ఆ పోలీసుల తీరుపై నెటిజన్ ట్వీట్.. కేటీఆర్ రియాక్షన్ అదుర్స్..
సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే మంత్రి కేటీఆర్.. మరోసారి తనదైన శైలిలో ఓ నెటిజన్ చేసిన ట్వీట్‌కు రెస్పాండ్ అయ్యారు. తాజాగా హైదరాబాద్‌లోని పటాన్ చెరులో ఓ ప్రైవేటు కాలేజ్‌కి చెందని ఓ విద్యార్థిని అనుమానస్పద స్థితిలో మృతి చెందింది. అయితే ఆమె విద్యార్ధిని మృతదేహాన్ని పోలీసులు హడావుడిగా తరలించేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో పోలీసులను సదరు విద్యార్ధిని తండ్రి అడ్డుకోబోయారు. ఈ క్రమంలో పోలీసులు ఆయనను కాలితో తన్నారు. దీనికి సంబంధించిన ఘటనను అక్కడే […]
సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే మంత్రి కేటీఆర్.. మరోసారి తనదైన శైలిలో ఓ నెటిజన్ చేసిన ట్వీట్‌కు రెస్పాండ్ అయ్యారు. తాజాగా హైదరాబాద్‌లోని పటాన్ చెరులో ఓ ప్రైవేటు కాలేజ్‌కి చెందని ఓ విద్యార్థిని అనుమానస్పద స్థితిలో మృతి చెందింది. అయితే ఆమె విద్యార్ధిని మృతదేహాన్ని పోలీసులు హడావుడిగా తరలించేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో పోలీసులను సదరు విద్యార్ధిని తండ్రి అడ్డుకోబోయారు. ఈ క్రమంలో పోలీసులు ఆయనను కాలితో తన్నారు. దీనికి సంబంధించిన ఘటనను అక్కడే ఉన్న కొందరు చిత్రీకరించి.. సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేశారు. పోలీసుల తీరుపై తీవ్ర విమర్శలు వచ్చాయి. అయితే ఈ వీడియోను ఓ నెటిజన్ తెలంగాణ పోలీసులకు ట్యాగ్ చేస్తూ.. ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. అది చూసిన మంత్రి కేటీఆర్.. వెంటనే రియాక్ట్ అయ్యారు.
పోలీసుల తీరుపై మంత్రి కేటీఆర్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. అంతేకాదు.. ఈ పోలీసుల తీరును హోం మంత్రి, డీజీపీల దృష్టికి తీసుకెళ్తానని ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. కష్టకాలంలో ఉన్న బాధితుల పట్ల.. ఏ ప్రభుత్వ అధికారులైనా సానుభూతి ప్రదర్శించాలని.. ఎవరైనా కూడా అదే కోరుకుంటారని ట్వీట్‌లో పేర్కొన్నారు.
Will take it to the notice& request Home Minister Mahmood Ali Saab and @TelanganaDGP Garu to review the insensitive handling by these policemen
Showing empathy in times of grief such as this is the basic courtesy that is expected of Govt officials https://t.co/UTd8H8TXh9
— KTR (@KTRTRS) February 26, 2020