AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వామ్మో..! నేలరాలుతున్న వందలాది గబ్బిలాలు.. భయంతో వణికిపోతున్న జనం..!

తెలుగు రాష్ట్రాలతో పాటు పొరుగున ఉన్న మహారాష్ట్ర సరిహద్దు జిల్లాల్లో భానుడు భగభగమంటున్నాడు. రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు జీవకోటిని అతలాకుతలం చేస్తున్నాయి. అడవులు ఎండిపోవడం, నీటి వనరులు అడుగంటడంతో వన్యప్రాణులు, పక్షులు విలవిలాడుతున్నాయి. తాజాగా మహారాష్ట్ర, తెలంగాణ సరిహద్దుల్లో వందలాది గబ్బిలాలు, పక్షులు ప్రాణాలు కోల్పోవడం స్థానికంగా తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.

వామ్మో..! నేలరాలుతున్న వందలాది గబ్బిలాలు.. భయంతో వణికిపోతున్న జనం..!
Sirvancha Forest
Naresh Gollana
| Edited By: |

Updated on: May 29, 2026 | 1:16 PM

Share

తెలుగు రాష్ట్రాలతో పాటు పొరుగున ఉన్న మహారాష్ట్ర సరిహద్దు జిల్లాల్లో భానుడు భగభగమంటున్నాడు. రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు జీవకోటిని అతలాకుతలం చేస్తున్నాయి. అడవులు ఎండిపోవడం, నీటి వనరులు అడుగంటడంతో వన్యప్రాణులు, పక్షులు విలవిలాడుతున్నాయి. తాజాగా మహారాష్ట్ర, తెలంగాణ సరిహద్దుల్లో వందలాది గబ్బిలాలు, పక్షులు ప్రాణాలు కోల్పోవడం స్థానికంగా తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.

మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా సిర్వంచ అటవీ ప్రాంతాన్ని ఆనుకుని ఉన్న గ్రామాల్లో గబ్బిలాల చావులు కలకలం రేపుతున్నాయి. ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా వందల సంఖ్యలో గబ్బిలాలు కుప్పలు తెప్పలుగా నేలకొరుగుతున్నాయి. కోర్టు ప్రాంగణం, అటవీశాఖ విశ్రాంతి భవనం ఆవరణలోని చింతచెట్లపై నివాసం ఉండే సుమారు 400కు పైగా గబ్బిలాలు మృత్యువాత పడ్డాయి. గోదావరి, ప్రాణహిత తీర ప్రాంతాల్లో పగటి ఉష్ణోగ్రతలు 46 డిగ్రీలు దాటడం, దానికి తోడు తీవ్రమైన వడగాలులు వీచడంతోనే ఈ మూగజీవాలు ప్రాణాలు విడిచినట్లు అటవీశాఖ అధికారులు, నిపుణులు నిర్ధారించారు. ఎండ తీవ్రతకు అడవిలో నీరు లభించకపోవడం కూడా ఇందుకు ప్రధాన కారణం. చనిపోయిన గబ్బిలాల వల్ల ఆయా ప్రాంతాల్లో తీవ్ర దుర్వాసన వస్తుండటంతో జనం ఏదైనా కొత్త వైరస్ ప్రబలుతుందేమోనన్న భయాందోళనలో ఉన్నారు.

మరోవైపు తెలంగాణలోని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనూ ఎండల ప్రభావం పక్షులపై తీవ్రంగా ఉంది. చెరువులు, కుంటలు ఎండిపోవడంతో పక్షులు దాహంతో అల్లాడిపోతున్నాయి. ఇటీవల ఆదిలాబాద్ మున్సిపల్ కార్యాలయంపై ఒక కాకి దాహంతో పైపు వద్ద నీటి కోసం తపించడం, మరో పక్షి ఎండ వేడికి సొమ్మసిల్లి చనిపోవడం అక్కడి తీవ్రతకు అద్దం పడుతోంది.

ప్రస్తుత పరిస్థితుల్లో పశుపక్షాదులను కాపాడుకోవాల్సిన బాధ్యత మానవాళిపై ఉంది. ప్రతి ఒక్కరూ మానవతా దృక్పథంతో తమ ఇంటి డాబాలపై, కిటికీల వద్ద, ఆవరణల్లో చిన్న చిన్న మట్టి పాత్రల్లో నీటిని, కాస్త ధాన్యపు గింజలను ఉంచితే ఈ మూగజీవుల దాహం తీరి, ప్రాణాలు నిలబడతాయి. ప్రకృతి సమతుల్యతను కాపాడే పక్షులను రక్షించుకోవడానికి మన వంతు ప్రయత్నం చేద్దాం.

మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
ఏసీ ఎక్కువగా వాడుతున్నారా..? ఈ తప్పులు చేస్తే ప్రమాదం..
ఏసీ ఎక్కువగా వాడుతున్నారా..? ఈ తప్పులు చేస్తే ప్రమాదం..
జ్యేష్ఠ పౌర్ణమి నాడు ఈ ఒక్క పని చేస్తే లక్ష్మీ కటాక్షం.. ఇంట్లో ధ
జ్యేష్ఠ పౌర్ణమి నాడు ఈ ఒక్క పని చేస్తే లక్ష్మీ కటాక్షం.. ఇంట్లో ధ
మిగిలిపోయిన అన్నంతో సూపర్ టేస్టీ ఫ్రైడ్ రైస్.. ఇలా చేసేయండి
మిగిలిపోయిన అన్నంతో సూపర్ టేస్టీ ఫ్రైడ్ రైస్.. ఇలా చేసేయండి
అరణ్యంలో పక్షుల మృత్యుఘోష.. భయాందోళనల్లో జనం!
అరణ్యంలో పక్షుల మృత్యుఘోష.. భయాందోళనల్లో జనం!
వరల్డ్ ఫేమస్ చికెన్ 65.. రెస్టారెంట్ స్టైల్‌లో ఇలా చేసుకోండి..
వరల్డ్ ఫేమస్ చికెన్ 65.. రెస్టారెంట్ స్టైల్‌లో ఇలా చేసుకోండి..
మరో నందమూరి హీరో వచ్చేస్తున్నాడు! కల్యాణ్ రామ్ కుమారుడిని చూశారా?
మరో నందమూరి హీరో వచ్చేస్తున్నాడు! కల్యాణ్ రామ్ కుమారుడిని చూశారా?
కూతురు ఉన్నా లేనట్టే.. చివరి రోజుల్లో ఒంటరిగా..
కూతురు ఉన్నా లేనట్టే.. చివరి రోజుల్లో ఒంటరిగా..
తులా రాశిలో చంద్రుడు.. ఆ రాశుల వారికి ఆరోగ్యం, సంపద ఖాయం..!
తులా రాశిలో చంద్రుడు.. ఆ రాశుల వారికి ఆరోగ్యం, సంపద ఖాయం..!
పాలు కొనేటప్పుడు జాగ్రత్త.. ఇలా టెస్ట్ చేస్తే అసలునిజం బయటపడుద్ది
పాలు కొనేటప్పుడు జాగ్రత్త.. ఇలా టెస్ట్ చేస్తే అసలునిజం బయటపడుద్ది
ముంబై ఇండియన్స్‌లో విస్ఫోటనం.. రోహిత్ శర్మ చేతుల్లోకి కీలక పవర్..
ముంబై ఇండియన్స్‌లో విస్ఫోటనం.. రోహిత్ శర్మ చేతుల్లోకి కీలక పవర్..