AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: ప్రేమన్నాడు.. వల వేసి కోరిక తీర్చుకున్నాడు.. ఆపై వెలుగులోకి అసలు ట్విస్ట్

వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు. పెళ్లి కూడా చేసుకున్నారు. బాబు కూడా జన్మించాడు. కొద్ది రోజులుగా భర్త ముఖం చాటేస్తున్నాడు. దీంతో తన నాలుగేళ్ల బాబుతో కలిసి భర్త ఇంటి ఎదుట భార్య ఆందోళన చేస్తోంది. ఈ ఘటన ఎక్కడ జరిగిందో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.

Telangana: ప్రేమన్నాడు.. వల వేసి కోరిక తీర్చుకున్నాడు.. ఆపై వెలుగులోకి అసలు ట్విస్ట్
Representative Image
M Revan Reddy
| Edited By: Ravi Kiran|

Updated on: Dec 01, 2025 | 11:41 AM

Share

నల్గొండ జిల్లా చర్లపల్లికి చెందిన సౌందర్యకు మిర్యాలగూడ మండలం బంగారిగడ్డకు చెందిన సాయిదీప్‌కు పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం కాస్త ప్రేమగా మారి దీంతో ఇద్దరు ప్రేమించుకున్నారు. దళితురాలైన సౌందర్యతో వివాహం సాయిదీప్ కుటుంబ సభ్యులకు ఇష్టం లేదు. అయినా సాయిదీప్ పెళ్లి చేసుకుని మిర్యాలగూడలో బైక్ మెకానిక్‌గా జీవనాన్ని కొనసాగిస్తున్నాడు. వీరికి నాలుగేళ్ల బాబు కూడా ఉన్నాడు. అయితే ఇటీవల సాయిదీప్ వేరే యువతితో ఫోన్‌లో తరచుగా మాట్లాడుతుండటాన్ని సౌందర్య గమనించింది. ఈ విషయమై ఇద్దరి మధ్య గొడవలు ప్రారంభమయ్యాయి. దీంతో కొద్దిరోజుల క్రితం సాయిదీప్ ఇంటి నుంచి వెళ్లిపోయాడు.

భర్త కోసం సౌందర్య ఎదురుచూసినా ఫలితం లేకపోయింది. తన భర్త కనిపించడం లేదంటూ మిర్యాలగూడ పోలీస్ స్టేషన్‌లో సౌందర్య ఫిర్యాదు చేసింది. అయినా ఆచూకీ లేదు. మిర్యాలగూడ పట్టణం బంగారుగడ్డలోని భర్త ఇంటికి కొడుకును తీసుకుని వెళ్ళింది. అయితే సాయిదీప్ కుటుంబ సభ్యులు సౌందర్యను ఇంట్లోకి అనుమతించలేదు. గేటుకు తాళం వేసి వెళ్లిపోయారు. దీంతో తనకు న్యాయం చేయాలంటూ నాలుగేళ్ల కొడుకుతో కలిసి భర్త ఇంటి ఎదుట ఆందోళనకు దిగింది. కొద్దిరోజులుగా తన భర్త కనిపించడం లేదని ఆరా తీస్తే తనను వదిలించుకునేందుకు.. భర్త, అతడి కుటుంబ సభ్యులు ప్రయత్నిస్తున్నారని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది. ప్రేమించి పెళ్లి చేసుకుని మోసం చేసిన భర్త నుంచి న్యాయం చేయాలని పోలీసులు కోరుతోంది. సౌందర్య ఆందోళనకు ప్రజాసంఘాలు కూడా మద్దతు పలికాయి.

బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..