సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి ఘాటైన వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి తనపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని.. ఆయన ఫేక్‌న్యూస్ పెడ్లర్ అంటూ విమర్శలు సంధించారు. ఈ మేరకు శుక్రవారం సోషల్ మీడియా ప్లాట్ ఫాం ఎక్స్ వేదికగా పలు ప్రశ్నలు సంధించారు. సీఎం రేవంత్ రెడ్డి.. తన బంధువుకు రూ.10 వేల కోట్ల కొవిడ్ డ్రగ్ కాంట్రాక్ట్ వచ్చిందని గతంలో ఆరోపించారన్నారు కేటీఆర్, అంతేకాదు గతంలో తాము అధికారంలో ఉన్న సమయంలో సచివాలయంలో నిజాం ఆభరణాల కోసం సొరంగం తవ్వినట్లు కథనాలు సృష్టించారని.. ఆయనో ఫేక్‌న్యూస్ పెడ్లర్ అంటూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
1. Revanth manufactured a shameless Lie that my relative got 10000 crore Covid Drug Contract
2. The same Joker created Fake narrative that I dug Nizams jewels which were under Secretariat
3. Revanth circulated Fake Video of Union Home Minister
4. Being a CM he posted a…
— KTR (@KTRBRS) May 24, 2024
కాగా.. గత కొన్ని రోజుల నుంచి కాంగ్రెస్.. బీఆర్ఎస్ పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలు, వరికి బోనస్ తదితర అంశాలే టార్గెట్ గా బీఆర్ఎస్ కాంగ్రెస్ ను విమర్శిస్తోంది.. అదే స్పీడులో కాంగ్రెస్ పార్టీ సైతం తెలంగాణ అభివృద్ధి గురించి కౌంటర్ ఇస్తూ గులాబీ పార్టీపై విరుచుకుపడుతోంది.. ఈ క్రమంలోనే కేటీఆర్ సోషల్ మీడియాలో పలు వ్యాఖ్యలు చేయడం సంచలనంగా మారింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..