లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పరాభవం వెనుక అసలు కారణం ఇదేనా..?

|

Jun 16, 2024 | 6:30 AM

పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా దక్కించుకోలేకపోయిన కారు పార్టీ.. అలా ఎందుకు జరిగిందనే అంశంపై క్లారిటీకి వచ్చేసిందా ? ఆ ఒక్క కారణం వల్లే తెలంగాణలో బీఆర్ఎస్‌ బోణి కొట్టలేకపోయిందని పార్టీ నేతలు ఫిక్స్ అయ్యారా ? పార్టీలోని ఆ కీలక నేత వ్యాఖ్యలు దేనికి సంకేతం. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు ఎన్నడూ లేని విధంగా చేదు ఫలితాలను మిగిల్చాయి. పార్టీ ఆవిర్భావం నుంచి సార్వత్రిక ఎన్నికల్లో రెండుకి తగ్గకుండా సీట్లు సాధించిన బీఆర్ఎస్.. 2024 ఎన్నికల్లో మాత్రం ఒక్క సీటు కూడా గెలవలేకపోయింది.

లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పరాభవం వెనుక అసలు కారణం ఇదేనా..?
Brs
Follow us on

పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా దక్కించుకోలేకపోయిన కారు పార్టీ.. అలా ఎందుకు జరిగిందనే అంశంపై క్లారిటీకి వచ్చేసిందా ? ఆ ఒక్క కారణం వల్లే తెలంగాణలో బీఆర్ఎస్‌ బోణి కొట్టలేకపోయిందని పార్టీ నేతలు ఫిక్స్ అయ్యారా ? పార్టీలోని ఆ కీలక నేత వ్యాఖ్యలు దేనికి సంకేతం. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు ఎన్నడూ లేని విధంగా చేదు ఫలితాలను మిగిల్చాయి. పార్టీ ఆవిర్భావం నుంచి సార్వత్రిక ఎన్నికల్లో రెండుకి తగ్గకుండా సీట్లు సాధించిన బీఆర్ఎస్.. 2024 ఎన్నికల్లో మాత్రం ఒక్క సీటు కూడా గెలవలేకపోయింది. మొత్తం 17 సీట్లలో 8 కాంగ్రెస్, 8 బీజేపీ, ఒక సీటు ఎంఐఎం గెలుచుకుంది. బీఆర్ఎస్‌కు పట్టున్న మెదక్ స్థానంలోనూ కారు పార్టీ విజయం సాధించకపోవడం.. ఆ పార్టీ శ్రేణులను సైతం ఆశ్చర్యపరిచింది. ఎన్నికల్లో గెలుపోటములు సహజమని.. తెలంగాణ ప్రజల కోసం బీఆర్ఎస్ పోరాడుతూనే ఉంటుందని ఆ పార్టీ నేతలు ప్రకటించారు. అయితే పార్లమెంట్ ఎన్నికల్లో ఈ రకమైన ఫలితాలు రావడానికి కారణమేంటి ? అనే అంశంపై బీఆర్ఎస్‌లో అంతర్మథనం మొదలైంది. తెలంగాణలో బలమైన విపక్షంగా ఉన్న పార్టీ.. లోక్‌సభ ఎన్నికల్లో ఇలాంటి ఫలితాలు చవిచూడటంపై కారణాలు విశ్లేషించుకున్నట్టు కనిపిస్తోంది.

సార్వత్రిక ఎన్నికల్లో పోటీ రెండు కూటముల మధ్య జరిగినట్టు ప్రజలు భావించారన్నారు బాల్క సుమన్. ఎన్డీయే, ఇండియా కూటమి మధ్య జరిగిన ఈ పోటీలో.. ఏ కూటమిలోనూ లేని పార్టీలు మంచి ఫలితాలు సాధించడంలో వెనుకబడ్డాయన్నారు. బీఆర్ఎస్‌తో పాటు ఏపీలో వైసీపీ, ఒడిశాలో బీజేడీ, యూపీలో బీఎస్పీ ఈ కోవలోకే వస్తాయని అంచనా వేశారు. బీఆర్ఎస్ ఓటమికి ప్రధాన కారణం ఏ కూటమిలోనూ లేకపోవడమేనన్నది సుమన్ వాదనగా కనిపిస్తోంది. దీంతో జాతీయ రాజకీయాల్లో ఏ పార్టీ వైపు ఉండకుండా ఒంటరిగా ముందుకెళ్లాలనే భావనలో ఉండే బీఆర్ఎస్.. ఈ అంశంలో పునరాలోచన చేస్తుందా అనే చర్చ జరుగుతోంది. అయితే తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల కంటే ముందు అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి కాబట్టి.. ఇప్పుడప్పుడే దీనిపై ఆలోచించాల్సిన అవసరం లేదన్న భావన కూడా ఆ పార్టీ నేతల్లో ఉన్నట్టు కనిపిస్తోంది. మొత్తానికి లోక్‌సభ ఎన్నికల్లో తమకు ఎదురైన ఓటమిపై బీఆర్ఎస్ పోస్టుమార్టం పూర్తయినట్టే కనిపిస్తోంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…