Minister KTR: దమ్ముంటే ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరో చెప్పాలి.. బీజేపీ, కాంగ్రెస్‌కు మంత్రి కేటీఆర్ సవాల్..

బీజేపీ, కాంగ్రెస్‌కు దమ్ముంటే ఆ పార్టీల్లో ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరో చెప్పాలని మంత్రి కేటీఆర్ సవాల్ విసిరారు. వచ్చే ఎన్నికల్లో 90 నుంచి 100 స్థానాలు గెలుస్తామన్నారు కేటీఆర్. మరోసారి కేసీఆర్‌ సీఎం అవుతారని ధీమా వ్యక్తం చేశారు. మీడియాతో చిట్‌చాట్‌గా మాట్లాడిన కేటీఆర్.. ఆ రెండు పార్టీలపై ఘాటైన విమర్శలే చేశారు.

Minister KTR: దమ్ముంటే ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరో చెప్పాలి.. బీజేపీ, కాంగ్రెస్‌కు మంత్రి కేటీఆర్ సవాల్..
Minister KTR
Follow us

|

Updated on: Jun 01, 2023 | 3:19 PM

ప్రతిపక్ష పార్టీలకు బీఆర్ఎస్ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. రాష్ట్ర ప్ర‌భుత్వంపై అన‌వ‌స‌ర ఆరోప‌ణ‌లు చేస్తున్న ప్ర‌తిప‌క్షాల‌కు కేటీఆర్ స‌వాల్ విసిరారు. తెలంగాణ క‌న్నా ఉత్త‌మ పాల‌న ఏ రాష్ట్రంలో ఉందో చెప్పాలన్నారు. బీజేపీ, కాంగ్రెస్‌కు దమ్ముంటే ఆ పార్టీల్లో ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరో చెప్పాలని మంత్రి కేటీఆర్ సవాల్ విసిరారు. వచ్చే ఎన్నికల్లో 90 నుంచి 100 స్థానాలు గెలుస్తామన్నారు కేటీఆర్. మరోసారి కేసీఆర్‌ సీఎం అవుతారని ధీమా వ్యక్తం చేశారు. మీడియాతో చిట్‌చాట్‌గా మాట్లాడిన కేటీఆర్.. ఆ రెండు పార్టీలపై ఘాటైన విమర్శలే చేశారు.

తెలంగాణ క‌న్నా మెరుగైన మోడ‌ల్ రాష్ట్రాన్ని చూపించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. మీడియా ప్రతినిధులతో మంత్రి కేటీఆర్ ముచ్చటించారు. తెలంగాణ రాష్ట్ర గత 10 సంవత్సరాలలో నీళ్లు, నిధులు, నియామకాలన్న స్పూర్తికి అనుగుణంగా పనిచేస్తుందన్నారు. అందులో విజయం సాధించిందని.. సమగ్ర, సమతుల్య, సమ్మిళిత, సమతుల్య అభివృద్ధిని సాధించిందన్నారు. విద్యా వైద్య రంగంలో తెలంగాణ అద్భుతమైన మార్పులు తీసుకురాగలిగిందన్నారు.

వైద్య రంగంలో నూతన వైద్యశాలలో మెడికల్ కాలేజీలతో సమగ్రమైన మార్పు చెందిందన్నారు. నూతన పాఠశాలలో, గురుకులాల ఏర్పాటు, మనఉరు మన బడి వంటి కార్యక్రమాల ద్వారా విద్యారంగంలో గుణాత్మకమైన మార్పు సాధ్యమైందన్నారు. గ్రామీణ అభివృద్ధి, పట్టణ అభివృద్ధి, అగ్రవర్గాలు, అణగారిన వర్గాలు.. ఇలా ఎలాంటి భేదం లేకుండా సమ్మిళిత అభివృద్ధి జరుగుతున్నదన్నారు.

తెలంగాణలో పరిపాలన సంస్కరణలు దేశంలో ఎక్కడా లేనంత వేగంగా ముందుకు పోతున్నాయని అన్నారు. అన్ని రంగాల్లో తెలంగాణ ప్రస్తుతమైన తనదైన మార్క్ వేయగలిగిందని అన్నారు. తెలంగాణ అచరిస్తుందే.. ఇప్పుడు దేశం అనుసరిస్తుంది అన్నది ఈ రోజు నినాదంగా మారిందన్నారు.

ప్రతిపక్షాలకు పని లేకుండా పోయిందని. ఈ రోజు తెలంగాణకు ప్రాబ్లమ్ అప్ ప్లెంటీ మెదలైంది. ఒకప్పుడు పంటలు పండని చోట నేడు దాన్యం ఎక్కువైన పరిస్ధితి నెలకొందన్నారు. ప్రతి పక్షాలకు పనిలేక తొమ్మిది ఎళ్లుగా అసత్య అరోపణలతో వాగుతున్నారని మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. ఒక్కసారి కూడా హేతుబద్దంగా, రుజువులతో మాట్లాడలేక పోయారని.. దశాబ్దం పూర్తి సందర్భంగా తెలంగాణ ప్రజలకు ఒక విజ్ఞప్తి చేశారు మంత్రి కేటీఆర్.

చేతిలో ఉన్న రూపాయిని పారేసి చిల్లర ఏరుకోవద్దని.. తెలంగాణ కాదని చిల్లర రాజకీయాలు చేసే నాయకులను ప్రజలు పట్టించుకోరన్న విశ్వాసం ఉన్నది. ఇతర రాష్ట్రాల్లో ఉన్న పాలన తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పరిపాలనను బేరీజు వేసుకోవాలని అన్నారు.

ఎలాంటి పరిమితులు లేకుండా పండించిన పూర్తి ధాన్యాన్ని కొంటున్న రాష్ట్రం దేశంలో ఇంకొకటి ఎక్కడైనా ఉన్నదా.. దమ్ముంటే కాంగ్రెస్, బిజెపి జాతీయ నాయకులు తెలంగాణ కన్నా ఉత్తమ పరిపాలన తాము అధికారంలో ఉన్న రాష్ట్రాలో అందిస్తున్నామని చెప్పాలన్నారు. తెలంగాణ కన్నా మంచి మాడల్ చూపించాలని సవాల్ విసిరారు.

ఈ రెండు పార్టీలు 75 సంవత్సరాలు చేయని పనిని, కేవలం 9 సంవత్సరాలు చేసి చూపిస్తున్నామని అన్నారు. ఆ రెండు పార్టీల పరిపాలన కొత్త సీసాలో పాత సారా మాదిరి ఉంటుందన్నారు. కేంద్రమంత్రులు టాయిలెట్స్, రైల్వే స్టేషన్లలోని లిప్ట్ లు ఒపెన్ చేస్తున్నారు. మేము ప్రపంచంలోనే అతిపెద్ద ప్రాజెక్టులు కడుతున్నాం.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం