ వేడుకలు దేశ వ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా యువత షాపింగ్, రెస్టారెంట్, పబ్, ఈవెంట్‎పై ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. ఇదిలా ఉంటే ప్రముఖులకు కొందరు శ్రేయోభిలాషులు, మిత్రులు కలుసుకొని బొకేలు, స్వీట్లు, కేకులు ఇచ్చి న్యూఇయర్ శుభాకాంక్షలు తెలుపుతూ ఉంటారు. దీనిపై తాజాగా మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి స్పందించారు. తనను కలిసేందుకు వచ్చే నాయకులు బొకేలు, శాలువాలు తీసుకురావొద్దని తెలిపారు.

Komati Reddy Venkat Reddy: న్యూఇయర్ వేళ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి కీలక సూచన..
Komatireddy Venkat Reddy
Follow us

|

Updated on: Dec 31, 2023 | 10:09 PM

న్యూఇయర్ వేడుకలు దేశ వ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా యువత షాపింగ్, రెస్టారెంట్, పబ్, ఈవెంట్‎పై ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. ఇదిలా ఉంటే ప్రముఖులకు కొందరు శ్రేయోభిలాషులు, మిత్రులు కలుసుకొని బొకేలు, స్వీట్లు, కేకులు ఇచ్చి న్యూఇయర్ శుభాకాంక్షలు తెలుపుతూ ఉంటారు. దీనిపై తాజాగా మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి స్పందించారు. తనను కలిసేందుకు వచ్చే నాయకులు బొకేలు, శాలువాలు తీసుకురావొద్దని తెలిపారు. వాటికి పెట్టే ఖర్చును సీఎం రిలీఫ్ ఫండ్‎కు ట్రాన్స్ ఫర్ చేయాలని సూచించారు. డబ్బులు వృథా చేయకుండా సీఎం రిలీఫ్‌ ఫండ్‌కు ఇస్తే నిరుపేదల ఆరోగ్య రక్షణకు ఉపయోగపడుతాయని తెలంగాణ రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి అన్నారు. కాంగ్రెస్‌ పాలనలో ప్రజలు.. నాయకుల చుట్టూ తిరగాల్సిన పనిలేదన్నారు. ప్రజాపాలన, ఇతర కార్యక్రమాల ద్వారా తామే ప్రజల ఇంటి ముందుకు వచ్చి సమస్యలు తెలుసుకొని పరిష్కరిస్తామన్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..