ములుగు జిల్లాలో పట్టుబడ్డ మావోయిస్టు

ములుగు జిల్లాలో మావోయిస్టులు పట్టుబడ్డారు. రివెల్యూషన్‌ పీపుల్స్‌ కమిటీకి చెందిన సభ్యుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సంఘటన సోమవారం జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఆగస్టు 3వ తేదీన..

ములుగు జిల్లాలో పట్టుబడ్డ మావోయిస్టు
Follow us

| Edited By:

Updated on: Aug 05, 2020 | 1:17 AM

ములుగు జిల్లాలో మావోయిస్టులు పట్టుబడ్డారు. రివెల్యూషన్‌ పీపుల్స్‌ కమిటీకి చెందిన సభ్యుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సంఘటన సోమవారం జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఆగస్టు 3వ తేదీన కొట్టపల్లి క్రాస్ రోడ్డు వద్ద సాయంత్రం 4.00 గంటల సమయంలో సీఆర్పీఎఫ్‌ భద్రతా బలగాలతో పాటు.. వెంకటాపురం పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ తనిఖీలు చేపడుతున్నారు. ఈ క్రమంలో పలు వాహనాలను తనిఖీ చేస్తుండగా.. అనుమానాస్పదంగా నడుస్తూ వెళ్తున్న ఓ వ్యక్తిని పోలీసులు గుర్తించారు. అతడు పారిపోయేందుకు ప్రయత్నించగా..పోలీసులు అతడిని పట్టుకుని అరెస్ట్ చేశారు. అనంతరం విచారించగా.. పట్టుబడ్డ వ్యక్తి.. రివెల్యూషన్‌ పీపుల్స్‌ కమిటీకి చెందిన సభ్యుడు సోడి వూరా అలియాస్‌ పురాడుగా నిర్ధారణ అయ్యిందని ములుగు జిల్లా ఎస్పీ తెలిపారు. వూరా 2012లో మావోయిస్టు పార్టీలో చేరినట్లు గుర్తించారు. తొలుత మిలీషియా సభ్యునిగా ఉన్న వురా.. ఆ తర్వాత ఆర్‌పీసీ సభ్యుడిగా, పూజారికంకర్ ఆర్‌పీసీ సభ్యుడిగా ఉన్నాడు.

Read More :

మహారాష్ట్రలో తగ్గిన కేసులు.. పెరిగిన రికవరీలు

కొత్త మ్యాప్ అంటూ మన ప్రదేశాలతో.. పాక్‌ కన్నింగ్ వేషాలు