Karimnagar Politics: కరీంనగర్ ఎంపీ బరిలో శ్రీధర్ బాబు తమ్ముడు.. అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇస్తే పోటీకి సై..!
పార్లమెంటు ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో అశావాయుల్లో ఆశలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా కరీంనగర్ లోక్ సభ స్థానానికి కాంగ్రెస్ పార్టీలో రోజు.. రోజుకు పోటీ పెరుగుతుంది. అయితే, అభ్యర్థి విషయంలో ఇంకా అధిష్టానం క్లారిటీ ఇవ్వలేదు. దీంతో ఆశావాహుల సంఖ్య పెరుగుతుంది.

పార్లమెంటు ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో అశావాయుల్లో ఆశలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా కరీంనగర్ లోక్ సభ స్థానానికి కాంగ్రెస్ పార్టీలో రోజు.. రోజుకు పోటీ పెరుగుతుంది. అయితే, అభ్యర్థి విషయంలో ఇంకా అధిష్టానం క్లారిటీ ఇవ్వలేదు. దీంతో ఆశావాహుల సంఖ్య పెరుగుతుంది. తాజాగా రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు తమ్ముడు శ్రీను బాబు పేరు కూడా వినపడుతోంది. ఆయన పోటీ చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. శ్రీధర్ బాబు చరిష్మాతో పాటు, కొత్త వ్యక్తిని రంగంలోకి దింపుతే, ఫలితం తమకు అనుకూలంగా ఉంటుందని కాంగ్రెస్ భావిస్తోందట. ఇక్కడి నుంచీ పోటీ చేయడానికి శ్రీనుబాబు పావులు కదుపుతున్నారట.
కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో ఎన్నికల హడావిడి మొదలైంది.. భారతీయ జనతా పార్టీ నుంచి సిట్టింగ్ ఎంపీ బండి సంజయ్ కుమార్, బీఆర్ఎస్ నుంచి వినోద్ కుమార్ పోటీ చేయాలని భావిస్తున్నారు. అయితే, కాంగ్రెస్ పార్టీ ఇంకా తమ అభ్యర్థి విషయంలో ఫైనల్ కాలేదు. గత ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేసిన పొన్నం ప్రభాకర్, ఈసారి హుస్నాబాద్ ఎమ్మెల్యేగా గెలిచి, మంత్రి బాధ్యతలు చేపట్టారు.. దీంతో ఇక్కడ కొత్త వ్యక్తిని బరిలోకి దింపేందుకు కాంగ్రెస్ ఆలోచిస్తోంది. ఇప్పటికే, రెండు మూడు పేర్లు తెరపైకి వచ్చాయి. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్ రెడ్డి, జగపతి రావు తనయుడు రాజేందర్ రావు పేర్లు వినబడుతున్నాయి.
తాజాగా మంత్రి శ్రీధర్ బాబు తమ్ముడు శ్రీను బాబు పేరు తెరపైకి వచ్చింది. అయితే, శ్రీధర్ బాబుకు కరీంనగర్ పార్లమెంట్‌లో మంచి పట్టుంది. ఈ నియోజకవర్గంలో… 7 పార్లమెంట్ స్థానాల్లో నాలుగు చోట్ల కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించారు. దీంతో కొద్దిగా కష్టపడుతే, విజయం సాధించవచ్చని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారట. దీంతో శ్రీధర్ బాబు తమ్ముడు శ్రీను బాబు పేరును కూడా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో మంథనిలో శ్రీధర్ బాబు విజయం సాధించేందుకు.. శ్రీను బాబు పాత్ర కీలకమైనది. పూర్తిగా ఎన్నికల వ్యవహారాలను చూసుకున్నారు. శ్రీధర్ బాబు విజయంలో కూడా కీలక పాత్ర పోషించారు. ఈ నేపథ్యంలో అవకాశం ఇస్తే, కరీంనగర్ ఎంపీగా పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నారట. అయితే, ఫిబ్రవరి రెండవ వారంలో కాంగ్రెస్ అభ్యర్థి ఎవరన్న దానిపై క్లారిటీ రానుంది. శ్రీను బాబును రంగంలోకి దింపేందుకు శ్రీధర్ బాబు కూడా సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది.
కరీంనగర్ ఎంపీ స్థానంపై కాంగ్రెస్ ఇప్పటికే ఫోకస్ పెట్టింది. ఈ ఎంపీ స్థానం ఇంచార్జీ మంత్రి పొన్నం ప్రభాకర్ బాధ్యతలను అప్పజెప్పింది కాంగ్రెస్. గెలుపు గుర్రాలపై అన్వేషణ మొదలు పెట్టారు. దీంతో ముఖ్య నేతల పేర్లను పరిశీలిస్తున్నారు. శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ కూడా.. ఈ నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఇక్కడ బీజేపీ, బీఆర్ఎస్‌ను ఎదుర్కోవాలంటే.. బలమైన నేత కావాలి. ఈ క్రమంలో పలువురు నేతల పేర్లను పరిశీలిస్తున్నారు. అయితే, అధిష్టానం నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నారు. పోటీ విషయంలో బయటకు ప్రకటించకున్నా, అంతర్గతంగా కాంగ్రెస్‌లో చర్చ సాగుతుంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…
