AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

MGNREGS: ఉపాధి హామీ పథకంలో కొత్త కండీషన్.. ఇకపై కూలీలకు డబ్బులు రావాలంటే..

ఉపాధి హామీ పథకంలో అక్రమాలకు చెక్ పెట్టేందుకు కేంద్రం సరికొత్త విధానాన్ని తీసుకొచ్చింది. గతంలో పలు చోట్ల ఈ పథకంలో అవకతవకలు జరిగినట్లు పెద్ద ఎత్తున ఆరోపణలు ఉన్నాయి. కూలీలు పనికి రాకున్నా వచ్చినట్లు వేసి డబ్బులు తీసుకున్న ఉదంతాలు వెలుగులోకి వచ్చాయి. ఈ క్రమంలోనే వాటికి చెక్ పెడుతూ కొత్త విధానాన్ని అమల్లోకి తెచ్చింది.

MGNREGS: ఉపాధి హామీ పథకంలో కొత్త కండీషన్.. ఇకపై కూలీలకు డబ్బులు రావాలంటే..
MGNREGA workers
Krishna S
|

Updated on: Jul 18, 2025 | 6:01 PM

Share

ఉపాధి హామీ పథకం.. ఎంతో మంది నిరుపేద గ్రామస్థులకు ఈ పథకం ఒక వరం. గ్రామాల్లో సరిగ్గా పని లేనివారిక ఇదొక జీవనాధారంగా మారింది. కానీ పలుచోట్ల ఈ పథకంలో అక్రమాలు చోటుచేసుకోవడం గమనార్హం. కొన్ని చోట్ల ఫీల్డ్ అసిస్టెంట్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ శ్రామికుల పైసలు దోచుకున్న ఘటనలు ఎన్నో ఉన్నాయి. మరికొంతమంది ఫీల్డ్ అసిస్టెంట్లతో మంచి ఉంటూ పనికి రాకున్నా వచ్చినట్లు అటెండెన్స్ వేయించకుంటారు. ఈ అక్రమాలపై కేంద్రం ఫోకస్ పెట్టింది. క్షేత్రస్థాయి అవకతవకలు జరగకుండా కొత్త విధానాన్ని తీసుకొచ్చింది. ఇకపై పనిచేసే చోట కూలీలను రెండుసార్లు ఫొటో తీసి ఆన్‌లైన్‌లో పొందుపరచాలని ఆదేశించింది. దీనికి సంబంధించి ఉత్తర్వులను జారీ చేసింది.

గత సోమవారం నుంచే ఈ విధానం అమల్లోకి వచ్చింది. నేషనల్ మోబైల్ మానిటరింగ్ సిస్టమ్ యాప్‌లో కార్మికుల ఫొటోలను అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ ఫొటో ఉదయం 9గంటలకు తీసి అప్ లోడ్ చేయాలి. తర్వాతి ఫొటో సాయంత్రం 4గంటలకు తర్వాత తీయాల్సి ఉంటుంది. ఫీల్డ్ అసిస్టెంట్లు తీసే ఈ ఫొటోలను పంచాయతీ సెక్రెటరీలు నిరంతరం పర్యవేక్షించి ఎంపీడీవోకు నివేదిక ఇవ్వాలని కేంద్రం ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. అంతేకాకుండా మండల స్థాయి అధికారులు ఎన్ని ఫొటోలు సరిగ్గా తీశారు, ఎన్ని తియ్యలేదని అనేవి చెక్ చేయాలి. అన్నీ గ్రామాల నుంచి వచ్చిన వాటిలో 20శాతం వివరాలను జిల్లా అధికారులకు పంపించాలి. జిల్లా ఆఫీసులో ప్రతి ఫొటోను జాగ్రత్తగా స్టోర్ చేయాలని కేంద్రం తెలిపింది. గ్రామ స్థాయి నుంచి వచ్చిన ఫొటోలు సరిగ్గానే ఉన్నాయా..? లేదా ఇతర ఫొటోలు అప్ లోడ్ చేశారా.? అటెండెన్స్‌లో ఏమైన వ్యతాసాలు ఉన్నాయా అనే విషయాలను అధికారులు క్షున్నంగా తనిఖీ చేయాల్సి ఉంటుంది.

ఈ పథకాన్ని పక్కాగా అమలు చేసేందుకు గ్రామ స్థాయిలో విజిలెన్స్ కమిటీలను ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది. ఎప్పటికప్పుడు రివ్యూలు జరిపి.. అవకతవకలకు పాల్పడేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.. 

ఉచితంగా మీ మొబైల్‌లోనే క్రెడిట్ స్కోర్ చూసుకోండిలా..
ఉచితంగా మీ మొబైల్‌లోనే క్రెడిట్ స్కోర్ చూసుకోండిలా..
రోలెక్స్ వాచ్‌పై కొత్త పంచాయితీ!
రోలెక్స్ వాచ్‌పై కొత్త పంచాయితీ!
విశాఖలో చరిత్ర సృష్టించేందుకు కోహ్లీ రెడీ.. ఏకంగా 'హ్యాట్రిక్'తో
విశాఖలో చరిత్ర సృష్టించేందుకు కోహ్లీ రెడీ.. ఏకంగా 'హ్యాట్రిక్'తో
అప్పట్లో యూత్ ఫేవరేట్.. ఒక్క తప్పుతో కెరీర్ నాశనం..
అప్పట్లో యూత్ ఫేవరేట్.. ఒక్క తప్పుతో కెరీర్ నాశనం..
ఒకే ఓవర్‌లో 33 పరుగులు.. వేలానికి ముందే కన్నేసిన కావ్య మారన్
ఒకే ఓవర్‌లో 33 పరుగులు.. వేలానికి ముందే కన్నేసిన కావ్య మారన్
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
పెళ్లిలో రసగుల్ల పంచాయితీ.. పొట్టుపొట్టుగా కొట్టుకున్న అతిథులు!
పెళ్లిలో రసగుల్ల పంచాయితీ.. పొట్టుపొట్టుగా కొట్టుకున్న అతిథులు!
పశువులను మేపుతుండగా ఒక్కసారిగా దూసుకొచ్చిన పెద్దపులి.. కట్‌చేస్తే
పశువులను మేపుతుండగా ఒక్కసారిగా దూసుకొచ్చిన పెద్దపులి.. కట్‌చేస్తే
రూ.20 వేల కంటే ఎక్కువ ట్రాన్సక్షన్లు చేసేవారికి అలర్ట్
రూ.20 వేల కంటే ఎక్కువ ట్రాన్సక్షన్లు చేసేవారికి అలర్ట్
ఎంత పని చేశావ్ తల్లో.. భర్తపై కోపంతో ఆ భార్య ఏం చేసిందంటే..
ఎంత పని చేశావ్ తల్లో.. భర్తపై కోపంతో ఆ భార్య ఏం చేసిందంటే..
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
వైభవ్ సూర్యవంశీ బీభత్సం.! 7 ఫోర్లు, 7 సిక్సర్లతో సెంచరీ
వైభవ్ సూర్యవంశీ బీభత్సం.! 7 ఫోర్లు, 7 సిక్సర్లతో సెంచరీ
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్‌ తెరవగానే
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్‌ తెరవగానే