Fire Accident: వినాయక సూపర్‌ మార్కెట్‌లో భారీ అగ్నిప్రమాదం.. రూ. కోట్లల్లో ఆస్తినష్టం.. ఎన్నో అనుమానాలు..?

అర్ధరాత్రి ప్రమాదం జరగటంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అంతా ఊపిరి పీల్చుకున్నారు.ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

Fire Accident: వినాయక సూపర్‌ మార్కెట్‌లో భారీ అగ్నిప్రమాదం.. రూ. కోట్లల్లో ఆస్తినష్టం.. ఎన్నో అనుమానాలు..?
representative image

Updated on: Aug 28, 2022 | 11:09 AM

Fire Accident: నిజామాబాద్ నగరంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. నగరంలోని వినాయక నగర్‌ సూపర్‌ మార్కెట్‌లో ప్రమాదవశాత్తూ మంటలు చెలరేగాయి. మంటల్లో కోట్ల రూపాయల ఆస్తి కాలిబూడిదైంది. ఆస్తిపై అధికారులు అంచనా వేస్తున్నారు. అర్ధరాత్రి సమయంలో మంటలు చెలరేగటంతో దట్టమైన పొగలతో కూడిన మంటలు పెద్ద ఎత్తున ఎగిసిపడ్డాయి. మంటలు గమనించిన స్థానికులు వెంటనే ఫైర్‌ సిబ్బందికి సమాచారం అందించారు. హుటాహుటినా ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మంటలను అదుపుచేశారు. అర్ధరాత్రి ప్రమాదం జరగటంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అంతా ఊపిరి పీల్చుకున్నారు.ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

ఈ ప్రమాదానికి షార్ట్ సర్క్యూటే కారణమా? లేక కుట్ర కోణం ఉందా..? అనే దిశగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సూపర్‌ మార్కెట్‌ షేర్‌ హోల్డర్స్‌ మధ్య గొడవలు ఉన్నట్లు వెలుగులోకి రావడంతో అగ్నిప్రమాదంపై అనుమానాలు మరింత బలాన్ని చేకూరుస్తుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి