రేవంత్ బ్రదర్స్ కబ్జా స్టోరీ.. చూస్తే షాక్ తినాల్సిందే..!

కాంగ్రెస్‌ ఎంపీ రేవంత్‌రెడ్డి అతని సోదరుడు చేసిన కబ్జాల స్టోరీ చూస్తే షాక్ తినాల్సిందే. ఈ సోదరుల కబ్జాలపై రెవెన్యూ అధికారులు చర్యలను రెడీ అవుతున్నారు. ఇప్పటికే రాజేంద్రనగర్‌ RDO చంద్రకళ ఇచ్చిన రిపోర్ట్‌ను పూర్తి స్థాయిలో పరిశీలిస్తున్నారు.

రేవంత్ బ్రదర్స్ కబ్జా స్టోరీ.. చూస్తే షాక్ తినాల్సిందే..!
TV9 Telugu Digital Desk

| Edited By:

Mar 04, 2020 | 9:44 PM

కాంగ్రెస్‌ ఎంపీ రేవంత్‌రెడ్డి అతని సోదరుడు చేసిన కబ్జాల స్టోరీ చూస్తే షాక్ తినాల్సిందే. ఈ సోదరుల కబ్జాలపై రెవెన్యూ అధికారులు చర్యలను రెడీ అవుతున్నారు. ఇప్పటికే రాజేంద్రనగర్‌ RDO చంద్రకళ ఇచ్చిన రిపోర్ట్‌ను పూర్తి స్థాయిలో పరిశీలిస్తున్నారు. ఈ రిపోర్ట్ ఆధారంగా ఇక రేవంత్ బ్రదర్స్‌పై చర్యలు తప్పవని తెలుస్తోంది. రేవంత్‌ రెడ్డీ సోదరుల భూబాగోతంపై RDO రిపోర్టులను.. పక్కా సాక్ష్యాలతో పొందుపరిచారు. వందల కోట్ల రూపాయల విలువైన భూములను.. రేవంత్ బ్రదర్స్ ఆక్రమించినట్లు గుర్తించారు. ప్రభుత్వ, ప్రైవేటు, చెరువు భూములను సైతం వీరు వదల్లేదని నివేదికల్లో తేల్చారు. అంతేకాదు.. వీరు రికార్డులను కూడా తారుమారు చేసినట్లు RDO గుర్తించారు. 2005లో పహాణీలో ఇష్టారీతిన అప్పటి రెవెన్యూ అధికారులు మార్పులు చేశారు. A.రేవతి రెడ్డి W/o నర్సింహారెడ్డిగా పహాణీలో పేరును చేర్చారు. ఆ తర్వాత అనుముల రేవంత్‌రెడ్డి S/o నర్సింహారెడ్డిగా పేరును మార్పు చేశారు. ఇలా భూముల కబ్జా కోసం రేవంత్ బ్రదర్స్ అడ్డదారులను తొక్కారు. అంతేకాదు.. పహాణీలను సైతం పూర్తిగా మార్చేసి ఉంటారని అధికారులు భావిస్తున్నారు. వీటిని ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపించే యోచనలో అధికారులు ఉన్నారు.

ఇక ఈ రిపోర్టులో గోపన్‌పల్లి సర్వే నెంబర్ 127లో భూలావాదేవీల వివరాలను పూర్తిగా జతచేశారు. కోమటికుంటలో FTL బఫర్ జోన్‌లోనూ ఎకరా 14 గుంటల్లో రేవంత్ రెడ్డి బ్రదర్స్‌ పాగా వేసినట్లు గుర్తించారు. వాల్టా చట్టానికి విరుద్ధంగా చెరువు భూములను కబ్జా చేసినట్లు కూడా గుర్తించారు. అంతేకాదు కోమటి చెరువు శిఖం భూమిలోనే కాంపౌండ్ వాల్‌ను కట్టారు. సర్వే నెంబర్ 34లో కూడా.. ఒక ఎకరా 11 గుంటల భూమిని కబ్జా చేశారు. చెరువులోకి నీళ్లు రాకుండా అడ్డుకట్ట వేసినట్లు కూడా గుర్తించారు.

అంతేకాదు.. గోపనపల్లి రోడ్డును కూడా వీరు వదల్లేదు. సర్వే 127లో బండ్ల బాటను.. సర్వే నెం 128, 160ల్లో 10 గుంటల ప్రయివేట్ స్థలాన్ని కూడా కబ్జా చేశారు. ఇంకా వేరే వారితో కలిసి రేవంత్ పేరిట పహాణీలో 10 ఎకరాల 21 గుంటల భూమిని చేర్చారు. అయితే రికార్డుల్లో మాత్రం ఆ భూమి..13 ఎకరాల 11 గుంటలుగా నమోదు చేశారు. అప్పటి ఎమ్మార్వోలు రాజేశ్వర్‌రెడ్డి, సుబ్బారావు రికార్డులు తారుమారు చేసినట్లు అధికారులు గుర్తించారు. ఈ భూములకు సంబంధఇంచి ఇప్పటికే 7 కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో రేవంత్‌ రెడ్డి బ్రదర్స్‌ కబ్జా.. ఏ స్థాయిలో ఉందో అర్ధమవుతోంది.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu