Telangana Congress: టార్గెట్‌ ఎన్నికలే.. రేవంత్‌ రెడ్డి పాదయాత్రకు గ్రీన్‌ సిగ్నల్‌.. ఎప్పటినుంచంటే..?

తెలంగాణలో ఈ ఏడాది ఎన్నికలు జరుగబోతున్న తరుణంలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు, అధికారంలో తీసుకువచ్చేందుకు ప్రజల దగ్గరకు వెళ్లాలని కాంగ్రెస్‌ పార్టీ నిర్ణయించింది.

Telangana Congress: టార్గెట్‌ ఎన్నికలే.. రేవంత్‌ రెడ్డి పాదయాత్రకు గ్రీన్‌ సిగ్నల్‌.. ఎప్పటినుంచంటే..?
Telangana Congress
Follow us

|

Updated on: Jan 21, 2023 | 6:28 PM

తెలంగాణలో ఈ ఏడాది ఎన్నికలు జరుగబోతున్న తరుణంలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు, అధికారంలో తీసుకువచ్చేందుకు ప్రజల దగ్గరకు వెళ్లాలని కాంగ్రెస్‌ పార్టీ నిర్ణయించింది. రాహుల్‌ జోడో యత్ర ముగుస్తున్న నేపథ్యంలో ఆ యాత్ర సందేశాన్ని ప్రతి ఇంటికీ చేరవేసేలా కార్యక్రమాలు చేపట్టాలని తీర్మానించింది. పార్టీ కొత్త ఇన్‌ఛార్జి మాణిక్‌రావు థాక్రే ఆధ్వర్యంలో పీసీసీ విస్తృత స్థాయి సమావేశంలో కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. ఈ నెల 26వ తేదీన హాత్‌ సే హాత్‌ జోడో అభియాన్‌ యాత్రను లాంఛనంగా ప్రారంభిస్తారు. ఆ రోజు మండలాలు, డివిజన్‌ స్థాయి నుంచి రాష్ట్ర పార్టీ జెండాలు ఎగురవేయాలని నిర్ణయించారు. ఫిబ్రవరి 6వ తేదీ నుంచి రెండు నెలలపాటు పాదయాత్ర చేయాలని నిర్ణయించారు. ఇన్నాళ్లు టీపీసీసీ చీఫ్ రేవంత్‌ రెడ్డి ఒక్కరే పాదయాత్ర చేస్తారని ప్రచారం జరిగినా సీనియర్లు సైతం యాత్రలో పాల్గొనేలా నిర్ణయం తీసుకున్నారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ప్రచార కమిటీ చైర్మన్, ప్రాంతాల వారీగా సీనియర్‌ నేతలు కూడా పాదయాత్రలు చేయాలని తీర్మానించారు. ప్రారంభ కార్యక్రమానికి సోనియా గాంధీ లేదంటే ప్రియాంక రావాలని ఆహ్వానిస్తూ తీర్మానం చేశారు.

టీపీసీసీ విస్తృత స్థాయి సమావేశంలో నేతల తీరుపైనా హాట్‌హాట్‌ చర్చ జరిగింది. పార్టీకి నష్టం చేసేలా ఎవరూ మీడియా ముందు మాట్లాడొద్దని నేతలకు తేల్చిచెప్పారు ఇన్‌ఛార్జి మాణిక్‌రావు థాక్రే. సమస్యలు ఉంటే తనతో చెప్పాలన్నారు. పార్టీకి నష్టం చేస్తే చర్యలు తప్పవని థాక్రే హెచ్చరించినట్లు రేవంత్‌ రెడ్డి వెల్లడించారు. కాగా, కాంగ్రెస్ లో నెలకొన్న సమస్యలపై ఠాక్రే దిద్దుబాటు చర్యలు చేపట్టిన విషయం తెలిసిందే. ఇప్పటికే పలువురు నాయకులతో భేటీ అయిన థాక్రే.. టీపీసీసీ విస్తృత స్థాయి సమావేశంలో నాయకులకు పలు సూచనలిచ్చారు. నాయకుల్లో సమన్వయం ఉండాలని.. హద్దు దాట వద్దంటూ సూచనలు యేశారు.

కొండా సురేఖ ఫైర్..

మీటింగ్‌లో కొండా సురేఖ కామెంట్ల ఆసక్తిగా మారాయి. పార్టీకి నష్టం చేసే వారిని సస్పెండ్‌ చేయాల్సిందేనని పట్టుబట్టారామె. వ్యక్తిగత అంశాలను ఈ మీటింగ్‌లో చర్చించొద్దని సూచించారు రేవంత్‌రెడ్డి. బయటకొచ్చాక కూడా కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిపై చర్యలు తీసుకోవాల్సిందేనని డిమాండ్‌ చేశారు కొండా సురేఖ.

ఇవి కూడా చదవండి

మొత్తానికి రేవంత్‌ ఒక్కరే పాదయాత్ర చేయాలని కొంతమంది పట్టుబట్టినా అధిష్టానం మాత్రం అందరూ యాత్రలో పాల్గొనే విధంగా ప్లాన్‌ చేయడం కాంగ్రెస్‌లో ఆసక్తిగా మారింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..

కేసీఆర్‌తో టచ్‌లో ఉన్న సీనియర్‌ ఎవరు ??
కేసీఆర్‌తో టచ్‌లో ఉన్న సీనియర్‌ ఎవరు ??
రుణమాఫీ ఎప్పుడో చెప్పిన రేవంత్ రెడ్డి
రుణమాఫీ ఎప్పుడో చెప్పిన రేవంత్ రెడ్డి
ఆ పరిస్థితి వస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా: దానం నాగేందర్
ఆ పరిస్థితి వస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా: దానం నాగేందర్
మధ్యప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్‎పై ప్రధాని మోదీ చురకలు..
మధ్యప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్‎పై ప్రధాని మోదీ చురకలు..
కుర్ర హీరోల మధ్య క్రేజీ వార్.. నితిన్, నాగచైతన్య మధ్య పోరు  
కుర్ర హీరోల మధ్య క్రేజీ వార్.. నితిన్, నాగచైతన్య మధ్య పోరు  
Watch Video: అసదుద్దీన్ - మాధవీ లత మధ్య డైలాగ్ వార్..
Watch Video: అసదుద్దీన్ - మాధవీ లత మధ్య డైలాగ్ వార్..
గేమింగ్ కంపెనీల్లో లేఆఫ్స్ క‌ల‌క‌లం.. 600 మంది ఉద్యోగుల‌పై వేటు.!
గేమింగ్ కంపెనీల్లో లేఆఫ్స్ క‌ల‌క‌లం.. 600 మంది ఉద్యోగుల‌పై వేటు.!
టపాసుల పెట్టెను నెత్తిమీద పెట్టుకొని డాన్స్‌.. ఆ తర్వాత.? వీడియో.
టపాసుల పెట్టెను నెత్తిమీద పెట్టుకొని డాన్స్‌.. ఆ తర్వాత.? వీడియో.
జిమ్ ట్రైనర్‏ను మోసం చేస్తున్న హీరోయిన్ మృణాల్ ఠాకూర్.! వీడియో.
జిమ్ ట్రైనర్‏ను మోసం చేస్తున్న హీరోయిన్ మృణాల్ ఠాకూర్.! వీడియో.
యోధగా దిమ్మతిరిగేలా చేస్తున్న తేజా సజ్జా.! ఈసారి మరింత అడ్వాన్స్
యోధగా దిమ్మతిరిగేలా చేస్తున్న తేజా సజ్జా.! ఈసారి మరింత అడ్వాన్స్