Watch Video: కదులుతున్న రైలును ప్రమాదకరంగా ఎక్కేందుకు యత్నించిన యువతి.. కానిస్టేబుల్ సమయానికి రాకపోతే ?

|

May 31, 2023 | 6:45 PM

ఇటీవల రైల్వే స్టేషన్లలో తరచుగా ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. కదులుతున్న రైలు ఎక్కేటప్పుడు లేదా దిగేటప్పుడు ప్రయాణికులు అదుపుతప్పి పడిపోవడం, లేదా ప్లాట్‌ఫాం పై నుంచి పట్టాలపై పడిపోవడం లాంటి ఘటనలు ఎన్నో రైల్వే్ స్టేషన్లలో చోటుచేసుకున్నాయి.

Watch Video: కదులుతున్న రైలును ప్రమాదకరంగా ఎక్కేందుకు యత్నించిన యువతి.. కానిస్టేబుల్ సమయానికి రాకపోతే ?
Train
Follow us on

ఇటీవల రైల్వే స్టేషన్లలో తరచుగా ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. కదులుతున్న రైలు ఎక్కేటప్పుడు లేదా దిగేటప్పుడు ప్రయాణికులు అదుపుతప్పి పడిపోవడం, లేదా ప్లాట్‌ఫాం పై నుంచి పట్టాలపై పడిపోవడం లాంటి ఘటనలు ఎన్నో రైల్వే్ స్టేషన్లలో చోటుచేసుకున్నాయి. ఇలాంటి ప్రమాదకర పరిస్థితులు వచ్చినప్పుడు ఆ రైల్వే స్టేషన్లలో పనిచేసే పోలీసులు ప్రయాణికుల్ని రక్షించిన సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి. అయితే ఇప్పుడు తాజాగా హైదరాబాద్‌లోని బేగంపేట్ రైల్వే స్టేషన్‌లో ఇలాంటి ఘటనే జరిగింది. కదులుతున్న రైలును ఎక్కేందుకు ప్రయత్నించిన ఓ యువతిని రైలు కింద పడిపోకుండా రక్షించిన ఓ కానిస్టేబుల్ అందరి చేత ప్రశంసలు అందుకుంటుంది.

వివరాల్లోకి వెళ్తే మంగళవారం రోజున ఉదయం 9 గంటలకు లింగంపల్లి-ఫలక్‌నూమా ఎక్స్‌ప్రెస్ బేగంపేట్ రైల్వే స్టేషన్‌కు వచ్చింది. అయితే ఆ ట్రైన్ కొద్దిసేపు ఆపి ముందుకు కదిలి వేగాన్ని పుంజుకుంటోంది. ఈ క్రమంలో సరస్వతి అనే ఓ ప్రయాణికురాలు ఆ కదులుతున్న ట్రైన్ ఎక్కేందుకు ప్రయత్నించింది. అదే సమయంలో అక్కడ విధులు నిర్వహిస్తున్న సనిత అనే ‘రైల్వే ప్రొటెక్క్షన్ ఫోర్స్’ (ఆర్పీఎఫ్) కానిస్టేబుల్ ఆమెను గుర్తించింది. వెంటనే పరిగెత్తుకెళ్లి ఆ ప్రయాణికురాలిని పట్టుకుని వెనక్కి లాగి రక్షించింది. ఒకవేళ కానిస్టేబుల్ సనిత అక్కడికి రాకపోయి ఉంటే ఆ ప్రయాణికురాలు ట్రైన్ కింద పడిపోయే ప్రమాదం ఉండేంది. దీనికి సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో నమోదయ్యాయి.

ఆ ప్రయాణికురాలిని రక్షించడంపై అధికారులు కానిస్టేబుల్ సనితను ప్రశంసిస్తున్నారు. ఇది వరకు కూడా సనిత రైల్వే స్టేషన్లలో మంచి పనులు చేసేదని.. ప్రయాణికుల సామాగ్రి కనబడకపోయిన లేదా అనుకోకుండా వదిలేసి వెళ్లిపోయిన వారికి వాటిని తిరిగి ఇచ్చేలా చర్యలు తీసుకునేదని అధికారులు వెల్లడించారు. నల్గొండ జిల్లాకు చెందిన సనిత 2020లో ఆర్పీఫ్‌లో చేరిందని ఆ తర్వాత బేగంపేట్ రైల్వే స్టేషన్‌లో విధులు నిర్వహిస్తుందని తెలిపారు.

ఇవి కూడా చదవండి

Rpf Constable Sanitha