AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Medak: పక్కాగా ప్లాన్ చేశారు.. రాత్రి పూట వచ్చి పని పూర్తి చేసి వెళ్లారు..

మెదక్ జిల్లాలో దొంగలు వరుస ఏటీఎం చోరీలకు పాల్పడ్డారు. ఒకే రోజు కొన్ని గంటల వ్యవధిలో గవ్వలపల్లి, మంభోజిపల్లిలోని ఎస్బీఐ ఏటీఎంలను టార్గెట్ చేశారు. మంభోజిపల్లిలో గ్యాస్ కట్టర్‌తో ఏటీఎం మిషన్‌ను ధ్వంసం చేసి రూ.14 లక్షల నగదును దోచుకెళ్లారు. సీసీ కెమెరాల్లో చోరీ దృశ్యాలు రికార్డయ్యాయి. నిందితుల కోసం పోలీసులు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించి దర్యాప్తు ముమ్మరం చేశారు.

Medak: పక్కాగా ప్లాన్ చేశారు.. రాత్రి పూట వచ్చి పని పూర్తి చేసి వెళ్లారు..
ATM Theft
P Shivteja
| Edited By: |

Updated on: Aug 19, 2026 | 4:29 PM

Share

మెదక్ జిల్లాలో దొంగలు బీభత్సం సృష్టించారు. ఒకే రోజు.. కేవలం కొన్ని గంటల వ్యవధిలో రెండు వేర్వేరు ప్రాంతాల్లోని ఎస్బీఐ ఏటీఎంలను టార్గెట్ చేసి భారీ దోపిడీకి పాల్పడ్డారు. మంభోజిపల్లిలోని ఏటీఎంను గ్యాస్ కట్టర్‌తో ధ్వంసం చేసిన దుండగులు.. ఏకంగా రూ.14 లక్షల నగదును ఎత్తుకెళ్లారు. ఒకే రోజు రెండు చోట్ల ఏటీఎం చోరీలు జరగడంతో జిల్లా ప్రజలు, బ్యాంకు అధికారులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.

పరిస్థితి చూస్తే దొంగలు పక్కా ప్లాన్‌తో రెచ్చిపోయారు. రాత్రి వేళల్లో సంచరిస్తూ ఎస్బీఐ ఏటీఎంలను టార్గెట్ చేశారు. చిన్నశంకరంపేట మండలం గవ్వలపల్లిలోని ఎస్బీఐ ఏటీఎంతో పాటు మెదక్ మండలం మంభోజిపల్లిలోని ఎస్బీఐ ఏటీఎంలోనూ చోరీకి పాల్పడ్డారు. ఒకే రోజు రెండు వేర్వేరు మండలాల్లో జరిగిన ఈ వరుస చోరీలు పోలీసులకు సవాల్‌గా మారాయి.

మంభోజిపల్లి ఎస్బీఐ ఏటీఎం వద్ద దుండగులు పక్కా స్కెచ్‌తో వ్యవహరించారు. కారులో వచ్చిన ముగ్గురు వ్యక్తులు.. తమను ఎవరూ గుర్తుపట్టకుండా ముఖాలకు గుడ్డలు కట్టుకుని ఏటీఎం కేంద్రంలోకి ప్రవేశించారు. అనంతరం గ్యాస్ కట్టర్‌తో ఏటీఎం మిషన్‌ను ధ్వంసం చేసి.. అందులో ఉన్న రూ.14 లక్షల నగదును దోచుకుని పరారయ్యారు. ఈ చోరీకి సంబంధించిన దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాల్లో స్పష్టంగా రికార్డయ్యాయి.

ఒకే రోజు జిల్లాలో రెండు ప్రాంతాల్లో ఏటీఎం చోరీలు జరగడంతో మెదక్ జిల్లా పోలీస్ యంత్రాంగం అప్రమత్తమైంది. సమాచారం అందుకున్న వెంటనే జిల్లా ఎస్పీ డీవీ శ్రీనివాసరావు, డీఎస్పీ ప్రసన్నకుమార్ సిబ్బందితో కలిసి ఘటనా స్థలాలను పరిశీలించారు. సీసీటీవీ ఫుటేజీని క్షుణ్ణంగా పరిశీలించిన పోలీసులు.. నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు.

క్లూస్ టీమ్ సాయంతో ఘటనా స్థలాల్లో వేలిముద్రలు, ఇతర ఆధారాలను సేకరిస్తున్నారు. ఈ వరుస ఏటీఎం చోరీల వెనుక అంతర్రాష్ట్ర దొంగల ముఠా హస్తం ఉందా? అనే కోణంలోనూ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. సీసీటీవీ ఫుటేజీ, సాంకేతిక ఆధారాల ఆధారంగా నిందితులను గుర్తించే పనిలో ప్రత్యేక బృందాలు నిమగ్నమయ్యాయి.

Follow Us
నెలకు రూ.1.56 లక్షల జీతంతో ఇన్‌స్యూరెన్స్‌ కంపెనీలో 225 ఉద్యోగాలు
నెలకు రూ.1.56 లక్షల జీతంతో ఇన్‌స్యూరెన్స్‌ కంపెనీలో 225 ఉద్యోగాలు
వివో నుంచి కొత్త ఇయర్ బడ్స్.. ఈ ఫీచర్లు చూశారా..?
వివో నుంచి కొత్త ఇయర్ బడ్స్.. ఈ ఫీచర్లు చూశారా..?
అమెరికాలో H-1B ఉద్యోగులకు షాక్.. 60 రోజుల గ్రేస్ పీరియడ్ రద్దు?..
అమెరికాలో H-1B ఉద్యోగులకు షాక్.. 60 రోజుల గ్రేస్ పీరియడ్ రద్దు?..
భయంకరమైన మలుపులు.. క్లైమాక్స్‏లోనే అసలు ట్విస్ట్..
భయంకరమైన మలుపులు.. క్లైమాక్స్‏లోనే అసలు ట్విస్ట్..
అబ్బాయి శరీరంలో గర్భాశయం.. పిల్లలు పుట్టట్లేదని హాస్పిటల్‌కు..
అబ్బాయి శరీరంలో గర్భాశయం.. పిల్లలు పుట్టట్లేదని హాస్పిటల్‌కు..
మొండి షుగర్ వ్యాధి, రక్తహీనతను తరిమికొట్టే పవర్ఫుల్ ఆకు..
మొండి షుగర్ వ్యాధి, రక్తహీనతను తరిమికొట్టే పవర్ఫుల్ ఆకు..
వినాయకుడి విగ్రహం ఇంట్లో పెట్టుకుంటున్నారా? ఈ విషయాలు తెలిస్తేనే
వినాయకుడి విగ్రహం ఇంట్లో పెట్టుకుంటున్నారా? ఈ విషయాలు తెలిస్తేనే
బ్రిక్స్ సదస్సు కోసం ఢిల్లీ చేరుకున్న పలు దేశాల నేతలు..
బ్రిక్స్ సదస్సు కోసం ఢిల్లీ చేరుకున్న పలు దేశాల నేతలు..
గచ్చిబౌలిలో దారుణం.. అందరూ చూస్తుండగానే హత్య!
గచ్చిబౌలిలో దారుణం.. అందరూ చూస్తుండగానే హత్య!
పీఎఫ్ అకౌంట్ ఉన్నవారికి నాలుగు బెనిఫిట్స్.. చాలామందికి ఈ విషయాలు.
పీఎఫ్ అకౌంట్ ఉన్నవారికి నాలుగు బెనిఫిట్స్.. చాలామందికి ఈ విషయాలు.