సేవా గుణం ఉన్న వారిని అభినందించడంలో ఎప్పుడూ ముందుంటారు మెగా స్టార్ చిరంజీవి. తన సేవా మార్గంలో నడిచే వారిని.. ఆ మార్గంలో తనకు సహకరించే వారిని ప్రత్యేకంగా కొనియాడుతుంటారు కూడా..! ఇంటికి పిలుచుకుని మరీ ప్రశంసాపత్రాలు అందజేస్తారు కూడా..! నాలుగు మంచి మాటలు చెప్పి మనలో తెలియని ఆనందాన్ని .. ఉద్వేగాన్ని కలిగిస్తారు కూడా..! ఇక ఇప్పుడు కూడా మరో సారి అదే పని మెగాస్టార్ చిరు. ఇటీవల నిర్వహించిన మెగా రక్త దాన శిభిరంలో మన వాయిస్ గ్లోబల్ మీడియా ఛానెల్ అధినేత యాళ్ల వర ప్రసాద్ గారు చేసిన సేవను ప్రత్యేకంగా కొనియాడారు. రియల్ హీరో మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఆర్గనైజ్ చేసినందుకు యాళ్ల ప్రసాద్‌పై చిరు ప్రశంసల వర్షం కురిపించారు. స్వయంగా ప్రశంసాపత్రాన్ని అందించారు.
డిసెంబర్ 25న చిరంజీవి బ్లడ్ & ఐ బ్యాంక్‌లో ‘రియల్ హీరో బ్లడ్ డొనేషన్ క్యాంప్’ జరిగింది. ఇక దాదాపు 500 మంది ఈ రక్తధాన శిభిరంలో పాల్గొన్నారు. తమ రక్తాన్ని ధానం చేశారు. కొన్ని వేల మందికి ప్రాణం పోసే మహద్భాగ్యాన్ని పొందారు. అయితే ఈ కార్యక్రమాన్ని నిర్వహించడమే కాకుండా.. విజయవంతం చేసినందుకు చిరు యళ్లా వర ప్రసాద్ ను .. ఆయన కుటుంబాన్ని ప్రత్యేకంగా ఇంటికి పిలుచుకుని అభినందించారు. ప్రసంశా పత్రాన్ని అందజేశారు.
మరిన్ని హైదరాబాద్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..