AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Maha Shivaratri: TSRTC కీలక నిర్ణయం.. మహా శివరాత్రికి 2427 ప్రత్యేక బస్సులు.. పూర్తి వివరాలివే..

ఈ నెల 18న మహా శివరాత్రిని పురస్కరించుకుని భక్తుల సౌకర్యార్థం 2427 ప్రత్యేక బస్సులను నడపాలని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్టీసీ) నిర్ణయించింది.

Maha Shivaratri: TSRTC కీలక నిర్ణయం.. మహా శివరాత్రికి 2427 ప్రత్యేక బస్సులు.. పూర్తి వివరాలివే..
TSRTC
Shaik Madar Saheb
|

Updated on: Feb 13, 2023 | 6:16 PM

Share

మహా శివరాత్రి సందర్భంగా తెలంగాణ ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 18న మహా శివరాత్రిని పురస్కరించుకుని భక్తుల సౌకర్యార్థం 2427 ప్రత్యేక బస్సులను నడపాలని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్టీసీ) నిర్ణయించింది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి 40 శైవక్షేత్రాలకు ఈ నెల 17 నుంచి 19 వరకు మూడు రోజుల పాటు ఈ ప్రత్యేక సర్వీసులను నడపనుంది. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీశైలానికి 578, వేములవాడకు 481, కీసరగుట్టకు 239, ఏడుపాయలకు 497, వేలాలకు 108, కాళేశ్వరానికి 51, కొమురవెల్లికి 52, కొండగట్టుకు 37, అలంపూర్‌కు 16, రామప్పకు 15, ఉమా మహేశ్వరానికి 14 ప్రత్యేక బస్సులను నడపనుంది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా.. రద్దీకి అనుగుణంగా మరిన్ని సర్వీస్‌లను నడిపేలా టీఎస్‌ఆర్టీసీ ఏర్పాట్లు చేసింది.

శ్రీశైలం పుణ్యక్షేత్రానికి హైదరాబాద్‌లోని ఎంజీబీఎస్‌, జేబీఎస్‌, దిల్‌సుఖ్‌నగర్‌, ఐఎస్‌ సదన్‌, కేపీహెచ్‌బీ, బీహెచ్‌ఈఎల్‌ నుంచి పత్యేక బస్సులు భక్తులకు అందుబాటులో ఉంటాయి. ఈ బస్సు సర్వీస్‌లకు ముందస్తు రిజర్వేషన్‌ సౌకర్యాన్ని టీఎస్‌ఆర్టీసీ కల్పించింది. ఈ మేరకు టీఎస్ ఆర్టీసీ ప్రకటనను విడుదల చేసింది.

“మహారాత్రి శివరాత్రి సందర్భంగా భక్తులకు ఇబ్బందులు కలగకుండా టీఎస్‌ఆర్టీసీ యాజమాన్యం అన్ని చర్యలు తీసుకుంటోంది. రాష్ట్రంలోని 40 ప్రముఖ శైవాలయాలకు ప్రత్యేక బస్సులను నడపాలని నిర్ణయించాం. రద్దీకి అనుగుణంగా మరిన్ని పత్యేక బస్సులను ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశాం. భక్తులు ఈ ప్రత్యేక సర్వీస్‌లను ఉపయోగించుకుని క్షేమంగా శైవాలయాలకు చేరుకొని.. మొక్కులు చెల్లించుకోవాలి.” అని టీఎస్‌ఆర్టీసీ చైర్మన్‌, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్‌, సంస్థ ఎండీ వీసీ సజ్జనర్‌ కోరారు.

ఇవి కూడా చదవండి

కాగా.. అద్దె బస్సులపై 10 శాతం రాయితీని టీఎస్ఆర్టీసీ కల్పిస్తోందని వారు ఈ సందర్భంగా గుర్తు చేశారు. మహాశివరాత్రికి ఈ అద్దె బస్సు సౌకర్యాన్ని భక్తులు ఉపయోగించుకోవాలని సూచించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..