Siddipet: సిద్ధిపేటలో త్వరలోనే వినిపించనున్న రైలు కూత.. ఎప్పటిలోగా రానుందంటే

|

Jun 01, 2023 | 3:32 PM

సిద్ధిపేట ప్రజల ఏళ్ల నాటి కల నెరవేరనుంది. త్వరలోనే పట్టణంలో రైలు కూత పెట్టనుంది. ఇప్పటికే గజ్వల్‌ వరకు ట్రాక్‌ పనులు పూర్తికాగా ట్రయల్‌ రన్‌ కూడా జరిగింది. ఇక త్వరలోనే సిద్ధిపేటలో కూడా రైలు రానుంది. ప్రస్తుతం ట్రాక్‌ పనులు యుద్ధప్రాతిపదిక జరుగుతున్నాయి. జూలై చివరి నాటికి లేదా ఆగస్టు..

Siddipet: సిద్ధిపేటలో త్వరలోనే వినిపించనున్న రైలు కూత.. ఎప్పటిలోగా రానుందంటే
Siddipet
Follow us on

సిద్ధిపేట ప్రజల ఏళ్ల నాటి కల నెరవేరనుంది. త్వరలోనే పట్టణంలో రైలు కూత పెట్టనుంది. ఇప్పటికే గజ్వల్‌ వరకు ట్రాక్‌ పనులు పూర్తికాగా ట్రయల్‌ రన్‌ కూడా జరిగింది. ఇక త్వరలోనే సిద్ధిపేటలో కూడా రైలు రానుంది. ప్రస్తుతం ట్రాక్‌ పనులు యుద్ధప్రాతిపదిక జరుగుతున్నాయి. జూలై చివరి నాటికి లేదా ఆగస్టు మొదటి వారంలో పనులు పూర్తి చేయాలని అధికారులు టార్గెట్‌గా పెట్టుకున్నారు. ఇందులో భాగంగానే తాజాగా ఆర్థిక శాఖ మంత్రి హరీష్‌ రావు ట్రాక్‌ నిర్మాణ పనులను స్వయంగా పర్యవేక్షించారు.

యుద్ధప్రాతిపదిక ట్రాక్‌ నిర్మాణ పనులను పూర్తి చేయాలని మంత్రి హరీశ్‌ రావు రైల్వే అధికారులను, కాంట్రాక్టర్‌ను ఆదేశించారు. రైల్వే ట్రాక్‌ పనుల్లో జాప్యం జరుగొద్దని, పనుల వేగం పెంచాలని సూచించారు. సిద్దిపేట శివారులోని మందపల్లి నుంచి రైల్వేట్రాక్ నిర్మాణ పనులను జిల్లా కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌, రైల్వే శాఖ డిప్యూటీ చీఫ్‌ ఇంజినీర్‌ సంతోశ్‌ కుమార్‌తో కలిసి మంత్రి హరీశ్ రావు పరిశీలించారు.

ఇవి కూడా చదవండి

దుద్దెడ నుంచి సిద్దిపేట వరకు చేపట్టిన ట్రాక్ నిర్మాణ పనులు గురించి అధికారులు మంత్రికి వివరించారు. ఈ సందర్భంగా మందపల్లి వద్ద అండర్ పాస్ బ్రిడ్జి నిర్మాణ జాప్యంపై మంత్రి హరీశ్‌ రావు ఆరా తీశారు. పనులు జరుగుతున్న తీరును తెలుసుకుని యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని ఆదేశించారు. మెదక్‌ జిల్లా మనోహరాబాద్‌ నుంచి కరీంనగర్‌ జిల్లా కొత్తపల్లి వరకు రైల్వే పరులుగు పెట్టనున్న విషయం తెలిసిందే. ఇప్పటికే.. మనోహరాబాద్, గజ్వేల్, దుద్దెడ మధ్య పనులు కూడా పూర్తికాగా దుద్దెడ నుంచి సిద్దిపేట మధ్య మొత్తం 12 కిలోమీటర్లలో దాదాపు 1.5 కిలోమీటర్లు పూర్తి కావాల్సి ఉంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..