AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: పడక సుఖానికి అడ్డుగా మారాడని.. కడుపున పుట్టిన కొడుకునే

అమ్మ అన్న పదం విలువ తీసింది. కన్న కొడుకునే చిదిమేసింది. తన పడక సుఖానికి అడ్డుగా మారాడని.. క్రూరంగా చంపేసింది. ఆపై డెడ్‌బాడీని రోడ్డు పక్కన పడేసి తనకేం తెలియనట్లు నటించింది. కానీ పాపం పండింది. పోలీసుల విచారణలో నిజం బయటపడింది.

Telangana: పడక సుఖానికి అడ్డుగా మారాడని.. కడుపున పుట్టిన కొడుకునే
Anil Swathi
P Shivteja
| Edited By: |

Updated on: Jun 15, 2024 | 9:48 PM

Share

ప్రేగు తెంచుకుని జన్మనిచ్చిన తల్లే ఆ బిడ్డ గొంతు నులిమి చంపేసింది. శారీరక సుఖాలకు అలవాటు పడ్డ తల్లి అక్రమ సంబంధాలకు అడ్డు వస్తున్నాడని కన్న‌కొడుకునే చంపిన కర్కోటకురాలు. మొదటి భర్త చనిపోతే రెండో పెళ్లి చేసుకుంది. అయితే ఆ కొడుకు తన సుఖానికి అడ్డు అయ్యాడు. దీంతో మానవత్వం మంటగలిపేలా‌ ప్రవర్తించి మహిళా లోకానికి మాయని మచ్చలా మారింది ఈ తల్లి. తల్లి అనే పదానికి అర్థం లేకుండా చేసి కొడుకు గొంతు నులిమి హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించి రోడ్డు పక్కన పడేసిన ఘటన సంగారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది.

సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది. ఈ నెల 11 న ముత్తంగి ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్డులో గుర్తు తెలియని బాలుని శవం ఆచూకీతో పాటు ఆ కేసుకు సంబంధించిన మిస్టరీని పోలీసులు చాకచక్యంగా ఛేదించారు. పాత రామచంద్రాపురంలో నివాసం ఉంటున్న కర్రె స్వాతి తన మొదటి భర్త కుమార్ కుమారుడు విష్ణువర్దన్ (10). మొదటి భర్త కుమార్ చనిపోవడంతో దొంతు అనిల్‌ను రెండో వివాహం చేసుకుంది. అంతకుముందున్న పదేళ్ల కొడుకు విష్ణువర్దన్‌తో కలిసి రెండో భర్త వద్దే ఉంటోంది. తన శారీరక సుఖానికి కొడుకు విష్ణు అడ్డుగా ఉన్నాడని ఈ నెల 10 న గొంతు నులిమి చంపేసి ఆత్మహత్యగా చిత్రీకరించి రెండో భర్త అనిల్‌తో కలిసి అర్థరాత్రి స్కూటీపై వచ్చి ముత్తంగి ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్డు‌ పక్కన కర్దనూర్ వెళ్లే దారిలో పడేశారు. ఈ‌ నెల 11 న ఉదయం గుర్తు తెలియ‌ని బాలుడి మృతదేహం లభించింది. పటాన్ చెరు సీఐ ప్రవీణ్ రెడ్డి, క్రైమ్ సీఐ రాజు తమదైన శైలిలో విచారణ చేపట్టగా అసలు నిజాలు బయట పడ్డాయి. ఈ నెల 14 న స్వాతి, అనిల్‌ను అరెస్ట్ చేసి జుడిషియల్ రిమాండ్ కు పంపిన పఠాన్ చేరు పోలీసులు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…