Telangana: వైద్య రంగంలో తెలంగాణ రాష్ట్రాన్ని నంబర్‌వన్‌ చేద్దాం.. డాక్టర్లకు మంత్రి హరీశ్‌రావు సూచన..

డాక్టర్లు 24 గంటలూ అందుబాటులో ఉండాలని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు సూచించారు. ముఖ్యంగా రాత్రిపూట విధుల్లో ఉండే డ్యూటీ డాక్టర్లు తప్పుకుండా అందుబాటులో ఉండాలని కోరారు. పర్సనల్ వర్క్ మీద అమెరికా వెళ్లిన ఆయన.. అక్కడి నుంచే విధులు నిర్వహిస్తున్నారు.

Telangana: వైద్య రంగంలో తెలంగాణ రాష్ట్రాన్ని నంబర్‌వన్‌ చేద్దాం..  డాక్టర్లకు మంత్రి హరీశ్‌రావు సూచన..
Harish Rao
Follow us

|

Updated on: May 12, 2023 | 7:14 AM

Minister Harish Rao: డాక్టర్లు 24 గంటలూ అందుబాటులో ఉండాలని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు సూచించారు. ముఖ్యంగా రాత్రిపూట విధుల్లో ఉండే డ్యూటీ డాక్టర్లు తప్పుకుండా అందుబాటులో ఉండాలని కోరారు. పర్సనల్ వర్క్ మీద అమెరికా వెళ్లిన ఆయన.. అక్కడి నుంచే విధులు నిర్వహిస్తున్నారు. ఈమేరకు గురవారం సాయంత్రం బోధనాస్పత్రులపై వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. 210 మందికి అసోసియేట్‌ ప్రొఫెసర్లుగా పదోన్నతులు, 65 మందికి ప్రొఫెసర్లు ఇచ్చామని, 1,061 మంది అసిస్టెంట్‌ ప్రొఫెసర్ల పోస్టులను భర్తీ చేసినట్లు మంత్రి హరీశ్ రావు తెలిపారు.

ఈనెల 22న శిల్పకళా వేదికలో నిర్వహించే కార్యక్రమంలో వీరికి నియామక ఉత్తర్వులను అందజేస్తామన్నారు. వైద్య, ఆరోగ్య రంగంలో దేశంలోనే తెలంగాణ 3వ స్థానంలో ఉందని ఆయన అన్నారు. అలాగే తెలంగాణ రాష్ట్రాన్ని ఫస్ట్ ప్లేస్‌కు తీసుకువచ్చేందుకు తీవ్రంగా కృషి చేయాలని అధికారులకు సూచించారు.

మెడికల్‌ కాలేజీల్లో పనిచేసే టీచింగ్‌ ఫ్యాకల్టీ ర్యాగింగ్‌ లాంటివి లేకుండా చూడాలని, ఆదర్శంగా ఉండాలని మంత్రి హరీశ్ రావు సూచించారు. ఫారిన్‌లో డాక్టర్ విద్యను పూర్తి చేసిన 900 మంది తెలంగాణ స్టూడెంట్లకు ఏడాది ఇంటర్న్‌ షిప్‌ కోసం అవకాశమిచ్చామని ఆయన తెలిపారు.

ఇవి కూడా చదవండి

రాత్రిపూట డ్యూటీ డాక్టర్లు అందుబాటులో ఉండాల్సిందే..

రాత్రిపూట పనిచేసే డ్యూటీ డాక్టర్లతోపాటు, ఎమర్జెన్సీ విభాగంలో పనిచేసే డ్యూటీ డాక్టర్లు కచ్చితంగా అందుబాటులో ఉండాలని సూచించారు. ప్రసవాలు చేసేప్పుడు ముహూర్తాలకు తావు లేకుండా చూడాలని, గర్భిణీల ఆరోగ్య పరిస్థితిని బట్టి నార్మల్ డెలివరీ లేదా సిజేరియన్ డెలివరీ చేయాలని కోరారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..