AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: ఇంటికి తెచ్చుకుని మటన్ బిర్యానీ లాగిద్దామనుకున్నాడు.. తీరా పార్శిల్ ఓపెన్ చేయగానే

బిర్యానీలో బొద్దింకను చూసి షాక్ అయ్యారు కస్టమర్లు. ఓ కస్టమర్ ఇష్టంగా మటన్ బిర్యానీ కొన్నాడు. తీరా ఇంటికి వెళ్లి అది తినదామని చూసేసరికి దెబ్బకు కంగుతిన్నాడు. అందులో ఉన్నది చూసి.. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. ఓ సారి స్టోరీ చూసేయండి.

Telangana: ఇంటికి తెచ్చుకుని మటన్ బిర్యానీ లాగిద్దామనుకున్నాడు.. తీరా పార్శిల్ ఓపెన్ చేయగానే
Biryani
Noor Mohammed Shaik
| Edited By: Ravi Kiran|

Updated on: Nov 06, 2025 | 12:39 PM

Share

మేడిపండు చూడు మేలిమై ఉండు పొట్ట విప్పి చూడు పురుగులుండు అన్న సామెత గుర్తుందా.! సరిగ్గా ఇప్పుడు జరిగిన సంఘటన కూడా అలాంటిదే. వివరాల్లోకి వెళ్తే.. సంతోష్ నగర్ ఐఎస్ సదన్‌లోని లక్కి హోటల్ పరిస్థితి ఇది. పట్టణంలో అడుగడుగునా హోటళ్లు వెలుస్తున్నాయి. వీటిలో కొన్ని వినియోగదారుల కళ్ళను మోసం చేసేలా పైపై మెరుగులు దిద్ది నాణ్యతను మాత్రం గాలికి వదిలేస్తున్నారు. వేల రూపాయల బిల్లులు చేసి రోగాలు కొనితెచ్చుకుంటున్నారు ప్రజలు.

బుధవారం సంతోష్ నగర్ ఐఎస్ సదన్‌లో ఓ వ్యక్తి లక్కి అనే హోటల్‌లో మటన్ బిర్యాని ఆర్డర్ చేసి తినడం మొదలు పెట్టాడు. మటన్ బిర్యానీలో బొద్దింక గమనించాడు. మటన్ ముక్కకు బొద్దింక బయటకి వచ్చింది. ఇది గమనించిన వినియోగదారుడు ఒకసారిగా షాక్‌కు గురైయ్యాడు. వేలకు వేలు డబ్బులు తగలేసి నాణ్యత పాటించని హోటల్‌లో తిని ప్రజల ఆరోగ్యాలు నాశనం చేసుకుంటున్నారు. ఫుడ్ సేఫ్టీ అధికారులు ఇలాంటి హోటళ్లపై ఫిర్యాదులు అందినప్పుడే కాకుండా.. తరచూ దాడులు నిర్వహించి నాణ్యత ప్రమాణాలను పాటించని హోటళ్లపై చర్యలు తీసుకోవాలని పట్టణ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.