AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: సిద్ధిపేట సిగలో మరో మణిహారం.. ప్రారంభానికి సిద్ధమైన ఐటీ హబ్.

మంత్రి హరీష్ రావు  ప్రాతినిధ్యం వహిస్తున్న సిద్ధిపేట అన్ని రంగాల్లో శరవేగంగా దూసుకుపోతోంది. ఇప్పటికే అభివృద్ధిలో ముందున్న సిద్ధిపేటలో ఐటీ హబ్‌ ప్రారంభానికి సిద్ధమైంది. నియోజకవర్గ స్థాయి యువతకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా కేసీఆర్ సర్కారు సిద్ధిపేటలో ఐటీ హబ్ ఏర్పాటు..

Telangana: సిద్ధిపేట సిగలో మరో మణిహారం.. ప్రారంభానికి సిద్ధమైన ఐటీ హబ్.
IT Hub In Siddipet
Narender Vaitla
|

Updated on: Jun 09, 2023 | 1:09 PM

Share

మంత్రి హరీష్ రావు  ప్రాతినిధ్యం వహిస్తున్న సిద్ధిపేట అన్ని రంగాల్లో శరవేగంగా దూసుకుపోతోంది. ఇప్పటికే అభివృద్ధిలో ముందున్న సిద్ధిపేటలో ఐటీ హబ్‌ ప్రారంభానికి సిద్ధమైంది. నియోజకవర్గ స్థాయి యువతకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా కేసీఆర్ సర్కారు సిద్ధిపేటలో ఐటీ హబ్ ఏర్పాటు చేసిందని మంత్రి హరీష్‌ రావు తెలిపారు. సిద్ధిపేట శివారులో నిర్మిస్తున్న ఐటీ హబ్‌ను శుక్రవారం ఉదయం ఏంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్‌తో కలిసి మంత్రి సందర్శించారు.

అత్యాధునిక సదుపాయాలతో నిర్మిస్తున్న ఐటీ హబ్ భవనాన్ని ఈ నెల జూన్ 15వ తేదీన రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్నట్లు మంత్రి వెల్లడించారు. దీంతో ప్రత్యక్షంగా 750 మంది స్థానిక యువతకు, పరోక్షంగా మరికొంత మందికి ఉపాధి లభిస్తుందని పేర్కొన్నారు. జూన్ 13వ తేదీన సిద్ధిపేట పోలీసు కన్వెన్షన్ హాల్ లో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు మంత్రి ప్రకటించారు. ఈ మెగా జాబ్ మేళాలో 11 కంపెనీలు ఉద్యోగ అవకాశాలు ఇవ్వనున్నాయని, ఈ సదవకాశాన్ని యువత సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

It Hub

ఇవి కూడా చదవండి

ఇదిలా ఉంటే సిద్ధిపేట ఐటీ హబ్ లో టాస్క్ ఆధ్వర్యంలో ప్రతీ బ్యాచ్ లో 150 మంది నిరుద్యోగ యువతకు శిక్షణ తరగతులు నిర్వహిస్తారని, ప్రతీ 45 రోజులకు ఒక బ్యాచ్ ఉంటుందని మంత్రి పేర్కొన్నారు. దీంతో నియోజకవర్గ పరిధిలో ఎంతో మందికి ఉద్యోగాలు వస్తాయని మంత్రి ఈ సందర్భంగా తెలిపారు. ఇదిలా ఉంటే హైదరాబాద్‌ తర్వాత ద్వితియ శ్రేణీ నగరాల్లో ఐటీని విస్తరించేందుకు తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తోంది. ఇందులో భాగంగానే ఇప్పటికే వరంగల్‌, ఖమ్మం, కరీంనగర్‌లో ఐటీ హబ్‌లో అందుబాటులోకి వచ్చాయి. మరికొన్ని రోజుల్లో నిజమాబాద్‌, మహబూబ్‌ నగర్‌, నల్లగొండ, ఆదిలాబాద్‌లోనూ ఐటీ హబ్‌లు అందుబాటులోకి రానున్నాయి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us