Telangana: ఫ్రీ బస్‎లో మహిళకు టికెట్ జారీ చేసిన కండక్టర్.. విచారణలో వెలుగులోకి వచ్చిన కీలక విషయాలు..

|

Dec 11, 2023 | 7:17 AM

తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఆరు గ్యారెంటీల్లో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఇందులో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన తొలి క్యాబినెట్ సమావేశంలో డిశంబర్ 9 నుంచి మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సేవలు అందుబాటులోకి తెస్తామన్నారు. ఈ క్రమంలో ప్రశాంతంగా సాగుతున్న ఈ పథకంపై కలకలం రేగింది.

Telangana: ఫ్రీ బస్‎లో మహిళకు టికెట్ జారీ చేసిన కండక్టర్.. విచారణలో వెలుగులోకి వచ్చిన కీలక విషయాలు..
Telangnaa Free Bus
Follow us on

తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఆరు గ్యారెంటీల్లో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఇందులో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన తొలి క్యాబినెట్ సమావేశంలో డిశంబర్ 9 నుంచి మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సేవలు అందుబాటులోకి తెస్తామన్నారు. ఈ క్రమంలో ప్రశాంతంగా సాగుతున్న ఈ పథకంపై కలకలం రేగింది. నిజామాబాద్ జిల్లాలోని బోధన్ వైపుగా ప్రయాణిస్తున్న మహిళకు టికెట్ జారీ చేసినట్లు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టింది. దీంతో ఈ విషయం రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది.

నిజామాబాద్ జిల్లా బోధన్‌ డిపో పరిధిలో మహిళలకు టికెట్ జారీ చేసిన ఘటనపై తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్‌ఆర్టీసీ) ఎండీ వీసీ సజ్జనార్ విచారణకు ఆదేశించారు. ఎండీ ఆదేశాలతో.. సంబంధిత కండక్టర్‌ను డిపో స్పేర్‌ లో ఉంచి పూర్తిస్థాయిలో ఆర్టీసీ అధికారులు విచారణ జరిపారు.

నిజామాబాద్‌-బోధన్‌ రూట్‌ పల్లె వెలుగు బస్సులో నిజామాబాద్‌ టౌన్‌ బస్టాండ్‌ వద్ద ఆదివారం ముగ్గురు ఎక్కారు. అందులో ఒక పురుషుడు, ఇద్దరు మహిళలు ఉన్నారు. పురుష ప్రయాణికుడు ముగ్గురికి బోధన్‌ కు టికెట్‌ ఇవ్వమని కండక్టర్‌ ను అడిగారు. రూ.30 చొప్పున ముగ్గురికి రూ.90 టికెట్‌ ను కండక్టర్‌ జారీ చేశారు. నిజామాబాద్ టౌన్ దాటిన తర్వాత పురుష ప్రయాణికుడు కండక్టర్‌ వద్దకు వచ్చి.. మహిళలకు ఉచితం కదా.. టికెట్‌ ఎందుకు జారీ చేశారని ప్రశ్నించారు. ముగ్గురు పురుషులే అనుకుని టికెట్‌ ను జారీ చేశారని, అన్యదా భావించవద్దని కండక్టర్‌ సమాధానం ఇచ్చారు. వెంటనే ఆ టికెట్‌ ను వెనక్కి తీసుకుని పూర్తి డబ్బును తిరిగి ఇవ్వడం జరిగింది. ఈ విచారణలో కండక్టర్‌ ఉద్దేశపూర్వకంగా టికెట్‌ జారీ చేయలేదని తేలింది.

ఇవి కూడా చదవండి

“రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన మహాలక్ష్మి-మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం ప్రశాంతంగా అమలవుతోంది. ఈ సౌకర్యంపై క్షేత్రస్థాయి సిబ్బంది అందరికీ ఇప్పటికే అవగాహన కల్పించడం జరిగింది. క్షేత్ర స్థాయిలో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా స్పష్టమైన ఆదేశాలు జారీ చేశాం. ఈ పథకం సజావుగా అమలు అయ్యేందుకు ప్రజలందరూ సహకరించాలని సంస్థ కోరుతోంది.” అని టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్, అన్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..