Hyderabad: హైదరాబాద్‌లో దారుణం.. అన్నం వండలేదని రూమ్ మేట్‌ను కొట్టి చంపిన స్నేహితులు
రోజురోజుకూ మానవ సంబంధాలు మంటగలుస్తున్నాయి. చిన్న చిన్న విషయాలపై గొడవలు పడుతూ ప్రాణాలు తీస్తున్నారు. క్షణికా ఆవేశమో, ఇతర కారణాలో తెలియదు కానీ.. ఈ తరం మనుషుల్లో మానవత్వం మచ్చుకైనా కనిపించడం లేదు. ఫలితంగా కొన్ని జీవితాలు మధ్యలో ముగిసిపోతున్నాయి.

రోజురోజుకూ మానవ సంబంధాలు మంటగలుస్తున్నాయి. చిన్న చిన్న విషయాలపై గొడవలు పడుతూ ప్రాణాలు తీస్తున్నారు. క్షణికా ఆవేశమో, ఇతర కారణాలో తెలియదు కానీ.. ఈ తరం మనుషుల్లో మానవత్వం మచ్చుకైనా కనిపించడం లేదు. ఫలితంగా కొన్ని జీవితాలు మధ్యలో ముగిసిపోతున్నాయి. ఓ వ్యక్తి సమయానికి అన్నం వండలేదని స్నేహితులు చంపిన ఘటన హైదరాబాద్ లో వెలుగుచూసింది. చిన్న సమస్యకే ఓ వ్యక్తిని చంపిన ఘటన పలువురిని షాక్ కు గురిచేసింది.
హైదరాబాద్ జీడీమెట్లలో అన్నం వండలేదని 38 ఏళ్ల వ్యక్తిని అతని స్నేహితులు కొట్టి చంపారు. మృతుడిని రాజస్థాన్ కు చెందిన హన్స్ రామ్ గా గుర్తించారు. గతంలో కుత్బుల్లాపూర్ లో అద్దె ఇంట్లో ఉండేవాడు. నిత్యం మద్యానికి బానిసై భార్యను నిత్యం వేధించేవాడు. ఇక ఆ బాధను భరించలేక ఆమె తన తల్లిగారింటికి వెళ్లడంతో హన్స్ రామ్ ఇల్లు ఖాళీ చేసి తెలిసిన స్నేహితుడు బినయ్ సింగ్ ఇంట్లో ఉంటున్నాడు. స్థానిక గ్రానైట్ వ్యాపారి వద్ద పనిచేస్తున్న బినయ్ సింగ్ తనతో పాటు జీడిమెట్లలో ఉండమని చెప్పడంతో కొద్ది రోజులుగా కలిసి ఉంటున్నారు.
మంగళవారం పని ముగించుకుని తిరిగి వచ్చిన స్నేహితులు అన్నం వండలేదని బినయ్ సింగ్ పై దాడి చేశారు. అంతేకాదు.. హన్స్ రామ్ ను కొట్టడంతో అక్కడికక్కడే మరణించాడు. నిందితులు బీహార్ కు చెందిన సోనూ తివారీ, ఉత్తరప్రదేశ్ కు చెందిన సందీప్ కుమార్ అతని సహోద్యోగులుగా గుర్తించారు. ఈ ఘటనతో నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు. ఈ ఘటన తర్వాత బినయ్ సింగ్ తన యజమానికి సమాచారం అందించడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.



