Harish Rao: పక్క రాష్ట్రాలకు కరెంట్ ఇచ్చే స్థాయికి వచ్చాం.. హరీష్‌రావు

తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకలు మొదలయ్యాయి. రాష్ట్రం సాధించి పదవ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా ఈ ఉత్సవాలను రాష్ట్రప్రభుత్వం 21 రోజుల పాటు నిర్వహించనుంది. ఈ సందర్భంగా రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు తెలంగాణ సాధించిన పురోగతి గురించి పలు కీలక విషయాలు పంచుకున్నారు.

Harish Rao:  పక్క రాష్ట్రాలకు కరెంట్ ఇచ్చే స్థాయికి వచ్చాం.. హరీష్‌రావు
Harish Rao
Follow us

|

Updated on: Jun 02, 2023 | 7:57 PM

తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకలు మొదలయ్యాయి. రాష్ట్రం సాధించి పదవ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా ఈ ఉత్సవాలను రాష్ట్రప్రభుత్వం 21 రోజుల పాటు నిర్వహించనుంది. ఈ సందర్భంగా రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు తెలంగాణ సాధించిన పురోగతి గురించి పలు కీలక విషయాలు పంచుకున్నారు. రానున్న రోజుల్లో తెలంగాణ విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం 25 వేల మెగావాట్లకు చేరుకుంటుందని తెలిపారు. సింగరేణి నుంచి 800 మెగావాట్లు, యాదాద్రి నుంచి 4 వేల మెగావాట్లు అలాగే ఎన్‌టీపీసీ నుంచి 1600 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి రానుందని వివరించారు. రాష్ట్రం ఏర్పడ్డప్పుడు చత్తీస్‌గఢ్ నుంచి కరెంట్‌ను కొనుక్కొని ప్రజలు, రైతులకు విద్యుత్ అందించామని.. మరికొన్ని రోజుల్లో ఇతర రాష్ట్రాలకు తెలంగాణ విద్యుత్ అమ్మే స్థాయికి చేరనుందని వివరించారు.

ప్రభుత్వం చేపట్టిన మిషన్ కాకతీయ పథకం వల్ల రాష్ట్రంలో 46 వేల చెరువుల పునరుద్ధరణ జరిగిందని పేర్కొన్నారు. ఒక్కప్పుడు వేసవిలో తాగడానికి కూడా నీళ్లు దొరకేవి కావని.. ఇప్పుడు మాత్రం చెరువులు నిండుగా ఉంటున్నాయని పేర్కొన్నారు. మహబూబ్‌నగర్‌లో పెండింగ్ ప్రాజెక్టులు పూర్తయ్యాక వలసలు తగ్గిపోయాయని తెలిపారు. అలాగే నీటిపారుదల రంగంలో 119 శాతం వృద్ధిరేటు సాధించామని పేర్కొన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో తక్కువ కరెంట్ ఇస్తున్నారని తెలంగాణలో మాత్రం 24 గంటలు ఇస్తున్నామని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల 31 నియోజకవర్గాలకు నీళ్లు అందిస్తున్నామన్నారు.

ఇవి కూడా చదవండి

ఎన్‌పీఎస్‌ లేదా మ్యూచువల్ ఫండ్ రిటైర్‌మెంట్‌కు ఏది బెటర్?
ఎన్‌పీఎస్‌ లేదా మ్యూచువల్ ఫండ్ రిటైర్‌మెంట్‌కు ఏది బెటర్?
అనపర్తి టీడీపీలో అసంతృప్తి జ్వాలలు.. నల్లమిల్లి న్యాయ పోరాటం
అనపర్తి టీడీపీలో అసంతృప్తి జ్వాలలు.. నల్లమిల్లి న్యాయ పోరాటం
గ్రాట్యుటీ అంటే ఏమిటి? దీనిని ఎలా లెక్కిస్తారు..?
గ్రాట్యుటీ అంటే ఏమిటి? దీనిని ఎలా లెక్కిస్తారు..?
సీటు చిరిగింది - ఆఫీసు మండింది..
సీటు చిరిగింది - ఆఫీసు మండింది..
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..