AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Thunderbolt: పిడుగులు అంటే ఏమిటి ? ఎలా ఏర్పడతాయి

ఆవర్తన ద్రోణి కారణంగా.. ఆదివారం తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే చాన్స్ ఉందని అంచనా వేసింది. వచ్చే మూడు రోజుల పాటు కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు కురుస్తాయని తెలిపింది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని వెల్లడించింది.

Thunderbolt: పిడుగులు అంటే ఏమిటి ? ఎలా ఏర్పడతాయి
Thunderbolt
Ranjith Muppidi
| Edited By: |

Updated on: Jun 15, 2024 | 9:31 PM

Share

తెలంగాణకు వర్షసూచన చేసింది హైదరాబాద్ వాతావరణ కేంద్రం. రాగల 3 రోజులు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్ల మోస్తరు వర్షాలు పలు ప్రాంతాల్లో కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఆవర్తన ద్రోణి కారణంగా.. ఆదివారం కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే చాన్స్ ఉందని అంచనా వేసింది. వచ్చే మూడు రోజుల పాటు కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు కురుస్తాయని తెలిపింది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని వెల్లడించింది. ఈ సీజన్‌లో వర్షాలు కురిసే సమయంలో పిడుగులు పడే అవకాశం ఉందని.. రైతులు, రైతు కూలీలు చెట్ల కింద ఉండొద్దని సూచించింది.

వరదలు, భూకంపాలతో పోలిస్తే.. పిడుగును పెద్ద ప్రకృతి విపత్తుగా ఎవరూ భావించరు. కానీ నిజానికి పిడుగు కూడా పెను ముప్పే. రెప్పపాటులో వచ్చే మెరుపు… పచ్చని చెట్టును సైతం బూడిదలా మార్చేస్తుంది. మనిషిని నిలువునా కాల్చేస్తుంది. పొలాల్లో పిడుగులు పడిన సమయంలో మూగ జీవాలు కూడా మృత్యువాతపడతాయి. పిడుగు పడిందంటే రెప్పపాటులోనే ప్రాణాలు హరిస్తుంది. ఆవిరి రూపంలో నీటితో కూడిన మేఘాలు పరస్పరం ఢీకొట్టడం వల్లే పిడుగు ఏర్పడుతుంది. సహజంగా స్థంభాలు, ఎత్తైన చెట్ల ద్వారా ఆ విద్యుత్ తరంగాలు భూమిలోకి వెళ్తాయి. అలా వెళ్లే సమయంలో వాటి కింద ఏమి ఉన్నా ఖతమే. ఒక్కో సారి మైదాన ప్రాంతంలో కూడా పిడుగులు భూమి లోపలికి వెళ్తాయి. వర్షం కురిసినప్పుడే కాకుండా.. వేసవిలోనూ పిడుగులు పడుతుంటాయి. వాతావరణంలో మార్పు కూడా పిడుగుకు కారణం.

ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్నప్పుడు నీరు ఆవిరిగా రూపాంతరం చెంది ఆకాశంలో దాదాపు 25,000 అడుగుల ఎత్తు వరకు మేఘాలు కమ్ముకుంటాయి. అయితే పై నుంచి సూర్య కిరణాలు…ఎక్కువగా తాకడం వల్ల తక్కువ వెయిట్ ఉన్న ధనావేశిత మేఘాలు పైకి చేరుకుంటాయి. పెద్ద మొత్తంలో బరువు ఉండే ఎలక్ట్రాన్లు అధికంగా ఉన్న రుణావేశిత మేఘాలు కిందివైపుకు చేరుకుంటాయి. ఈ లెక్కన మనకు కనిపించే దట్టమైన కారు మబ్బుల్లో ఎలక్ట్రాన్లు పెద్ద మొత్తంలో ఉంటాయన్నమాట. సైన్స్ ప్రకారం, రుణావేశిత మేఘాలలోని ఎలక్ట్రాన్లు సమీపంలోని ధనావేశిత మేఘాలవైపు అట్రాక్ట్ అవుతాయి. అయితే ధనావేశిత మేఘాలు బాగా పైకి పోయినప్పుడు… ఇతర ఏ వస్తువు ఉన్నా అటువైపు ఎలక్ట్రాన్లు ప్రయాణం సాగిస్తాయి. ఆ క్రమంలోనే మేఘాల నుంచి ఎలక్ట్రాన్లు ఉన్నపలంగా.. విడుదలై విద్యుత్‌ క్షేత్రంగా మారి భూమి మీదకు వాయు వేగంతో దూసుకువస్తాయి. దాన్నే పిడుగు పడటం అంటారు.ః

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…