AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: రూ.20 వేల లంచం.. ఏసీబీకి అడ్డంగా దొరికిన టౌన్ ప్లానింగ్ అధికారి

Hyderabad: ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారులు లంచం డిమాండ్ చేస్తే ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఏసీబీని ఆశ్రయించాలని అధికారులు సూచించారు. తెలంగాణ ఏసీబీ టోల్‌ఫ్రీ నంబర్ 1064కు ఫిర్యాదు చేయవచ్చు. అలాగే 9440446106 వాట్సాప్ నంబర్ ద్వారా కూడా సమాచారం ఇవ్వొచ్చని తెలిపారు..

Hyderabad: రూ.20 వేల లంచం.. ఏసీబీకి అడ్డంగా దొరికిన టౌన్ ప్లానింగ్ అధికారి
Acb
Ranjith Muppidi
| Edited By: |

Updated on: Aug 19, 2026 | 4:34 PM

Share

Hyderabad: భవన నిర్మాణానికి అనుమతి తీసుకునేందుకు వెళ్లిన ఓ వ్యక్తి నుంచి లంచం తీసుకుంటూ టౌన్ ప్లానింగ్ అధికారిణి ఏసీబీకి చిక్కారు. భవన నిర్మాణ అనుమతి ఫైల్‌ను క్లియర్ చేసి, బిల్డింగ్ పర్మిట్ ఆర్డర్‌తో పాటు వర్క్ కమెన్స్‌మెంట్ లెటర్ జారీ చేసేందుకు రూ.20 వేలు ఇవ్వాలని ఆమె డిమాండ్ చేసినట్లు అధికారులు తెలిపారు. చార్మినార్ జోన్ పరిధిలోని సంతోష్‌నగర్ సర్కిల్-25లో ఈ ఘటన చోటుచేసుకుంది.

సీహెచ్ ప్రభావతి లంచం డిమాండ్ చేసినట్లు బాధితుడు ఏసీబీకి ఫిర్యాదు చేశాడు. దీంతో రంగంలోకి దిగిన సిటీ రేంజ్-1 ఏసీబీ అధికారులు పక్కా ప్రణాళికతో ట్రాప్ నిర్వహించారు. ఫిర్యాదుదారుడి నుంచి రూ.20 వేలు తీసుకుంటున్న సమయంలో ప్రభావతిని అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఆమె వద్ద నుంచి లంచం మొత్తాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం కేసు నమోదు చేసి నాంపల్లిలోని ఏసీబీ కేసుల అదనపు ప్రత్యేక న్యాయస్థానంలో హాజరుపరిచారు. కోర్టు ఆదేశాలతో ఆమెను జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు.

కేసుపై తదుపరి దర్యాప్తు కొనసాగుతోంది. ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారులు లంచం డిమాండ్ చేస్తే ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఏసీబీని ఆశ్రయించాలని అధికారులు సూచించారు. తెలంగాణ ఏసీబీ టోల్‌ఫ్రీ నంబర్ 1064కు ఫిర్యాదు చేయవచ్చు. అలాగే 9440446106 వాట్సాప్ నంబర్ ద్వారా కూడా సమాచారం ఇవ్వొచ్చని తెలిపారు. ఫిర్యాదుదారుల వివరాలను గోప్యంగా ఉంచుతామని ఏసీబీ స్పష్టం చేసింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ
రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..
రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా
భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ
రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!
రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!
మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర
మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర